EPAPER

TDP Leaders: బాబు అడ్డాలో తలలు పట్టుకుంటున్న టీడీపీ నేతలు.. ఎందుకంటే..?

TDP Leaders: బాబు అడ్డాలో తలలు పట్టుకుంటున్న టీడీపీ నేతలు.. ఎందుకంటే..?

Chittoor TDP Leaders big Troubles: చిత్తూరు జిల్లా తెలుగు తమ్ముళ్ళు తెగ ఫీలై పోతున్నారు. అధికారం వచ్చిందనే సంతోషమే లేకుండా పోయిందని తలలు పట్టుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేనన్ని సీట్లు జిల్లాలో గెలిచామని అయినా ఆ సంతోషం లేకుండా పోయిందని తెగ మదనపడుతున్నారు. ఇప్పటికే తాము న్యాయం కోసం రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తోందని భాధ చెప్పుకుందామనుకుంటే ఎవరూ లేరని అసహనం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ హయాం నాటి అధికారుల్నే ఇప్పటికీ కొనసాగిస్తుండటంతో.. వారు ఇంకా ఆ పార్టీ నేతలకే భజన చేస్తున్నారంట. దాంతో తమ సమస్యల పరిష్కారానికి ఆందోళనలు నిర్వహించాల్సి వస్తుందని టీడీపీ కేడర్ వాపోతోంది.


ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని టీడీపీ కేడర్ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పోలీసుల వేధింపులతో నరకం చూశారు. అక్రమ కేసులతో ఊళ్లు విడిచి బతికారు. టీడీపీ శ్రేణులపై పెట్టిన అక్రమ కేసుల్లో చిత్తూరు జిల్లా రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ప్రభుత్వం మారినా, టీడీపీ శ్రేణుల పరిస్థితి మాత్రం మారలేదని తమకు ఈ ఖర్మేంటని తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. గత ప్రభుత్వంలో జిల్లా యంత్రాంగాన్నంతా వైసీపీ నేతలు రిమోట్ కంట్రోల్‌తో నడిపించారు. సిబ్బంది సైతం వారి పట్ల అంతే విధేయత ప్రదర్శిస్తూ.. వైసీపీ శ్రేణుల్లా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి.

కూటమి సర్కారు ఏర్పటి రెండు నెలలవుతున్నా జిల్లాలో పోలీసు, రెవెన్యూ, సబ్ రిజిస్టర్, ఎంపిడివోలు సహా ఇతర అధికారులు బదిలీలు జరగకపోవడంతోనే సమస్య వచ్చిపడిందని‌‌‌ ముఖ్యంగా నాటి పోలీసులంతా ఇప్పటికీ వైసీపీకి అనుకూలంగా ఉంటూ, టీడీపీ శ్రేణుల్ని నిబంధనల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు ‌‌‌. ఎలాగూ బదిలీ అయిపోతాం కదా అని కొందరు పోలీసులు టీడీపీ కేడర్‌కు చుక్కలు చూపిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పిస్తుస్నారు. దాంతో అధికారంలో ఉండి కూడా రోడ్డెక్కి నిరసనలు, ధర్నాలు చేయాల్సి వస్తుందని అంటున్నారు.


పలమనేరు సీఐ చంద్రశేఖర్ ఎస్ఐగా ఉన్నప్పటి నుంచీ అదే నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. వైసిపి మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ అక్రమంగా తన క్వారీ లోనే టిప్పర్లు,ఇతర వస్తువులను తరలించుకు పోయారని జూన్ 8వ తేదీన జనార్దన నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పలమనేరు సీఐ చంద్రశేఖర్ పట్టించుకోలేదు. దీంతో ఆయన నేరుగా సీఎం చంద్రబాబును కలిసి వైసీపీ మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ నిర్వాకాన్ని వివరించారు. వైసీపీ అధి కారంలోకి రాగానే అప్పటి పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ తన క్వారీ, టిప్పర్లు బలవంతంగా స్వాధీనం చేసుకొన్నారని లీజుకోసం ఆయన ఇచ్చిన చెక్కులు కూడా చెల్లక తాను ఇబ్బంది పడ్డానని చెప్పారు.

ఇదే సమయంలోఓ టీడీపీ నేత రెండు ట్రాక్టర్ల ఇసుకను ఇంటి నిర్మాణానికి తీసుకెళ్తుండగా.. సీఐ ఆ ట్రాక్టర్లను అడ్డగించి నిబంధనల పేరుతో స్టేషన్‌కు తరలించి లంచం అడుగుతున్నారని డ్రైవర్లను దూషించారంటూ వంద మందికిపైగా టీడీపీ శ్రేణులు పలమనేరు స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఎస్అర్‌పురం స్టేషన్ పరిధిలో ఎర్రచందనాన్ని చెరువు నీటిలో దాచి ఉంచగా వచ్చిన సమాచారం మేరకు పట్టుకున్నారు. స్థానికంగా బలమైన వైసిపి నాయకుడు కూడా పట్టుబడ్డాడు.. అయితే ఎర్రచందనం పట్టుబడ్డ రోజు నిందితులను వదిలేసారంటు టిడిపి శ్రేణులు స్టేషన్ ఎదుట అందోళన చేసారు.

ఎర్రచందనం వ్యవహారంలో తమ భాగోతం బయటపడుతుందన్న భయంతో పోలీసులు హాడావుడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెరువులో దొరికిన దొంగలను మామిడితోటలో దొరికాయని ఓ ప్రెస్ నోట్ రీలీజ్ చేసారు. మొత్తం 32 దొంగలు దొరికాయని పోలీసులు చెప్తుంటే.. దొరికిన దుంగల విలువ కోటికి పైగా ఉంటుందని అంటున్నారు.. అయితే అసలు స్మగ్లర్ ను వదిలేసి ఐదుగురు నిందితులను చూపించారు. ఈ హాడావుడి జరుగుతున్న సమయంలో అటుగా వెళుతున్న జిడినెల్లూరు ఎమ్మెల్యే థామస్ ఆగి పోలీసులకు క్లాస్ పీకారు. ఇంకా వైసీపీ ప్రభుత్వం ఉందనుకుంటున్నారా? ఎర్రచందనం నిందితుడికి 41ఏ నోటీసు ఎలా ఇస్తారని అగ్రహం వ్యక్తం చేసారు. వైసీపీ వారి దగ్గర లంచాలకు మరిగారని ఘాటుగా విమర్శించారు.

Also Read: రివర్స్ గేర్‌లో దూసుకుపోతున్న వైసీపీ.. అయోమయంలో జగన్

ఇలా చెప్పుకుంటూ పోతే తవణంపల్లె, సత్యవేడు,తంబళ్లపల్లె ఇలా అన్ని చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తుంది.‌ పోలీసులే అనుకుంటే ఇటు రెవెన్యూ, సబ్ రిజిస్టర్ అధికారులు తీరులో ఏ మాత్రం మార్పు లేదంటన్నారు. ఎలాగో ట్రాన్స్ ఫర్ చేస్తారు. అంత మాత్రం దానికి మీరు చెప్పిందే మేము ఎందుకు చేయాలని కొందరు అధికారులు టీడీపీ నేతల్ని ఎదురు ప్రశ్నిస్తున్నారంట. గత అయిదేళ్లలో అందినకాడికి దండుకున్న అధికారుల స్వామిభక్తితో ఇప్పటికీ అన్ని శాఖల్లో వైసీపీ నేతల హవానే నడుస్తుండటం కూటమి శ్రేణులను మింగుడుపడటం లేదు. పైన ప్రభుత్వం మారింది కాని ఇంకా కింద స్థాయిలో పాత వాసనలు పోవడం లేదని వామపక్షాల నాయకులే విమర్శిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

మొత్తానికి అధికారుల వ్యవహారశైలితో ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడుతున్నారనే ప్రచారం సాగుతుంది. కాని ఎవరికి చెప్పుకోవాలో తెలియక టైం కోసం చూస్తున్నారంట. ఇక యువ ఐఏఎస్ అధికారులు జిల్లాలో కీలక స్థానాలలో పనిచేస్తున్నారు. వారు చంద్రబాబు వద్ద మాత్రమే అంతా మీరు చెప్పినట్లు చేస్తామని చెప్పి క్షేత్ర స్థాయిలో మాత్రం పార్టీ నేతల మాట అసలు పట్టించుకోవడం లేదంట. గత ప్రభుత్వ అక్రమాలపై ఆధారాలతో సహా ఫిర్యాదులు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటున్నారు. గట్టిగా అడిగితేచూద్దాం చేద్దాం అంటూ లెక్క చేయకుండా వ్యవహరిస్తున్నారంట. 2014-16 మధ్య కాలంలోజిల్లాకు సిద్ధార్థ జైన్ కలెక్టర్ గా ఉన్నప్పుడు టీడీపీ నాయకులకు చుక్కలు చూపించారని ఇప్పుడు అదే పరిస్థితి దాపురించిందని బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

అప్పట్లో సీనియర్ నేత మాజీమంత్రి అమర్ నాథ్ రెడ్డి ఒత్తిడితో కలెక్టర్ ను మార్చడం జరిగిందని ఇప్పుడు అ పరిస్ధితి లేకుండా పోయిందంటున్నారు. జిల్లాకు చెందిన సీనియర్ నాయకుల్లో ఒకరికైనా మంత్రి పదవి వస్తుందని వారి దగ్గరకు తమ పనులు చేసుకోవచ్చునని అనుకున్నారు. అయితే అందరు ఉహించని విధంగా జల్లాకు ఒక్క మంత్రి పదవీ రాలేదు. దీంతో సినియర్లు అయినా అమర్ నాధ రెడ్డి, పులివర్తి నాని లాంటి నాయకులు తమ నియోజకవర్గం పరిధి దాటి బయటకు రావడం లేదు. జిల్లా కు మంత్రి ఉండిఉంటే కనీసం జిల్లా ఉన్నతాధికారులకు చెప్పి అన్ని నియోజకవర్గాలను సమన్వయం చేసేవారంటున్నారు. ఇటు అధికారులు పట్టించుకోకుండా నేతలు చూద్దాం లే అన్నట్లుగా ఉండటంతో మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని పార్టీ కేడర్ వాపోతుంది.

కనీసం నామినేటెడ్ పదవుల్లో అయినా జిల్లా కు అవకాశం ఇస్తారో లేదో అని అది కూడా లేకపొతే జిల్లా అధికారులు వద్ద కనీసం గౌరవం కూడా ఉండదని ద్వితీయ శ్రేణి నాయకత్వం భయపడుతోంది. ప్రతి పనికి అమరావతి వచ్చేంత స్దాయి తమకు లేదని ఒకవేళ ఉన్నా నేరుగా సిఎంను, లోకేష్‌లను కలిసే అవకాశం ఎంతమందికి ఉంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి కైనా జిల్లాపై సీనియర్ నేతలు, పార్టీ పెద్దలు ఫోకస్ పెట్టి పాత అధికారులను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ముఖ్యమంత్రి సొంత జిల్లాలో తెలుగు తమ్ముళ్ల పరిస్థితి అలా తయారైందిప్పుడు.

Related News

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Big Stories

×