EPAPER

IAS Smita Sabharwal: స్మితా సబర్వాల్‌కు బిగ్ షాక్.. హైకోర్టులో పిటిషన్ దాఖలు

IAS Smita Sabharwal: స్మితా సబర్వాల్‌కు బిగ్ షాక్.. హైకోర్టులో పిటిషన్ దాఖలు

Petition in High Court against IAS Smita Sabharwal: తెలంగాణ డైనమిక్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ స్మితా సబర్వాల్‌కు బిగ్ షాక్ తగిలింది. దివ్యాంగులపై స్మితా సబర్వాల్ కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. సామాజిక వేత్త వసుంధర హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌లో యూపీఎస్సీ చైర్మన్‌కు ఆదేశాలు ఇవ్వాలంటూ పేర్కొన్నారు.


ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారించింది. పిటిషనర్‌కు ఉన్న అర్హతను ప్రశ్నించగా..పిటిషనర్ ఒక దివ్యాంగురాలని అడ్వకేట్ కోర్టుకు తెలిపారు. అయితే పూర్తి వివరాలతో అఫిడవిట్ సమర్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా, సివిల్స్ నియామకాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరం లేదని స్మితా సబర్వాల్ అభిప్రాయం వ్యక్తం చేసింది. అలాగే క్షేత్ర స్థాయిలో పనిచేయాల్సిన ఉద్యోగంలో కోటా ఎందుకని, డెస్కుల్లో పనిచేసే ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్లు ఉండాలన్నారు.

ఇదిలా ఉండగా, ఐఏఎస్‌లో దివ్యాంగుల కోటాపై స్మితా సబర్వాల్ ఎక్స్ లో పోస్ట్ చేసిన వ్యాఖ్యలపై గత కొంతకాలంగా చర్చ నడుస్తోంది. ఇందులో అంగవైకల్యం ఉన్న పైలట్‌ను విమానయాన సంస్థ నియమించుకుంటుందా? దివ్యాంగ సర్జన్ ను విశ్వసిస్తారా? ఫీల్డ్ వర్క్, పనున్నల వసూళ్లు, ప్రజా ఫిర్యాదులను నేరుగా విచారించే అవసరం ఉంటుంది. కావున ఇలాంటి సేవలకు రిజర్వేషన్ కోటా అవసరమా అంటూ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు.


Also Read: ఢిల్లీ లిక్కర్ కేసు.. కవితకు మళ్లీ నిరాశే, ఆగస్టు 20న మరోసారి..

అయితే కొంతమంది ఈ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. దివ్యాంగులను సంకుచిత దృక్పథంతో చూడరాదని, వారి అర్హతపై ఇలా మాట్లాడడం తగతదని మండిపడ్డారు.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×