EPAPER

Kolkata Doctor murder: దేశవ్యాప్తంగా డాక్టర్ల సమ్మె.. కోల్‌కతా మర్డర్‌కు వ్యతిరేకంగా భారీ నిరసన

Kolkata Doctor murder: దేశవ్యాప్తంగా డాక్టర్ల సమ్మె.. కోల్‌కతా మర్డర్‌కు వ్యతిరేకంగా భారీ నిరసన

Kolkata Doctor murder news(Latest breaking news in telugu): పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఇటీవల ఒక మహిళ ట్రైనీ డాక్టర్‌పై ఒక కిరాతకుడు క్రూరంగా అత్యాచారం చేసి, హత్య చేశాడు. ఈ ఘటనపై డాక్టర్లందరూ దేశ వ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో సోమమారం ఆగస్టు 12న దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు రెసిడెంట్ డాక్టర్ సంఘం.. ఫోర్డా (ది ఫెడరేషన్ ఆఫ్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ) ప్రకటించింది. కేంద్ర మంత్రి జెపి నడ్డాకు ఈ మేరకు ఫోర్డా వైద్యులు ఓ లేఖ రాశారు. మరోవైపు కోల్ కతా వైద్యురాలి హత్యాచార కేసుని సిబిఐ చేత విచారణ చేయించాలని కేంద్ర మంత్రి సుకాంత మజుందార్‌ డిమాండ్‌ చేశారు.


డాక్టర్ దేశవ్యాప్త సమ్మెకు మద్దతు తెలుపుతూ దేశ రాజధాని ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులు.. దీన్ దయాల్ ఉపాధ్యాయ్ హాస్పిటర్, లేడీ హర్డింగ్ మెడికల్ కాలేజీ, మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ, వియంయంసి సఫ్దర్ జంగ్ హాస్పిటల్ వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.

Also Read:  వెబ్ సిరీస్ చూసి బాలుడి మర్డర్.. ప్రేమ కోసం హంతకురాలిగా మారిన ఎంబిబియస్ విద్యార్థిని


మహిళా డాక్టర్ హత్యకు నిరసనగా కోల్‌కతా ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది ఈ నిరసనలకు నేతృత్వం వహిస్తోంది. సమ్మెలో డాక్టర్లు కొన్ని డిమాండ్లు కూడా తెలిపారు. పోలీసుల క్రూర ప్రవర్తన ఆపాలని, రెసిడెంట్ డాక్టర్ల న్యాయపరమైన డిమాండ్లు త్వరగా పూర్తిచేయాలని, చనిపోయిన వైద్యురాలికి న్యాయం చేకూర్చాలని, వైద్య సిబ్బందికి భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్నింటి కంటే ముఖ్యంగా వైద్యలుకు రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.

సమ్మెలో పాల్గొన్న ఫోర్డా సభ్యులు మాట్లాడుతూ.. వైద్యుల భద్రత కోసం చేస్తున్న సమ్మెపై రాజకీయాలు చేయవద్దని, ఇది మానవత్వం కోసం చేస్తున్న సమ్మె కావడంతో అందరూ మద్దతు పలకాలని కోరారు.

మరోవైపు వైద్యురాలి హత్యాచార కేసులో పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు సంజయ్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తన తప్పుపై పశ్చాత్తాపం చేయకపోగా.. తనను ఉరి తీయాలను కుంటే వెంటనే తీయండి పోలీసులతో వాదించాడు. నిందితుడు సంజయ్ రాయ్ వ్యక్తిగత జీవితం గమనిస్తే.. అతను నలుగురు మహిళలను వివాహం చేసుకున్నట్లు తేలింది.

Also Read: డిగ్రీ చదవకుండానే సంవత్సరానికి రూ.5 కోట్లు సంపాదిస్తున్న యువతి.. ఎలాగంటే?..

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×