EPAPER

Case file on Venu swamy: వేణుస్వామిని బ్యాన్ చేయాల్సిందే..టాలీవుడ్ కఠిన నిర్ణయం

Case file on Venu swamy: వేణుస్వామిని బ్యాన్ చేయాల్సిందే..టాలీవుడ్ కఠిన నిర్ణయం

Telugu cinema Journalists ready to case file on Venu swamy: తరచుగా సినీ,రాజకీయ సెలబ్రిటీల జాతకాలపై కామెంట్స్ చేసే వేణుస్వామిపై టాలీవుడ్ పరిశ్రమ భగ్గుమంటోంది. అప్పటి సమంత నుంచి ఇప్పటి శోభిత ధూళిపాళ దాకా వివాదాస్పద జాతకాలు చెబుతూ వీళ్లు విడిపోతారు. వాళ్లు విడిపోతారు. ఫలానా హీరోకి ఇక హిట్లు ఉండవు..అతనికి త్వరలోనే విచిత్రమైన జబ్బు వస్తుంది అంటూ తన నోటి దురదనంతా తీర్చుకుంటుంటాడు వేణు స్వామి. అసలు అవతలివారు చెప్పమని అడగకపోయినా అన్నింట్లో తానున్నానంటూ నోటికొచ్చినది చెబుతుంటాడు. మొన్నటి ఏపీ ఎన్నికలలోనూ జగన్ అత్యంత మెజారిటీతో గెలుస్తున్నాడంటూ జోస్యం చెప్పారు. పవన్ కళ్యాణ్ పని అయిపోయింది. ఇక ఆయన గెలవడం కష్టమే అంటూ జోస్యం చెప్పారు. అక్కడా ఎదురు దెబ్బలు తినడంతో కొంతకాలం పాటు సైలెంట్ అయ్యారు.


అడగకుండానే సెలబ్రిటీలకు జాతకాలు

ఇక తాను ఇష్టారీతిలో జాతకాలు చెప్పనంటూ..ఒక్కోసారి పరిస్థితులను బట్టి అలా వ్యతిరేకంగా జరుగుతుంటాయని చెప్పుకొచ్చారు. దానిపై నెటిజన్స్ వేణు స్వామిపై ట్రోలింగ్ లతో దాడులు చేశారు. ఇక ముక్కు మూసుకుని రోడ్డు పక్కన బోర్డు పెట్టుకుని నిన్ను నమ్మి వచ్చిన వాళ్లకు మాత్రమే జాతకాలు చెప్పు. అంతేకానీ అభిమానులు బాధపడేలా హీరోలను టార్గెట్ చేస్తే చూస్తూ ఊరుకోమని వార్నింగులు కూడా ఇచ్చేశారు. నాగచైతన్య, శోభిత ఒక్కటైన ముహూర్తం బాగోలేదని..అది దుర్ముహూర్తం అని వేణు స్వామి చెప్పుకొచ్చారు. దానిని అక్కినేని ఫ్యామిలీ హీరోలు కూడా ఖండించారు. ఇదెలా ఉండగా వేణుస్వామి సినిమా ఇండస్ట్రీకి విష పురుగులా దాపురించాడని సినీ వర్గాలు శాపనార్థాలు పెడుతున్నాయి.


వేణుస్వామిపై ఫిర్యాదుకు రంగం సిద్ధం

ముఖ్యంగా కథానాయికల వ్యక్తిగత జీవితాన్ని కూడా వదలకుండా వేణు స్వామి చెలరేగి పోతున్నాడని..మొన్నటికి మొన్న రకూల్ ప్రీత్ సింగ్ కాపురం కూడా కూలిపోతుందని చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయం అంటున్నారు. దీనిపై మహిళా సంఘాలు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నాయి. సినిమా జర్నలిస్టులు, మహిళా సంఘాల నేతలంతా కలిసి పోలీసులకు వేణుస్వామిపై చర్యతీసుకోవాలని ఫిర్యాదు చేయనున్నారని సమాచారం. ఇకపై సినిమా వాళ్లకు సంబంధించిన అడ్డమైన జాతకాలు చెప్పి హీరో,హీరోయిన్ల పరువు తీయాలని చూస్తే వేణు స్వామికి కఠిన శిక్ష తప్పదంటున్నారు. దీనిపై లాయర్లను కూడా సంప్రదించి వేణు స్వామిపై ఎలాంటి కేసులు పెట్టాలి..మళ్లీ అతను సినిమా వాళ్ల జోలికి రాకుండా చేసేందుకు ఏమేం చెయాలి వంటి విషయాలపై సీరియస్ గా చర్చించి సరైన సమయంలో వేణుస్వామికి తగిన గుణపాఠం చెబుతామని అంటున్నారు సినీ జర్నలిస్టులు.

బిగ్ బాస్ కు వద్దు..

సినిమా రంగం వారంటేనే సమాజంలో చిన్న చూపు చూస్తున్నారని..వేణు స్వామి ఇలా వాళ్ల వ్యక్తిగత జీవితాలలోకి ప్రవేశించి అడ్డమైన కూతలు కూస్తే చూస్తూ ఊరుకునేది లేదని..వేణు స్వామిని ఇకపై ఏ సినిమా ఫంక్షన్ కూ పిలవకూడదని..ఈ విషయంలో అంతా ఐక్యంగా ఉండి వేణు స్వామిని సినిమా రంగం నుంచే బహిష్కరించాలని కోరుతున్నారు. ఇప్పటికే వేణుస్వామి బిగ్ బాస్ షోకి వెళుతున్నాడని ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ హోస్ట్ గా ఉన్న నాగార్జున వేణు స్వామిని ఎలా ఒప్పుకుంటాడని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ వచ్చినా ఒప్పుకోవద్దని నాగార్జునకు విజ్ణప్తులు చేస్తున్నారు. మరి కొందరైతే వేణు స్వామికి తగిన శాస్తి జరిగింది. ఇది మామూలు పంచ్ కాదు అని కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Comedian Sapthagiri: ఇండస్ట్రీకి దూరమయ్యారా లేక దూరం పెట్టారా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Pushpa 2: వార్నర్ మామ ఇండస్ట్రీ ఎంట్రీ,రీల్స్ నుంచి రియల్ సినిమాలోకి

Devara: ఒకవైపు రాజమౌళి హీరో, మరో వైపు త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్ ఇక శివ ను ఆ శివయ్యే కాపాడాలి

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

SSMB29 : మహేష్- రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..!

Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు గా స్టార్ డైరెక్టర్స్?

Big Stories

×