EPAPER

Kavitha Bail Petition: తీవ్ర ఉత్కంఠ.. జైయిలా? బెయిలా?

Kavitha Bail Petition: తీవ్ర ఉత్కంఠ.. జైయిలా? బెయిలా?

తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీ కవితతలో కలిసి ప్రచారం చేస్తానని జగిత్యాల కేడర్‌కు ఇప్పటికే భరోసా ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఇప్పుడేమో రాఖీ పండుగ రోజు కవిత కేటీఆర్‌కు తప్పకుండా రాఖీ కడతారని బీఆర్‌ఎస్‌ నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఆ క్రమంలో ఇటీవల ఢిల్లీ వెళ్లిన కేటీఆర్‌, హరీష్‌రావు.. కవిత బెయిల్‌ కోసం చేసిన చర్చలు సఫలమయ్యాయనే టాక్‌ వినిపిస్తోంది. అందుకే హస్తిన నుంచి వచ్చిన వెంటనే కేటీఆర్‌ కూడా కవితకు త్వరలోనే బెయిల్‌ వస్తుందనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారంట.

ఇప్పటికే ఈ కేసులో ఎప్పటినుంచో జైలులో ఉన్న మనీష్‌ సిసోడియాకు కూడా బెయిల్‌ మంజూరైంది. దీంతో కవితకు కూడా బెయిల్‌ రావడం లాంఛనమేనని బీఆర్‌ఎస్‌ శ్రేణులు భావిస్తున్నాయి. అందుకే కవితకు స్వాగతం పలికేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారని టాక్‌. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత ఐదు నెలలుగా జైలు ఉన్నారు .. ఆమె ఆ కేసులో బెయిల్ కోసం అప్రూవర్‌గా మారాతారన్న ప్రచారం జరుగుతోంది. ఆగత జులై 1న కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు కవిత తరపున లాయర్లు అందుకు సంబంధించిన విచారణ మరి కొద్ది గంటల్లో జరగునుంది.


ఢిల్లీకి వెళ్లొచ్చిన కేటీఆర్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. కవిత ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని ఆమె ఏకంగా 11 కిలోలు తగ్గారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. త్వరలోనే కవిత విడుదల కానున్నారని కేటీఆర్ అంటున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి కీలక నిందితుడుగా ఉన్న ఆప్ నేత సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాంతో త్వరలోనే కేజ్రీవాల్, కవితలకు కూడా బెయిల్ మంజూరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు.

లిక్కర్ కేసులో మనీష్ సిసోడియా అప్రూవర్‌గా మారడం వల్లే బెయిల్ లభించింది. అందుకే కవిత కూడా అప్రూవర్‌గా మారిపోతే ఆమెకు కూడా షరతులతో కూడిన బెయిల్ లభిస్తుందని న్యాయనిపుణులు చెప్తున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయికారీ వ్యవహారం నడుస్తోందనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో అంత మెజారిటీ రావడానికి కారణం బీఆర్ఎస్సే అని కాంగ్రెస్ ఆరోపించింది. దానికి తగ్గట్లే బీఆర్ఎస్ సగానికి పైగా లోక్‌సభ సెగ్మెంట్లలో డిపాజిట్లు కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు అవ్వగానే కవితకు బెయిల్ వస్తే.. కాంగ్రెస్ ప్రచారాన్ని నిజం చేసినట్లు అవుతుందని అందుకే కొంత టైం తీసుకుని ఇప్పుడు కవిత బెయిల్‌ కోసం రంగం సిద్ధం చేస్తున్నారని అంటున్నారు.

Also Read: కొరియాలో సీఎం రేవంత్‌రెడ్డి, ఎన్‌ఎస్ కంపెనీ ఛైర్మన్‌తో భేటీ, త్వరలో టీమ్ విజట్..

ఇకపోతే.. మొన్నటి ఢిల్లీ పర్యటనలో కేటీఆర్, హరీష్‌రావు విడివిడిగా కేంద్ర పెద్దలను కలిసి కవిత బెయిల్ వ్యవహారంపై మంతనాలు సాగించారంట. అందుకే ఢిల్లీ వెళ్లొచ్చాక కేటీఆర్ ఎంతో ఆత్మవిశ్వాసంతో కవిత త్వరలోనే బయటకు వస్తున్నారని చెప్తున్నారంట. తెలంగాణలో కాంగ్రెస్‌ను ఒంటరిగా ఎదుర్కోవడం ఇక కష్టమే అని బీఆర్ఎస్ అధినేత భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేయాలని.. అందుకోసం ముందుగా కవిత బెయిల్ క్లియర్ అయితే తర్వాత విలీనమా లేక మద్దతా అనే విషయంపై ఓ క్లారిటీకి వద్దామని బీఆర్ఎస్ పెద్దలు భావిస్తున్నారంట.

బీఆర్ఎస్ కనీసం ఉన్న కొద్దిపాటి ఎమ్మెల్యేలను కాపాడుకోవాలంటే కేంద్ర మద్దతు తప్పదని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ లెక్కలతో గులాబీ పెద్దలు ఢిల్లీ వెళ్లి కమలనాధుల ముందు సరెండర్ అవుతున్నారంటున్నారు. కవిత అప్రూవర్‌గా మారితే ఇక బెయిల్‌కు అడ్డంకులు ఉండవని ఆ తతంగం పూర్తైన తర్వాత వీలీనమో? మద్దతూ? అన్న దానిపై క్లారిటీ ఇవ్వవచ్చని గులాబీబాస్ భావిస్తున్నారంట. ఆ క్రమంలో కవిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. వారం రోజుల పాటు ఢిల్లీలో హైలెవల్ సీక్రెట్ చర్చలు జరిపి వచ్చిన కేటీఆర్.. తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధులతో చేసిన చిట్ చాట్‌లో మెడికల్ గ్రౌండ్స్‌పై కవితకు బెయిల్ వస్తుందన్న సంకేతాలు ఇచ్చారు. వచ్చేవారం కవితకు బెయిల్ వస్తుందని.. ప్రాసెస్‌లో ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

ఆయన చెప్పిన మాటల ప్రకారం కవిత బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో లిస్టు అయినట్లు తెలుస్తోంది. కవిత పదకొండు కేజీల బరువు తగ్గారని హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్న కారణంగా మెడికల్ గ్రౌండ్స్ మీద బెయిల్ కోరితే ఆమె న్యాయవాదుల వాదనతో కోర్టు సంతృప్తి చెందితే ఈడీ కేసుల్లో కూడా బెయిల్ వచ్చినట్లే అంటున్నారు. వచ్చే వారంలోనే కేజ్రీవాల్‌కు కూడా బెయిల్ వస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కవిత మార్చి 15వ తేదీన అరెస్టయ్యారు. మిగిలిన వారు అప్రూవర్లుగా మారితే బెయిల్ వచ్చింది. ఇప్పుడు కవిత కూడా అప్రూవర్‌గా మారితే బెయిల్‌ ఇవ్వడానికి ధర్మాసనానికి పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.

Related News

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కీలక పరిణామం.. వారికి రెడ్‌ కార్నర్‌ నోటీసులు!

Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

BRS Mlc Kavitha: రంగంలోకి కవిత.. రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Big Stories

×