EPAPER

Railway Job Fraud: ‘రైల్వే ఉద్యోగం కావాలా? రూ.20 లక్షలు ఖర్చు అవుతుంది!’.. యువతిని మోసం చేసిన ‘అమిత్ షా సెక్రటరీ’

Railway Job Fraud: ‘రైల్వే ఉద్యోగం కావాలా? రూ.20 లక్షలు ఖర్చు అవుతుంది!’.. యువతిని మోసం చేసిన ‘అమిత్ షా సెక్రటరీ’

Railway Job Fraud| రైల్వే శాఖలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఓ యువతికి తాను కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వద్ద సెక్రటరీగా పనిచేస్తున్నానని నమ్మించి ఓ మోసగత్తె, ఆమె సోదరుడు రూ.20 లక్షలు కాజేశారు. అంతేకాదు బాధితురాలిని ఆ మోసగత్తె సోదరుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. దీంతో ఆ బాధితురాలి తండ్రి మనస్తాపంతో మరణించాడు. ఈ ఘటన హర్యాణాలోని హిసార్ నగరంలో జరిగింది.


వివారాల్లోకి వెళితే.. హిసార్ నగరంలో నివసించే వైశాలి (25, పేరు మార్చబడినది) అనే యువతి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తోంది. ఆమె కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు 2023 ఫిబ్రవరిలో నిహాల్ అనే యువకుడు పరిచయమయ్యాడు. తాను రైల్వే టీసీ గా ఉద్యోగం చేస్తున్నానని వైశాలికి చెప్పాడు. ఒకరోజు నిహాల్ తాను రైల్వేశాఖలో ఉద్యోగం ఇప్పించగలనని.. తన సోదరి గుజరాత్ కేడర్ ఐఎఎస్ అధికారి అని ప్రస్తుతం కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సెక్రటరీ పనిచేస్తోందని వైశాలితో అన్నాడు.

కొన్ని రోజుల తరువాత నిహాల్ సోదరి స్వాతితో వైశాలి కలిసింది. స్వాతి ఒక ఐఏఎస్ అధికారిగా వైశాలితో పరిచయం చేసుకుంది. రైల్వే శాఖలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం కావాలంటే స్పోర్ట్స్ డిప్లొమా అవసరమవుతుందని.. అదంతా తాను ఏర్పాటు చేస్తాను.. కానీ రూ.8లక్షలు ఖర్చు అవుతుందని చెప్పింది. స్వాతి మాటలు నమ్మి వైశాలి తన డాక్యుమెంట్స్ కూడా ఇచ్చేసింది. వారం రోజుల తరువాత వైశాలికి నిహాల్ ఫోన్ చేసి డిప్లొమా త్వరలో వచ్చేస్తుందని.. డబ్బులు రెండు రోజుల్లో రెడీ చేసుకోవాలని అడిగాడు. నీహాల్ అడిగినట్లు వైశాలి రూ.8 లక్షలు ఇచ్చేసింది.


Also Read: బ్యాంకులో దొంగతనం చేసి పరార్.. దేశమంతా స్వామిజీగా జల్సా.. 20 ఏళ్ల తరువాత ఎలా చిక్కాడంటే..

ఆ తరువాత వైశాలితో నిహాల్ సన్నిహితంగా ఉండేవాడు. ఆమెను ప్రేమిస్తున్నానని.. చెప్పి ఫోన్ లో తన తల్లిదండ్రులకు పరిచయం చేశాడు. వాళ్లు కూడా వైశాలికి ఉద్యోగం రాగానే పెళ్లికి అనుమతించారు. ఆ తరువాత చాలా రోజుల వరకు వైశాలకి నీహాల్ ఫోన్ చేయలేదు. ఒకరోజు వైశాలి.. నీహాల్ కు ఫోన్ చేసి ఉద్యోగం ఎప్పుడొస్తుందని అడిగింది. దానికి నీహాల్.. ప్రస్తుతం స్వాతి ఉద్యోగ రీత్యా బెంగాల్ వెళ్లిందని రాగానే ఉద్యోగం వచ్చే ఏర్పాట్లు చేస్తుందని నమ్మించాడు.

ఈ క్రమంలో నీహాల్ తనకు అత్యవసరంగా రూ.85,000 కావాలని తిరిగి ఇచ్చేస్తానని అడిగాడు. అందుకు వైశాలి అతనికి అడిగినంత ఇచ్చింది. నెల రోజుల తరువాత వైశాలితో నీహాల్, స్వాతి కలిశారు. అమెకు రెవాడీ జిల్లాలో ఉద్యోగం ఖరారైందని చెప్పి.. ఇంకా రూ.12 లక్షలిస్తే.. అపాయింట్ మెంట్ లెటర్ వస్తుందని చెప్పారు. దీంతో వైశాలి షాక్ అయింది. అంత డబ్బులు ఎలా ఏర్పాటు చేయాలా? అని కంగారు పడిపోయింది. ఎలాగోలా అప్పుడు చేసి వారికి కొంత కొంత చేసి మొత్తం రూ.20 లక్షలు ఇచ్చింది. పైగా ఆమె కారు కావాలని నీహాల్ అడిగిన వెంటనే వైశాలి కారు కూడా ఇచ్చేసింది. ఇదంతా డిసెంబర్ 2023లో జరిగింది.

Also Read:  వెబ్ సిరీస్ చూసి బాలుడి మర్డర్.. ప్రేమ కోసం హంతకురాలిగా మారిన ఎంబిబియస్ విద్యార్థిని

డబ్బులు తీసుకోగానే నీహాల్, స్వాతి.. వైశాలితో కలవడం మానేశారు. వైశాలి ఫోన్ కూడా ఎత్తడం మానేశారు. ఒకరోజు వైశాలి నీహాల్ ని ఎదురుగా వెళ్లి కలిసింది. తనకు ఉద్యోగం ఇప్పించమని లేదా తన వద్ద తీసుకున్న డబ్బులు మొత్తం తిరిగి ఇచ్చేయాలని అడిగింది. అప్పుడు నీహాల్ నిజస్వరూపం బయటపడింది. ఉద్యోగం లేదు.. ఏమీ లేదు.. డబ్బులు అసలు తిరిగి ఇచ్చేది లేదని చెప్పాడు. తన వెంటపడితే.. వైశాలి ప్రైవేట్ ఫోటోలు తన వద్ద ఉన్నాయని వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు.

Also Read: ‘ఉద్యోగం కావాలంటే బాస్ తో సమయం గడపాలి’.. మహిళకు కండిషన్ పెట్టిన మేనేజర్

వైశాలి ఇదంతా విని తాను మోసపోయానని తెలుసుకుంది. ఏం చేయాలో తెలియక.. తన తండ్రి విషయమంతా వివరించింది. వైశాలి తండ్రి కూతురి జీవితం గురించి ఆందోళన చెంది.. ఏప్రిల్ 2024లో మరణించాడు. తండ్రిని కోల్పోయిన వైశాలి.. నీహాల్, స్వాతి గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసలు ప్రస్తుతం విచారణ చేస్తున్నారు.

Also Read: డిగ్రీ చదవకుండానే సంవత్సరానికి రూ.5 కోట్లు సంపాదిస్తున్న యువతి.. ఎలాగంటే?..

Related News

Deadbody In Suitcase: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య

Chennai’s IT Corridor: ఐటీ కారిడార్, సూట్ కేసులో మహిళ మృతదేహం.. ఏం జరిగింది?

Cambodia Cyber Slaves Agent: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

Woman Cop Kidnap: మహిళా పోలీస్ కిడ్నాప్.. 112 డయల్ చేసి ఎలా తప్పించుకుందంటే?.

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Lover Knife Attack: పెళ్లికి నిరాకరణ.. ప్రియురాలిపై ప్రియుడు కత్తితో.. ఆపై ఇద్దరూ

Big Stories

×