అందంగా కనిపించాలని  ప్రతీ అమ్మాయికి ఉంటుంది. అందుకే రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు.

చాలా మంది చేతి గోళ్లకు రంగురంగుల నెయిల్ పాలీష్‌లను వేస్తూ ఉంటారు.

పెళ్లిళ్లు, ఫంక్షన్ల టైమ్‌లో  డ్రెస్‌కు తగిన మ్యాచింగ్ నెయిల్ పాలిష్‌ ఉండేలా చూసుకుంటారు.

తరచుగా నెయిల్ పాలిష్‌లు గోళ్లకు వేసుకోవడం వల్ల  అనారోగ్య సమస్యలు వస్తాయి

 నెయిల్ పాలిష్ తయారు చేయడానికి  రసాయనాలను వాడుతుంటారు.

వీటి వల్ల గోళ్ల ఆరోగ్యంపైన ప్రభావం పడుతుంది.

కొంతమంది గోళ్లు మరింత అందంగా కనిపించడానికి జెల్ నెయిల్ పాలిష్‌లను  కూడా వాడుతుంటారు.

జెల్ నెయిల్ పాలిష్  వల్ల చర్మ  క్యాన్సర్ వస్తుంది.

నెయిల్ పాలిష్  తరచుగా వేసుకునే అలవాటు ఉన్న వారు వీలైనంత వరకు తగ్గించుకోవడం మంచిది.

తక్కువ కెమికల్స్ ఉపయోగించి తయారుచేసిన నెయిల్ పాలిష్ ఎంపిక చేసుకోండి

నెయిల్ పాలిష్‌ తొలగించడానికి పాలిష్ రిమూవర్లను వాడుతుంటారు.

నెయిల్ రిమూవర్‌లో గోళ్లను పొడిబారేలా చేసే రసాయనం ఉంటుంది.