EPAPER

Belly Fat Causes: బెల్లీ ఫ్యాట్ ఎందుకు వస్తుంది ? తగ్గించుకోవడం ఎలా..

Belly Fat Causes: బెల్లీ ఫ్యాట్ ఎందుకు వస్తుంది ? తగ్గించుకోవడం ఎలా..

Belly Fat Causes: బెల్లీ ఫ్యాట్‌తో ప్రస్తుతం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారు తినే ఆహారాన్ని కూడా తగ్గిస్తున్నారు. అయినప్పటికీ బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గదు. బెల్లీ ఫ్యాట్ చెడు ఆహారం తినడం వల్ల మాత్రమే రాదు. దీనికి అనేక కారణాలుంటాయి. అసలు బెల్లి ఫ్యాట్ ఎందుకు వస్తుంది ? బెల్లీ ఫ్యాట్ వచ్చినా కూడా ఫిట్‌గా ఉండటం ఎలా.. బెల్లీ ఫ్యాట్ సమస్యను ఎలా తగ్గించుకోవచ్చు లాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


హార్మోన్స్:
చాలా మందికి హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ వల్ల బెల్లీ ఫ్యాట్ సమస్య వస్తుంది. అయినప్పటికీ వారికి దాని గురించి తెలియదు. ఈ సమస్య వల్ల కడుపు దిగువ భాగంలో కొవ్వు పెరగడం ప్రారంభమవుతుంది. ఆహారం తగ్గించడం వల్ల కూడా బెల్లీ ఫ్యాట్ తగ్గదు. హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ వల్ల వచ్చిన బెల్లీ ఫ్యాట్ సరిచేయడానికి ఉత్తమమైనవారు మార్గం కేవలం యోగ, వ్యాయామం మాత్రమే, దీంతో పాటు సరైన మోతాదులో నిద్రించడం కూడా చాలా అవసరం.

తక్కువ నిద్ర:
సరైన నిద్ర లేకపోవడం వల్ల కూడా బెల్లీ ఫ్యాట్ పేరుకుపోతుంది. దీని వెనక ఉన్న కారణం శరీరంలో ఒత్తిడి స్థాయి అని చెప్పవచ్చు. నిద్రలేకపోవడం వల్ల శరీరం పూర్తిగా కోలుకోలేకపోతుంది. అందుకే శరీరంలో ఒత్తిడి స్థాయి పెరుగుతుంది. దీని వల్ల బెల్లీ ఫ్యాట్ సమస్య తలెత్తుతుంది.


జీవన శైలి:
అసౌకర్యవంతమైన జీవనశైలి కూడా బెల్లీ ఫ్యాట్ రావడానికి కారణమవుతుంది. తక్కువ శారీరక శ్రమ ఉన్నప్పుడు శరీరంపై కొవ్వు నిల్వలు పెరుగుతుంటాయి. సాధారణంగా ఆహారం నుంచి పొందే శక్తి ద్వారా ఇది వచ్చే అవకాశాలు చాలా తక్కువ. శారీరక శ్రమ లేకపోవడం వల్ల కొవ్వు పేరుకు పోయి శరీరంలో నిలిచిపోతుంది.

బెల్లీ ఫ్యాట్ ఎలా తగ్గించాలి..
వ్యాయామం:
జీవన శైలిలో భాగంగా వ్యాయామాన్ని అలవాటు చేసుకోవడం మంచిది. వ్యాయామం చేయకపోతే నడక లేదా పరుగు వంటివి చేయాలి. ఇది మీ శరీరంలో అదనపు కేలరీలను కూడా బర్న్ చేస్తుంది. పొట్ట భాగంలో కొవ్వును తగ్గిస్తుంది. ఇది కాకుండా వ్యాయామం కూడా మీ ఒత్తిడి స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.
నిద్ర:
సరైన మోతాదులో నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి .మగవారైతే రాత్రిపూట కనీసం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి. స్త్రీల ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు నిద్రపోవడం అవసరం. నిద్రించడానికి సమయాన్ని ముందుగానే సెట్ చేసుకోండి. తద్వారా మీరు బాగా నిద్రపోవచ్చు.

Also Read: షుగర్ పేషెంట్లు ఇక ఏదిపడితే అది తినేయొచ్చు..గుడ్ న్యూస్ చెప్పేశారు

చెక్కర తీసుకోకపోవడం:
ఆహారంలో చక్కెర తీసుకోవడాన్ని తగ్గించాలి. ఉదాహరణకు మీరు టీ తాగితే దానిలో చాలా తక్కువ మోతాదులో చక్కెరను వాడండి. ఇది కాకుండా శీతల పానీయాలు, స్వీట్లుకు కూడా దూరంగా ఉండండి. మార్కెట్లో లభించే కూల్ డ్రింక్స్ లో ఎక్కువ మోతాదులో చక్కెర ఉంటుంది. కాబట్టి వాటిని తాగడం తగ్గించాలి.

ఆకుపచ్చ కూరగాయలు:
ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలను చేర్చడం మంచిది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఇన్సులిన్ కూడా పెరగడాన్ని నివారిస్తుంది. పచ్చి కూరగాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బరువు తగ్గడంలో సహాయపడతాయి.

Related News

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Big Stories

×