EPAPER

Duvvada Srinivas: రోడ్డు ప్రమాదంలో మాధురికి గాయాలు.. ‘ఇది ప్రమాదం కాదు.. చికిత్స వద్దు’

Duvvada Srinivas: రోడ్డు ప్రమాదంలో మాధురికి గాయాలు.. ‘ఇది ప్రమాదం కాదు.. చికిత్స వద్దు’

గత రెండు మూడు రోజులుగా టీవీ చానెళ్లలో హల్‌చల్ చేస్తున్న దివ్వెల మాధురికి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. టెక్కలి నుంచి పలాసకు వెళ్లుతుండగా ఆమె కారుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దివ్వెల మాధురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స అందించడానికి పలాస హాస్పిటల్‌కు తరలించారు. పలాస మండలం లక్ష్మీపూర్ టోల్ గేట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు మాధురి సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నారు. దీంతో ఆమెకు గాాయాలు ఎక్కువే అయినట్టు తెలిసింది.


కాగా, దివ్వెల మాధురి మాత్రం ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఇది రోడ్డు ప్రమాదం కాదని, తాను కావాలనే కారును ఢీకొన్నానని చెప్పారు. వాణి తనపై చేస్తున్న ఆరోపణలతో మనస్తాపం చెందానని, ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతోనే తాను ఆగి ఉన్న కారును ఢీకొన్నానని వివరించారు. తనకు చికిత్స అందించవద్దని వైద్యులకు విజ్ఞప్తి చేశారు. తనకు బతకాలని లేదని కంటతడి పెట్టుకున్నారు. తనపై విపరీతంగా ట్రోలింగ్స్ వస్తున్నాయని ఆవేదన చెందారు. తనపై ఆరోపణలు చేస్తే తీసుకోగలనని, కానీ, తన పిల్లలపై ట్రోలింగ్స్‌ను తట్టుకోలేనని చెప్పారు.

ఆ తర్వాత పోలీసులు, ఆమె కుటుంబ సభ్యులు కలిసి మాధురిని పలాస ప్రభుత్వ ఆస్పత్రి నుంచి విశాఖ అపోలో హాస్పిటల్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆస్పత్రిలో పోలీసులు తనని ఇబ్బందిపెట్టారన్నారు. మీడియాతో మాట్లాడతానంటే సహకరించలేదని ఆరోపించారు. తనకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారని, ఆల్కహాల్ పరీక్షల కోసం రక్త నమూనాలు సేకరించారని మండిపడ్డారు. తలకు బలమైన గాయాలయ్యాయని, స్కానింగ్ చేస్తే ఏమైందో తెలుస్తుందని వివరించారు. ఆత్మహత్య నేరమని తెలుసని, కానీ, వాణి చేస్తున్న ఆరోపణలతో ఆ క్షణం ఏమీ తోచలేదని దివ్వెల మాధురి పేర్కొన్నారు.


ఇక డీఎస్పీ మాట్లాడుతూ.. ఎదుటి కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని, మాధురి కారు వారి కారును ఢీకొనడంతో వారంతా గాయాలపాలయ్యారని వివరించారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని, ఇందులో భాగంగానే రక్త నమూనాలు సేకరించామని తెలిపారు.

Also Read: School Teacher: ఉండేది అమెరికాలో.. నెల నెలా గుజరాత్ ప్రభుత్వ నుంచి జీతం

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో ఆయన భార్య దువ్వాడ వాణి, మాధురి మధ్య మాటల యుద్దం జరిగింది. వారి వివాదం మీడియాకు ఎక్కడంతో రాష్ట్రమంతా రచ్చ రచ్చగా మారింది. ఒకరిపై ఒకరు ఊహించని రీతిలో ఆరోపణలు, పంచ్‌లు వేసుకున్నారు. దువ్వాడ వాణి, ఆమె కుమార్తెలు మాధురిపై  మీడియా ముందు తీవ్ర ఆరోపణలు చేయడంతో వివాదం రచ్చకెక్కింది.

Tags

Related News

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Laddu Prasadam: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు స్పందన ఇదే, శారదా పీఠం మౌనమేలా?

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Big Stories

×