దోసకాయల్లో మనకు తెలిసినవి రెండు రకాలు.

1. కీర దోసకాయ 2. కూరదోసకాయ

కీరదోసకాయలో ఔషధ గుణాలు చాలానే ఉంటాయి.

అలాగే దోసగింజలు కూడా అనారోగ్యాన్ని దరిచేరనీయవు

దోసగింజల్లో ఫైబర్, పీచు పదార్థం అధికం.

జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

పొట్టను శుభ్రంగా ఉంచుతుంది.

తక్కువ కేలరీలు ఉంటాయి.. కడుపు నిండినట్టుగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గుతారు.

మెగ్నీషియం, పొటాషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

కాల్షియం, పాస్పరస్ ఎముకలను బలంగా చేస్తాయి. ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు రావు.

వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి.

షుగర్ ను నియంత్రిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.