EPAPER

Israel-Iran Conflict: డేంజర్లో భారత్.. యుద్ధానికి సిద్ధమా..?

Israel-Iran Conflict: డేంజర్లో భారత్.. యుద్ధానికి సిద్ధమా..?

మిడిల్ ఈస్ట్ ప్రాంతం భారతదేశానికి కీలకమైన వాణిజ్య భాగస్వామి. UAE సౌదీ అరేబియాతో ద్వైపాక్షిక వాణిజ్యం సంవత్సరానికి $100 బిలియన్లకు పైగా ఉంటుంది. అలాంటిది, ఈ ప్రాంతంలో వివాదం ముదిరితే.. అది, వస్త్రాలు, యంత్రాలు, దిగుమతులు ముఖ్యంగా చమురు, ఎరువులు వంటి ఎగుమతులకు అంతరాయం కలిగించవచ్చు. ఈ అంతరాయాలు భారతదేశ GDP వృద్ధి, ఎగుమతి ఆధారిత పరిశ్రమలలో ఉపాధి, చెల్లింపుల బ్యాలెన్స్‌పై ప్రతికూల ప్రభావం చూపుతాయి. తర్వాత, ఇవన్నీ భారీగా ఆర్థిక సవాళ్లను పెంచుతాయి.

అంతేగాక, ప్రస్తుతం, భారత్ విదేశాలకు పంపిన తన విదేశీ జనాభా ద్వారా అత్యధిక చెల్లింపులను అందుకుంటుంది. ప్రపంచ బ్యాంకు ప్రకారం, 2023లో భారతదేశానికి రెమిటెన్స్‌లు $120 బిలియన్లు దాటాయి. అందులో 18% కేవలం UAEలో ఉన్న భారతీయ కార్మికుల నుండి వచ్చాయి. ఇక, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, ఒమన్‌లను జోడిస్తే, వారి విరాళాలు 30% వరకు పెరుగుతాయి. అయితే, పెరుగుతున్న సంఘర్షణ ఈ రెమిటెన్స్‌లను తగ్గించవచ్చు. అలాగే, చాలా మంది ప్రవాసులు భారత్‌కు తిరిగి వచ్చేలా చేస్తుంది.


ఈ వలసల వల్ల భారతదేశ సామాజిక, ఆర్థిక మౌలిక సదుపాయాలు దెబ్బతింటాయి. దేశ ఆర్థిక వ్యవస్థ అదనపు సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే, సరిహద్దు భద్రతా ఆందోళనలు, శరణార్థుల ప్రవాహానికి అవకాశం.. ఇవన్నీ కలిసి, భారతదేశ స్థిరత్వానికి ముప్పును కలిగిస్తాయి. ఇక, మానవతా సవాళ్లలో తగిన ఆహారం, ఆశ్రయం, వైద్య సంరక్షణ అందించడంతోపాటు శరణార్థులు, హోస్ట్ కమ్యూనిటీల భద్రత వంటి బాధ్యతలు మరింత మోత బరువును వేస్తాయి. ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా భారతదేశ పురోగతిని కూడా ఈ పరిస్థితులు ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో.. ఇరాన్, ఇజ్రాయెల్, యుఎఇ, సౌదీ అరేబియా వంటి వివిధ మధ్యప్రాచ్య దేశాలకు భారతదేశం ముఖ్యమైన భాగస్వామిగా ఉంది. కాబట్టి, ఈ ప్రాంతంలో విభేదాలు ఎనర్జీ సహకారం, రక్షణ, భద్రతా భాగస్వామ్యాలు, ప్రాంతీయ దౌత్య ప్రయత్నాలను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా, భారత వ్యూహాత్మక సంబంధాలను అస్థిరపరిచే అవకాశం ఉంది. గతేడాది, ఢిల్లీలో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశంలో, చైనా చేపట్టిన ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌’‌ని ఎదుర్కోడానికి ‘ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ కారిడార్‌’ను ప్రకటించారు.

అయితే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తు ప్రమాదంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతునందు వల్ల, ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం కష్టం కావచ్చు. భారత్, యుఎఇ, సౌదీ అరేబియా, జోర్డాన్, ఇజ్రాయెల్, యూరప్‌లను కలుపుతూ అతుకులు లేని వాణిజ్య మార్గాన్ని ఏర్పాటు చేయడం దీని లక్ష్యం. ఇది ఆర్థిక ఏకీకరణ, వాణిజ్యం, పెట్టుబడులు, సహకారాన్ని పెంపొందిస్తుందని ఆలోచించి చేసిన ప్రాజెక్ట్. అయితే, మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో ప్రస్తుతానికి, భాగస్వామ్య దేశాల ప్రాధాన్యతలు మారాయి.

Also Read: మా అంతర్గత మెసేజ్‌లను ఇరాన్ హ్యాక్ చేస్తోంది: ట్రంప్ ప్రచార బృందం

అయితే, ఇక్కడొక ఆశ కూడా లేకపోలేదు. ఈ ప్రాంతంలో యుద్ధాల నుండి వచ్చే సంక్షోభాలను ఎదుర్కొన్న అనుభవం భారతదేశానికి ఉంది. గల్ఫ్ యుద్ధాల సమయంలో, భారత్ శరణార్థుల సంక్షోభాలను నిర్వహించడం… కువైట్ నుండి భారత పౌరులను ఎయిర్‌లిఫ్టింగ్ చేసి, పెద్ద ఎత్తున తరలించింది. అలాగే, సంక్షోభంలో దేశ సామర్థ్యాన్ని ప్రదర్శించింది. 1990లో కువైట్‌పై ఇరాక్ దాడి చేసిన తర్వాత… కువైట్, ఇరాక్‌లలో దాదాపు లక్షా 70 వేల మంది భారతీయులు చిక్కుకుపోయారు. అప్పుడు భారత పౌరులను ఖాళీ చేయించడానికి భారీ ఎయిర్‌లిఫ్ట్ ఆపరేషన్‌ను చేపట్టింది. విమానయాన సంస్థలతో సమన్వయం చేసుకుంటూ… సైనిక, పౌర విమానాలను ఉపయోగించింది. దాదాపు రెండు నెలల పాటు సాగిన ఈ ఆపరేషన్‌లో భారతదేశ రవాణా, దౌత్య సామర్థ్యాలను ప్రదర్శించి, చరిత్రలో అతిపెద్ద పౌర తరలింపులలో ఒకటిగా నిలిచింది.

అలాగే, 2003 ఇరాక్ యుద్ధంలో, మొదటి గల్ఫ్ యుద్ధంతో పోలిస్తే ఈ స్కేల్ తక్కువగా ఉన్నప్పటికీ, భారత్ తన జాతీయులను స్వదేశానికి తీసుకురావడంలో మరోసారి క్రియాశీలకంగా వ్యవహరించింది. ఆ ప్రాంతంలో… దాని రాయబార కార్యాలయాల ద్వారా, భారతీయులు స్వదేశం రావడానికి సహాయం చేసింది. భారతీయ పౌరుల భద్రతను నిర్ధారించడం, అవసరమైన ప్రయాణ పత్రాలను అందించడం, భారత్‌కు రవాణాను ఏర్పాటు చేయడం వంటి ప్రత్యేక అవసరాలతో తరలింపు ప్రయత్నాలు చేపట్టింది. అందులో సక్సెస్ అయ్యింది.

ఇక, ఇప్పుడు, మిడిల్ ఈస్ట్ దౌత్యంలో మోడీ భారీ పెట్టుబడి, పెరిగిన సంబంధాలు కాస్త టెన్షన్‌ను తగ్గిస్తున్నాయి. ఒకవేళ, ఉద్రిక్తతలు వ్యాపించి, ఘోరమైన యుద్ధం ఆ ప్రాంతాన్ని చుట్టుముడితే ఎటువంటి అవాంతరాలు లేకుండా భారతీయులను తరలించవచ్చు. అయితే, అదొక్కటే సమస్య కాదు. అది ఆర్థిక సామర్థ్యాన్ని కూలదోయకుండా ఉండాలి. అందుకే, ప్రస్తుతానికి, అక్కడ సంక్షోభం త్వరగా తీరిపోవాలని భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు ఆశించాలి. అది జరగాలంటే, గాజాలో కాల్పుల విరమణ జరగాలి. లేకపోతే, అక్కడ యుద్ధం ఇక్కడ కష్టానికి కారణం అవుతుంది.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×