EPAPER

Amina Abakarova: చెస్ బోర్డుపై విషం పూసిన ప్లేయర్.. ఓటమి అవమానం సహించలేకే ఆ పని..

Amina Abakarova: చెస్ బోర్డుపై విషం పూసిన ప్లేయర్.. ఓటమి అవమానం సహించలేకే ఆ పని..

Amina Abakarova| యుద్ధమైనా.. ఆటైనా విజయం సాధిస్తే.. ఎంత ఆనందాన్ని ఇస్తుందో.. ఓడిపోతే అంతే బాధగా అనిపిస్తుంది. కానీ ఆ బాధను దిగమింగుకొని మళ్లీ గెలవడానికి ప్రయత్నించడమే మానవులలో మంచితనానికి ప్రతీక. కానీ కొందరు సంకుచిత స్వభావం కలవారు.. తమ ఓటమిని అంగీకరించలేరు. తమ తప్పుని సరిదిద్దుకొని మళ్లీ విజయం సాధించిడానికి ప్రయత్నించక అవతలి వారిపై కోపం, ద్వేషం పెంటుకుంటారు. అలాంటి సంకుచిత స్వభావం కలవారు, ఈర్ష్యా, ద్వేషం భావాలకు బానిసలై హింసాత్మకంగా మారిన సందర్భాలున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి రష్యాలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. రష్యాలోని దాగిస్తాన్ రాష్ట్రంలో ఇటీవల దాగిస్తాన్ చెస్ చాంపిషన్ షిప్ టోర్నమెంట్ జరిగింది. ఆ చదరంగం టోర్నమెంట్ లో ఉమయ్‌గనాత్ ఒస్మానోవా (Umayganat Osmanova) అనే యువతి చెస్ ఆడుతూ అనారోగ్యానికి గురైంది. ఆమెకు కళ్లు తిరగడం, ముక్కులో నుంచి రక్తం రావడం జరిగింది. అది గమనించిన టోర్నమెంట్ నిర్వహకులు ఒస్మానోవాని ఆస్పత్రికి తరలించాలని ప్రయత్నించారు. కానీ ఒస్మానోవా ఆట ముగిసే వరకు అక్కడి నుంచి కదలనని కూర్చొంది. చివరికి ఆ చెస్ గేమ్ గెలిచిన తరువాత ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్లింది.

Also Read: ‘నా ఆత్మహత్యకు భార్యతోపాటు వారందరూ కారణం’.. పోలీసులకు చెమటలు పట్టిస్తున్న సూసైడ్ నోట్


డాక్టర్లు ఆమె ఆరోగ్యం క్షీణిస్తుండడంతో రక్త పరీక్ష చేయగా.. ఆమె రక్తంలో విషమున్నట్లు తెలిపారు. ఒస్మానోవాపై కొన్ని గంటల క్రితమే విషప్రయోగం జరిగింది రిపోర్ట్ లో నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఉదయం ఇంటి నుంచి బయలు దేరిన ఒస్మానోవా నేరుగా చెస్ ఆడడానికే వచ్చింది. దీంతో పోలీసులు ఆమె ఉదయం తిన్న ఆహారాన్ని పరీక్షించారు. కానీ అందులో ఏమీ హానికర పదార్థం లేదు. ఆ తరువాత పోలీసులు చెస్ రూమ్ లో ఒస్మానోవా ఏమైనా తిన్నదా అని ఆరా తీశారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. చెస్ ఆడే సమయంలో కాస్త నీరు తాగానని ఒస్మానోవా తెలిపింది. దీంతో పోలీసులు చెస్ రూమ్ సిసిటీవి వీడియోలను పరిశీలించారు. కానీ ఒస్మానోవా చెస్ ఆడే సమయంలో ఏమీ కనిపించలేదు.

Also Read: ‘ఉద్యోగం కావాలంటే బాస్ తో సమయం గడపాలి’.. మహిళకు కండిషన్ పెట్టిన మేనేజర్

అప్పుడే పోలీసులకు అనుమానం వచ్చింది. ఒస్మానోవా ఆడిన చెస్ బోర్డుని పరిశీలించగా.. దానిపై ఏదో తేలికపాటి ధ్రవ పదార్థం ఉన్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు మరోసారి సిసిటీవి వీడియోని ముందునుంచి పరిశీలించారు. ఈసారి వారి కళ్లకు నమ్మలేని దృశ్యం కనిపించింది. ఒస్మానోవా చెస్ ఆడే ముందు ఆ చెస్ రూమ్ లో ఓ యువతి వచ్చింది. ఆమె నేరుగా ఒస్మానోవా ఆడబోయే చెస్ బోర్డు వద్దకు వెళ్లి.. ఆ బోర్డుపై ఏదో ధ్రవ పదార్థం పూస్తున్నట్లు కనిపించింది. ఆ వీడియోలో ఉన్న యువతి తన చిన్న నాటి స్నేహితురాలు అమినా అబాకరోవా అని ఒస్మానోవా గుర్తుపట్టాడు. దీంతో పోలీసులు అమినా ని అరెస్టు చేశారు.

Also Read: వెబ్ సిరీస్ చూసి బాలుడి మర్డర్.. ప్రేమ కోసం హంతకురాలిగా మారిన ఎంబిబియస్ విద్యార్థిని

అమినాను పోలీసులు గట్టిగా విచారణ చేయగా.. తాను ఒక ధర్మామీటర్ పగలగొట్టి అందులోని మెర్కురీ పదార్థాన్ని ఒస్మానోవా చెస్ బోర్డుపై ఉన్న పావులపై పూసానని చెప్పింది. ‘అలా ఎందుకు చేశావ్?’ అని పోలీసులు గట్టిగా ప్రశ్నించగా.. తనకు ఒస్మానోవా చిన్నప్పటి నుంచి చెస్ గేమ్ లో ఓడిస్తోందని.. ఆమె ఉండగా తాను ఎప్పుడూ చెస్ చాంపియన్ కాలేనని అందుకే తనని దారి నుంచి తప్పించేందుకు ఈ పని చేశానని చెప్పింది. ఇటీవల ఉస్మోనోవా తన కుటుంబం గురించి నీచంగా మాట్లాడడంతో తనకు ఆమె హత్య చేసేందుకు ప్రయత్నించానని అంగీకరించింది.

అమినా అబాకరోవాపై కోర్టులో విచారణ సాగుతోంది. ఆమెకు మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

Also Read:  బ్యాంకులో దొంగతనం చేసి పరార్.. దేశమంతా స్వామిజీగా జల్సా.. 20 ఏళ్ల తరువాత ఎలా చిక్కాడంటే..

 

Related News

Deadbody In Suitcase: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య

Chennai’s IT Corridor: ఐటీ కారిడార్, సూట్ కేసులో మహిళ మృతదేహం.. ఏం జరిగింది?

Cambodia Cyber Slaves Agent: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

Woman Cop Kidnap: మహిళా పోలీస్ కిడ్నాప్.. 112 డయల్ చేసి ఎలా తప్పించుకుందంటే?.

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Lover Knife Attack: పెళ్లికి నిరాకరణ.. ప్రియురాలిపై ప్రియుడు కత్తితో.. ఆపై ఇద్దరూ

Big Stories

×