EPAPER

Bandi Sanjay: బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పుపై బండి సంజయ్ కామెంట్స్.. ‘నాకు అభ్యంతరం లేదు’

Bandi Sanjay: బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పుపై బండి సంజయ్ కామెంట్స్.. ‘నాకు అభ్యంతరం లేదు’

Telangana: కేంద్రమంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మీడియాతో చిట్ చాట్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై స్పందించారు. రాష్ట్ర అధ్యక్ష మార్పు నిర్ణయాన్ని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీసుకుంటారని, అదంతా ఆయన చూసుకుంటారని వివరించారు. హైకమాండ్ నిర్ణయమే తమకు శిరోధార్యమని స్పష్టం చేశారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా తనకు అభ్యంతరం లేదని వివరించారు. పార్టీకి, శాసన సభ్యులకు మధ్య గ్యాప్ ఉందనేది సరికాదని, అవన్నీ అవాస్తవ ప్రచారాలని కొట్టిపారేశారు.


బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి జైలులో వేస్తారనే నమ్మకం తనకు ఉన్నదని బండి సంజయ్ అన్నారు. కేటీఆర్ చేసిన అరాచకాలు, అవినీతి అందరికీ తెలుసని చెప్పారు. తనతో సహా ఎందరో బీజేపీ కార్యకర్తలను కేటీఆర్ హింసించారని, జైల్లో వేశారని, కేటీఆర్ తీరును ఎవరూ మర్చిపోలేదని పేర్కొన్నారు. కచ్చితంగా కేటీఆర్‌ను రేవంత్ రెడ్డి జైలుకు పంపిస్తారని నమ్మకంతో ఉన్నట్టు తెలిపారు. రేవంత్ రెడ్డిపై నమ్మకం పోయిన రోజు నుంచి కాంగ్రెస్‌తో యుద్ధమే జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటైనా బీజేపీ యుద్ధ ధాటికి తట్టుకోలేవని, అంతలా పోరాడుతామన్నారు.

బీఆర్ఎస్‌తో బీజేపీ చర్చలు జరుగుతున్నాయనే వార్త ఫేక్ న్యూస్ అని కేంద్రమంత్రి బండి సంజయ్ కొట్టిపారేశారు. బీఆర్ఎస్ అవుట్‌డేటెడ్ పార్టీ అని, ఆ పార్టీ పని అయిపోయిందని తెలిపారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్‌కు బీజేపీకి ఏ సంబంధం అని ప్రశ్నించారు. అలాగైతే మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చినా.. బీజేపీతో సంబంధం ఉన్నదనే అంటారా? అని నిలదీశారు. కోర్టు విషయాలు వేరు.. రాజకీయాలు వేరని,ఈ రెంటిని ముడిపెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు.


Also Read: హాస్టల్ నుంచి పారిపోతుండగా యాక్సిడెంట్.. బాలుడు మృతి

అతి తక్కువ సమయంలోనే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీనే అని కేంద్రమంత్రి  బండి సంజయ్ విమర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు. పంచాయతీలకు నిధులిచ్చే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదని, ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నిధులు కూడా ఇవ్వడం లేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పంచాయతీలు నడుస్తున్నాయని వివరించారు. మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలే తమ బ్రాండ్ అంబాసిడర్లు అని పేర్కొన్నారు. పంచాయతీలకు కేంద్రమే నిధులు ఇస్తున్నదని హరీశ్ రావు ఇప్పటికైనా చెప్పడం శుభ పరిణామమని, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావులో కొన్ని మంచి మార్పులు వస్తున్నాయన్నారు.

Related News

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

Ex-Gratia to Gulf Victims: గల్ఫ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా.. నేటి నుంచే ప్రవాసి ప్రజావాణికి శ్రీకారం

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కీలక పరిణామం.. వారికి రెడ్‌ కార్నర్‌ నోటీసులు!

Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

BRS Mlc Kavitha: రంగంలోకి కవిత.. రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Big Stories

×