EPAPER

KCR Politics: చక్రం తిప్పేస్తా.. దేశాన్ని ఏలేస్తానన్న కేసీఆర్.. చివరకు..

KCR Politics: చక్రం తిప్పేస్తా.. దేశాన్ని ఏలేస్తానన్న కేసీఆర్.. చివరకు..

KCR Politics: రాజకీయంలో రాణించాలంటే ఎవరికైనా ముఖ్యంగా రెండు లక్షణాలు ఉండాలని బలంగా చెబుతుంటారు. ఒకటి మంచి వాక్చాతుర్యం.. మరొకటి మనీ. ఈ రెండింటిలో ఏదున్నా కూడా రాజీకాయాల్లో దాదాపుగా రాణించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయని చెబుతుంటారు. ఒకవేళ ఈ రెండు లేకున్నా కూడా మరో లక్షణం ఉంటే రాణివంచవచ్చు అదేమంటే.. సేవా గుణం లేదా రాజకీయ చాణక్యత. కానీ, రాజకీయ చాణిక్యతను తన అవసరాల కోసం కాకుండా.. జనం అవసరాల కోసం వాడినప్పుడు అది వజ్రాయుధంగా ఉంటుంది. వారి పేరు చరిత్ర ఉన్నంతకాలం నిలుస్తుంది. కానీ, ఎప్పుడైతే తన స్వార్థం కోసం ఉపయోగిస్తారో వారి పొలిటికల్ గ్రాఫ్ ఊహించని విధంగా పడిపోతుంది. మొదటగా వారు అనుకున్నది జరుగుతూ జనాలను మైమరిపించినా చివరకు వ్యతిరేకత ఏర్పడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మంచి మంచే.. చెడు చెడే. మంచికి గుర్తింపు ఆలస్యమైనా గుర్తింపు పక్కా. చెడు ఎప్పటికైనా కనుమరుగే.


ఈ మాటలు ఇప్పుడెందుకు ప్రస్తావిస్తున్నాను అంటే.. ముందుగా మీకు రెండు విషయాలను గుర్తు చేయాలనుకుంటున్నాను. ‘మాది రాజకీయ పార్టీ అయినా.. మా ఎజెండా తెలంగాణ. కేవలం ఉద్యమం కోసం ఈ పార్టీ ఏర్పడింది. లేదు లేదు మాది కూడా ఫక్తు రాజకీయ పార్టీనే. మేం కూడా రాజకీయాల్లో చక్రం తిప్పుతాం. తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చి దిద్దుతాం. మాదేమైనా సన్నాసుల సత్రమా..? మాది కూడా రాజకీయ పార్టే. ఈడ రాజకీయాలే ఉంటాయి.. మేం కూడా రాజకీయాలు చేస్తాం. రాష్ట్రంలో ఏకధాటిగా రెండుసార్లు అధికారంలోకి వచ్చి చక్రం తిప్పాం.. ఇప్పుడు దేశ రాజకీయాల్లోకి ఎంటరవుతున్నాం.. అసలు రాజకీయం ఎలా ఉంటదో దేశానికి మేం నేర్పించబోతున్నాం. అందుకే బీఆర్ఎస్ పేరుతో ఇండియా అంతటా ఎంట్రీ ఇస్తున్నాం.

Also Read: మోదీ చెప్పారంటే చేస్తారంతే.. ఇదిగో నిదర్శనం: బండి సంజయ్


దేశంలో కాంగ్రెస్ ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకుంటది. అసెంబ్లీలో మాట్లాడుతూ.. సోనియా దయ వల్లనే తెలంగాణ వచ్చింది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా అధ్యక్షా. ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.

ప్రధాని మోదీ ఏ రాష్ట్రానికి పోతే అక్కడ ఉండే టోపీ పెట్టుకుని, డ్రెస్ వేసుకుంటే సరిపోతదా..? గిదేనా దేశం డెవలెప్ అంటే? ఇదా మన దేశం తీరు..? పక్క దేశాలను చూడండి ఏ విధంగా అభివృద్ధి చెందాయో. మనం చూడు ఏడ ఉన్నాం. అందుకే బీఆర్ఎస్ పార్టీగా వస్తున్నాం. దేశం గతిని మార్చుతాం. దేశ రాజకీయాల్లోనే కొత్త ట్రెండ్ తీసుకరాబోతున్నాం. ప్రపంచంలోకెల్లా భారత దేశాన్ని నెంబర్ వన్ గా నిలబెడుతాం’

ఈ మాటలు మీరో నేనో అన్నవి కావు. మాజీ సీఎం, ఒకప్పటి టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ వి. నిజంగా ఇవి స్వయంగా ఆయన నోటి నుంచి వచ్చినవే. కాకపోతే సారు సందర్భాన్ని బట్టి ఈ వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఎందుకంటే రాజకీయ చాణక్యత బాగా తెలిసిన వ్యక్తి కదా. విషయాన్ని బాగా అంచనా వేయగలడు. అంతేకాదు.. దాని లోతుల్లోకి కూడా వెళ్లి బాగా చర్చించగలడు. ఎలాంటి వ్యక్తినైనా తనవైపు తిప్పుకునే కెపాసిటీ ఉన్న వ్యక్తి. అందుకే ఆయనకు రాజకీయ చాణిక్యుడు అనే పేరు వచ్చింది. రాజకీయాలను బాగా ఒంట పట్టిచ్చుకున్న వ్యక్తి. ప్రముఖ రాజకీయ నాయకుల్లో ఈయనొకరు.

అయితే, రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఓ టాపిక్ విపరీతంగా ట్రెండింగ్ అవుతోంది. బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందంటూ వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ.. బీజేపీ పార్టీలో కలవబోతున్నదంటూ అందులో పేర్కొంటున్నారు. కేసీఆర్ తన చాణక్యతతో కొత్త ప్లాన్ వేశారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయంటూ ఆ వార్తల్లో చెప్పుకొచ్చారు. అంతకుముందు కూడా పలువురు బీజేపీ నేతలు సైతం బీఆర్ఎస్ కీలక నేతలపైనా ఎప్పుడూ లేని ప్రేమను చూపించారు. ఈ వరుస పరిణామాల నేపథ్యంలో ఆ వార్తలు నిజమా..? కాదా ? అనే చర్చలతో జనాలు చెవులు బిజీ బిజీగా ఉన్నాయి. ఇదంతా కూడా పక్కన పెడితే.. మరో విషయంపై కూడా తెలుగు ప్రజలు భారీగా చర్చిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్, రాష్ట్రంలో తనకెదురెవరూ లేరు అన్న చందంగా పాలించిన వ్యక్తి ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారా? అసలు ఎందుకు ఆయనకు ఈ గతి పట్టింది..? ఆయన విధానాల లోపమా..? లేక నియంతృత్వ పోకడనా..? లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా..? అంటూ వాటిని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

Also Read: సీఎం రేవంత్‌తో జొయిటిస్ కంపెనీ ప్రతినిధులు, విస్తరణపై చర్చలు..

మరీ ముఖ్యంగా ఇక్కడ ప్రజలు వెలెత్తి చూపిస్తున్న విషయం ఏమంటే.. “కేసీఆర్ ఉద్యమం చేసే సమయం నుంచి 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ వేరు. అప్పుడు ఆయన పంథా వేరు. చాలా నిక్కచ్చిగా పని చేసి తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారు. నిజంగా అది హర్షించతగ్గ విషయం. కానీ, ఎప్పుడైతే కేసీఆర్ అధికారంలోకి వచ్చారో అప్పట్నుంచి ఆయనలో మెల్లగా మార్పు మొదలయ్యింది. సెంటిమెంట్ పేరు చెప్పుతూ ప్రతిసారి రాజకీయాలు చేద్దామనుకుంటే కుదరలేదు. తనకెవరూ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండొద్దు అనుకున్నాడు.. అందుకే ఆయనను ప్రజలు ప్రతిపక్షంలోకి పంపారు. మా పాలనలో అన్నీ చేశాం.. మూడోసారి కూడా అధికారంలోకి వస్తాం.. మాకే ప్రజలు మునుపెన్నడూ లేని విధంగా బీఆర్ఎస్ కు సీట్లు కట్టబెడుతారు. నిజంగానే వారు అనుకున్న విధంగానే మునుపెన్నడూ లేని విధంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. ఉద్యమ కారులను పట్టించుకోలేదు. అమరవీరుల కుటుంబాలను పట్టించుకోలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనలో నిర్లక్ష్యం వహించడం. ఉద్యమకారులను అణిచివేయడం. సమస్యల పరిష్కారం కోసం గొంత్తెత్తితే ఆ గొంతును నలిపేయడం. ప్రతిపక్ష నాయకులను జైలు పాలు చేయడం. ఆఖరుకు జర్నలిస్టులను సైతం వదల్లేదు. ఇలా ఒక్కటేమిటీ.. చాలా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా కేసీఆర్ తన రాజకీయ చాణక్యతతో భవిష్యత్తులో ఇంకా అద్భుతంగా రాణిస్తాను అనుకున్నాడు. కానీ, చివరకు ప్రశ్నార్థకంగా మారింది. కారణం తాను తొవ్వుకున్న గోతిలో తానే పడుతున్నాడు. ప్రతిసారి అతితెలివి పనిచేయదు కదా?. ఇప్పుడు కేసీఆర్ విషయంలో అదే జరిగింది. అందుకే అసెంబ్లీ ఎన్నికలు, ఎంపీ ఎలక్షన్స్ లోనూ కేసీఆర్ ఎన్ని చెప్పినా నమ్మలేదు.. ఓట్లు వేయలేదు. గెలిచినా చోట కేవలం అభ్యర్థులను చూసి మాత్రమే ఓటు వేశారు. అంతేకాదు.. భవిష్యత్తులో కేసీఆర్ కు ఇంకా ఘోరమైన పరాజయాలు తప్పవేమో. కేసీఆర్ రాజకీయ జీవితం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందో చివరకు అక్కడికే వెళ్తుందేమో. తెలంగాణ ఇవ్వడంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ విషయంలో అవసరాన్ని బట్టి ఉండడం.. చివరకు నువ్వు ఎవరో అన్నట్టు వ్యవహరించడం. ఇటు బీజేపీ విషయంలో కూడా సేమ్ స్ట్రాటజీ. సో.. కేసీఆర్ గురించి పూర్తి అవగాహన ఉన్న కాంగ్రెస్ ఇకమీదట అస్సలు నమ్మదు. భవిష్యత్తులో ఆయనతో ఎలాంటి స్నేహం చేయబోదు. ఇటు బీజేపీకి కూడా చాలా బాగా తెలుసు. అందుకే ఇప్పుడు ఒత్తడి తెస్తుందేమో. ఏం చేయలేకనే కేసీఆర్ బీజేపీకి తలొగ్గాల్సి వస్తోందేమో.

Also Read: పదవులెవరికో? నామినేటెడ్ పై ఆశలు

అలా కాకుండా ఇకనైనా కేసీఆర్ ఆలోచన విధానంలో మార్పు రావాలి. 2014 లోపు ఉన్న కేసీఆర్ గా మారాలి. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం కొత్త కొత్త ప్రణాళికలు వేయాలి తప్ప వేరే పార్టీలో మెర్జ్ అయితే ఏం రాదు. బీఆర్ఎస్ లో కేవలం నాయకత్వ లక్షణం లోపించింది. నియంత పోకడకు పోకుండా ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబానికే కాకుండా పార్టీ కోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలకు కూడా పార్టీలో గుర్తింపు ఇవ్వాలి.కార్యకర్తల సమస్యలను పరిష్కారం కోసం పని చేయాలి. వీటిని బీఆర్ఎస్ గమనించి ఫుల్ ఫిల్ చేసుకుంటే బాగుంటుందేమో” అంటూ జనాలు చర్చించుకుంటున్నారు.

ఇక్కడ రాజకీయ నిపుణులు, ప్రజలు చెబుతున్నదేమంటే.. కేసీఆర్ తన రాజకీయ చాణక్యతను రాష్ట్ర ప్రయోజనాల కోసం వినియోగిస్తే.. మళ్లీ ప్రజల నుంచి ఆదరణ లభించొచ్చని సూచిస్తున్నారు.

Tags

Related News

Bigg Boss 8 Day 19 Promo: కఠిన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్..సైలెంట్ అయిన కంటెస్టెంట్స్ ..!

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Big Stories

×