EPAPER

Hostel Student: హాస్టల్ నుంచి పారిపోతుండగా యాక్సిడెంట్.. బాలుడు మృతి

Hostel Student: హాస్టల్ నుంచి పారిపోతుండగా యాక్సిడెంట్.. బాలుడు మృతి

Road Accident: హాస్టల్ వెళ్లాలని కొందరు పిల్లలు ఉవ్విళ్లూరుతారు. తీరా హాస్టల్‌లో చేర్చాక పట్టుమని పది రోజులైనా ఉండలేకపోతారు. హాస్టల్ నుంచి ఇంటికి రావడానికి నానాప్రయత్నాలు చేస్తారు. తరుచూ హాస్టల్ రమ్మని తల్లిదండ్రులను కోరుతారు. అనేక సాకులు చెబుతూ హాస్టల్ వద్దని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. మరికొందరైతే ఎలాగైనా హాస్టల్ జీవితాన్ని తప్పించుకోవాలని అవసరమైతే గోడలు దూకి ఇంటికి చేరుకోవాలని ప్లాన్లు వేస్తారు. ఇంకొందరు అలా చేస్తారు కూడా. ఇలాగే ఓ విద్యార్థి హాస్టల్ నుంచి గోడ దూకి ఊరికి వెళ్లే ప్రయత్నం చేసి ఇంటికి కాదు కదా.. కానరాని లోకాలకు వెళ్లిపోయాడు.


ఈ దారుణ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. కొత్తపల్లి ఆశ్రమ పాఠశాలకు చెందిన హాస్టల్‌లో చదువుకుంటున్న కొందరు విద్యార్థులు అనుమతి లేకుండా ఇంటికి పారిపోవాలని అనుకున్నారు. హాస్టల్ నుంచి ఆ విద్యార్థులు గోడ దూకి బయటికి వచ్చారు. ఓ ఆటో ఎక్కి వారి స్వగ్రామానికి వెళ్లేందుకు సిద్ద పడ్డారు. ఆశ్రమ పాఠశాల వద్ద నుంచి ఆటో ఎక్కి స్వగ్రామం కోసం భద్రాచలం వైపు వెళ్లుతుండగా.. తునికి చెరువు వద్ద ఎదురుగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎనిమిదో తరగతి విద్యార్థి దీపక్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మరణించాడు. నలుగురు బాలురు తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన వారికి భద్రాచలం ఏరియా హాస్పిటల్‌లో చికిత్స అందుతున్నది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు భద్రాచలం ఏరియా హాస్పిటల్‌కు తరలివచ్చారు. మృతి చెందిన విద్యార్థి తల్లి దండ్రులైతే కన్నీటి సంద్రంలో మునిగిపోయారు.

Also Read: YS Jagan Bangalore Tour: వచ్చాడు.. పోయాడు.. జగన్ బెంగుళూరు జర్నీ


ఇక సంగారెడ్డి జిల్లా దుమ్ముగూడెం గ్రామానికి చెందిన బీఫార్మసీ చదువుతున్న తేజస్విని నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. శ్రీహరి అనే యువకుడు కొన్నాళ్లుగా తేజస్వినిని ఇన్‌స్టాగ్రామ్‌లో వేధించాడు. ఈ వేధింపులు తాళలేక తేజస్విని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకుని శ్రీహరి భయపడ్డాడు. ఆ భయంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించి శ్రీహరిని సూరారం హాస్పిటల్‌కు తరలించారు.

Related News

BRS Mlc Kavitha: రంగంలోకి కవిత.. రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Big Stories

×