EPAPER

First Shravan Saturday: శ్రావణ శనివారం ఇలా చేశారంటే శని ఆశీస్సులు మీ వెంట ఉన్నట్లే..

First Shravan Saturday: శ్రావణ శనివారం ఇలా చేశారంటే శని ఆశీస్సులు మీ వెంట ఉన్నట్లే..

First Shravan Saturday: హిందువులకు శ్రావణ మాసం అంటే చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. శ్రావణ మాసంలో విశేష పండుగలు జరుపుకుంటారు. ముఖ్యంగా శ్రావణ మాసం శివునికి అంకితం చేస్తారు. శ్రావణ మాసంలో మహా దేవుడు మరియు తల్లి లక్ష్మీ పార్వతిని పూజిస్తారు. ఈ తరుణంలో ప్రతీ రోజూ ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మాసంలో ఏ పని తలపెట్టినా కూడా అన్నీ ఫలిస్తాయని నమ్ముతారు. అయితే శ్రావణ నక్షత్రంలోని పౌర్ణమి తిథి నాడు వచ్చే శ్రావణ మాసం ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీన ప్రారంభమైంది. సోమవారం శివుడికి ప్రీతిపాత్రమైన రోజుగా భావించే అద్భుతమైన రోజున ప్రారంభమైంది.


30 రోజుల పాటు ఉండే శ్రావణమాసంలో శివుడు, లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, నాగ దేవత, ఇలా అందరినీ ప్రత్యేకంగా పూజిస్తుంటారు. ముఖ్యంగా ప్రతీ శుక్రవారం, శనివారాలు భక్తులు శ్రద్ధతో పూజ చేస్తారు. అందువల్ల శ్రావణ మాసం ఉన్న 30 రోజుల పాటు మాంసాహారాన్ని తినడం మానేస్తారు. మాంసాహారం జోలికి వెళ్లకుండా ఉండడం వల్ల ఈ మాసం మరింత ప్రత్యేకంగా మారుతుంది. అయితే రేపు శ్రావణంలో మొదటి శనివారం రాబోతుంది. శనివారం రోజున శని దేవుడిని పూజించడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి. శని దేవుడితో పాటు శివుడి ఆశీస్సులు కూడా అందుతాయని శాస్త్రం చెబుతుంది. అయితే శ్రావణ శనివారం పలు పూజా విధానాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.

శ్రావణ శనివారం చేయాల్సిన పనులు..


ఐదు రకాల పువ్వులు

శ్రావణ మాసంలో వచ్చే శనివారం నాడు శివ లింగానికి ఐదు రకాల పుష్పాలను సమర్పించాలి. అందులో బిల్వపత్రం, శమీ, అగస్త్య, అవిసె పువ్వు, ఘంటసాల పువ్వులను సమర్పిస్తే మంచి ఫలితం ఉంటుంది.

శని ప్రభావం తగ్గుతుంది

శ్రావణ మాసంలో వచ్చే శనివారం నాడు శివుడికి పుష్పాలతో పూజ చేయడం వల్ల శని ప్రభావం, దోషం తగ్గిపోతుంది. అంతేకాదు శని దోషం, మహాదశ, సాడేసతి వంటి దోషాలు కూడా తొలగిపోతాయి.

అవిసె పుష్పాలు

అవిసె పువ్వులు, బిల్వపత్రాలతో శివుడికి నైవేద్యం సమర్పిస్తే ప్రసన్నం అవుతాడని నమ్ముతారు. అందువల్ల శ్రావణ శనివారం నాడు ఇవి తప్పక పాటించాలి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Tirumal Laddu: పవిత్ర తిరుమల లడ్డూ తయారీలో 8 మంది కీలక పాత్ర, ఇంతకీ వాళ్లు ఎవరో తెలుసా?

Tulasi Plant: తులసి పూజ ఎప్పుడు చేయాలి, వాయు పురాణం ఏం చెబుతోందంటే..

Horoscope 20 September 2024: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే! శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం!

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Vriddhi Yog Horoscope: ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు

Big Stories

×