EPAPER

Medplus : మెడికల్ మాఫియా.. బిగ్ టీవీ స్టింగ్ ఆపరేషన్ లో సంచలన నిజాలు

Medplus : మెడికల్ మాఫియా.. బిగ్ టీవీ స్టింగ్ ఆపరేషన్ లో సంచలన నిజాలు

Medplus Medical Mafia: మెడికల్ షాప్‌లో ఏం దొరుకుతాయి? అదేంటి దీనికి కూడా ఆన్సర్ తెలియదా? మందులు.. వెళ్తాం.. కావాల్సినవి అడుగుతాం.. తెచ్చుకుంటాం.. అంతేకదా.. అనుకుంటున్నారు కదూ. కానీ మీరు అడిగిన ట్యాబ్లెట్స్‌ అడిగినట్టుగా ఇచ్చేయొచ్చా? అసలు మెడికల్ షాప్స్‌లో మనకు ట్యాబ్లెట్స్ ఎవరూ ఇవ్వొచ్చు. ఎవరు ఇవ్వకూడదు? అనే విషయం మీకు తెలుసా? ఈ విషయాలు మనకు తెలియవన్న కాన్ఫిడెన్స్‌తోనే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ షాప్‌ నిర్వాహకులు. ఇందులో గల్లీ షాప్‌ల నుంచి మొదలు పెడితే.. పెద్ద పెద్ద MNCలు నిర్వహించే షాప్‌లు కూడా ఉన్నాయి. దీనికి లేటెస్ట్‌ ఎగ్జాంపులే.. మెడ్‌ ప్లస్.


నిద్ర పట్టడం లేదు.. డిప్రెషన్‌గా అనిపిస్తుంది.. నొప్పి భరించలేకపోతున్నాను.. ఇలా అనేక కారణాలతో మెడికల్ షాప్‌లోకి వెళితే.. ఎందుకు? ఏంటి? అనేమి అడగడం లేదు. డబ్బులు తీసుకుంటున్నారు.. టాబ్లెట్స్ చేతిలో పెట్టేస్తున్నారు.. పంపిస్తున్నారు. ఇది అస్సలు కరెక్ట్ కాదు.. అసలు ఇలా ఇవ్వకూడదు.. అది నిజంగా ఓ నేరంతో సమానం. ఎందుకంటే ఎవరు పడితే వాళ్లు ఏ టాబ్లెట్ పడితే ఆ టాబ్లేట్ వేసుకుంటే.. కోరి కొరివితో తల గొక్కునట్టే. ఈ విషయం చాలా మంది కస్టమర్లకు తెలియదు. తెలిసినా మెడికల్ షాప్‌ వాళ్లు చెప్పడం లేదు.

కొన్ని మెడిసిన్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అస్సలు ఇవ్వకూడదు. షెడ్యూల్ H1, షెడ్యూల్ ఎక్స్. ఈ షెడ్యూల్‌లో ఉన్న టాబ్లెట్స్‌ను అస్సలు ప్రిస్కిప్షన్‌ లేకుండా వాడకూడదు. ఎందుకంటే ఇవి చాలా పవర్‌ఫుల్ కావడంతో పాటు.. చిన్న చిన్న సమస్యలకే వీటిని వేసుకోవడం ప్రారంభిస్తే.. మన హెల్త్ సిస్టమ్‌పైనే తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే వీటిని ప్రిస్క్రిప్షన్ లేకుండా అస్సలు ఇవ్వొద్దు. కానీ బయట జరుగుతుందేంటో తెలుసా?


Also Read: ‘డెడ్’ ప్లస్.. స్వేచ్ఛ-బిగ్ టీవీ స్టింగ్ ఆపరేషన్

మెడ్‌ ప్లస్‌ ఫార్మసీ చైయిన్‌లోని ఓ షాపులో బిగ్ టీవీ ప్రతినిధి టాబ్లెట్ తీసుకున్నాడు. తీసుకున్న టాబ్లెట్.. అల్ఫ్రాజోలుం.. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అది షెడ్యూల్‌ H1లో ఉన్న టాబ్లెట్. కనీసం మెడికల్‌ షాప్‌లోని ఎగ్జిక్యూటివ్‌ మాట వరుసకు కూడా ప్రిస్క్రిప్షన్‌ అడగలేదు. అడగ్గానే ఇచ్చేసింది.. ఇంకా డిస్కౌంట్‌ కూడా ఇచ్చింది. బహుశా ఆ ఎగ్జిక్యూటివ్‌కు ఆ టాబ్లెట్ ఎందుకు వాడతారు? అనే ఐడియా కూడా ఉండి ఉండదు.

మరి ఇలా ఫార్మసీలలో ఎవరూ పడితే వారు ఉండొచ్చా? నో వే.. అస్సలు అలా కుదరదు. మెడికల్ షాప్‌ చిన్నదైనా పెద్దదైనా అందులో ఫార్మాసిస్ట్ ఉండాలి. ఏ మందులను ఎలా వేసుకోవాలో క్లియర్‌ కట్‌గా వివరించాలి. ప్రిస్క్రిప్షన్‌ ఉంటేనే మందులు ఇవ్వాలి. అది కూడా రోగి మానసిక, శారీరక పరిస్థితిని బట్టే ఇవ్వాలి. కానీ చాలా మెడికల్ షాప్స్‌ అలా లేవని బిగ్ టీవీ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో తేలింది.

మెడ్ ప్లస్ అనేది చిన్న సంస్థ కాదు. దేశవ్యాప్తంగా సెకండ్ లార్జెస్ట్ ఫార్మసీ సంస్థలున్న ఆర్గనైజేషన్. మొత్తం 4 వేల వరకు స్టోర్స్ ఉన్నాయి ఈ సంస్థకు. ఇంత పెద్ద సంస్థ మాత్రం నిబంధనలను తుంగలో తొక్కి.. ఇలా దందా చేస్తోంది. రెస్టిల్ అనే టాబ్లెట్‌ను చాక్లెట్ అమ్మినట్టు అమ్మేస్తోంది మెడ్‌ప్లస్. ఈ టాబ్లెట్‌ ఒక్కసారి అలవాటైతే.. వేసుకోకుండా రోజు గడవదు. బ్రెయిన్ యాక్టివిటీపై అంతటి ఎఫెక్ట్ చూపిస్తుంది ఈ మెడిసిన్. ఒక్కసారి ఈ టాబ్లెట్‌ను వాడటం ఆపితే పిచ్చెక్కుతుంది. అసలు వాటిని ఇలా అమ్మొద్దన్న విషయం కూడా అందులో పనిచేసే వారికి తెలియదు. ఎలా తెలుస్తుంది.. ? వారి పరిస్థితి ఇలా ఉంటే.. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్‌ యాక్ట్‌ 1940 ప్రకారం ప్రతి మెడికల్‌ షాప్‌లో రిజిస్టర్డ్ ఫార్మాసిస్టు ఉండాలి. రిజిస్టర్డ్ ఫార్మాసిస్టు అంటే బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, డీఫార్మసీ పూర్తి చేసి రిజిస్టర్ చేసుకోవాలి. అలాంటి వారికి మాత్రమే మెడికల్ షాప్‌ నిర్వహించుకునే చాన్స్ ఉంటుంది. కానీ మెడ్‌ప్లస్‌లో అలాంటి పరిస్థితి లేదు.
టెన్త్, ఇంటర్ చదివితే చాలంట.. తీసేసుకుంటున్నారు.

అదండి సంగతి.. క్వాలిఫికేషన్‌ టెన్త్‌ ఉంటే సరిపోతుంది అంట. టాబ్లెట్ పేరు చెబితే.. ఏ డబ్బాలో ఉందో చూసి ఇచ్చేయడం.. అంతే. వాళ్లు అంతకుమించి ఏం ఎక్స్‌పెక్ట్ చేయడం లేదు. ఎందుకంటే వీరు భారీ జీతాలు ఎక్స్‌పెక్ట్ చేయరు కదా. జస్ట్ రూ.11 వేల నుంచి రూ.12 వేల 500 వరకు సాలరీ ఇస్తారు. వాళ్లే 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ఇంకేముంది రంగంలోకి దిగిపోయినట్టే.

Also Read: మెడ్ ప్లస్ మెడికల్ దందా.. స్టింగ్ ఆపరేషన్ తో యాజమాన్యంలో గుబులు ?

మరి అనుమతులు ఎలా వస్తున్నాయనే కదా మీ డౌట్. లైసెన్స్ వేరే వారిపై తీసుకుంటారు. వారి సర్టిఫికేట్‌ను అందరికీ కనపడేలా అక్కడ పెడతారు. కానీ మెయింటనెన్స్ మాత్రం మరోకరు చేస్తారు. ఆ సర్టిఫికేట్‌లో ఉన్నవారు కంటికి కనిపించరు. అసలు ఈ దందా ఎలా బయటికి వచ్చిందో తెలుసా? డ్రగ్స్‌ అంతం కోసం బిగ్‌ టీవీ చేస్తున్న యుద్ధంలో భాగంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

చాలా రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న డ్రగ్స్ అమ్మకాలనూ వెలుగులోకి తెచ్చే ప్రయత్నంలో బిగ్‌టీవీ బృందాలు శ్రమిస్తున్నాయి. ఈ కవరేజ్ సమయంలో మా దృష్టికి వచ్చింది ఈ విషయం. పట్టుమని పదేళ్లు కూడా లేని ఓ పిల్లాడు చెప్పిన మాటలే అసలు మెడికల్ షాప్స్‌లో ఏం జరుగుతుందో బయటపడటానికి కారణమైంది. మరి ఇంత జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? అనే కదా మీ డౌట్. ఈ విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు మెడ్ ప్లస్ నిర్వాహకులు.

సో.. అధికారులు వచ్చినప్పుడు వారికి ముందే తెలుస్తుంది అంట. వీళ్లు అరేంజ్ చేసుకుంటారంట. ఇలా అందరూ కలిసి ప్రజల ఆరోగ్యంతో వ్యాపారాలు చేస్తున్నారు. కోట్లు గడిస్తున్నారు.. ప్రజల ఆరోగ్యాలతో ఓ ఆట ఆడుకుంటున్నారు.

ఇప్పటికైనా అధికారులు మేల్కోండి. చిన్న చిన్న షాపులపై మాత్రమే కాకుండా.. ఇలాంటి బడా సంస్థలపై కూడా మీ ప్రతాపం చూపండి. ఈ మధ్య ప్రజలు ఇలాంటి వాటి వద్దకే ఎక్కువ వెళ్తున్నారు. కాబట్టి.. జర ఫోకస్ చేయండి.

Related News

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Big Stories

×