EPAPER

Mahesh Babu Birthday: అందమే కాదు.. ఆదర్శంలోనూ సూపర్ స్టారే..

Mahesh Babu Birthday: అందమే కాదు.. ఆదర్శంలోనూ సూపర్ స్టారే..

Mahesh babu 49 Birhday celebrations in Tollywood : అబ్బాయిలకే కాదు అమ్మాయిలకు కూడా అసూయ పుట్టించే అందం అతని సొంతం. అందరికీ వయసు పెరిగే కొద్దీ ముఖంలో వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. కానీ ఈ హీరోకి మాత్రం యాభైకి చేరువవుతున్నా వయసు మాత్రం 25లోనే ఆగిపోయింది అంంటే అతిశయోక్తి కాదు. అతడు నడుస్తుంటే మన ఇంట్లో మనిషి నటించినట్లుగా ఫీలవుతాము. స్వయంగా ఆయన పిల్లలతో ఫొటో దిగితే వాళ్లకు ఈయనే అన్నయ్యలా కనిపించడం విశేషం. 25 ఏళ్ల కెరీర్.. హీరోగా 25 సినిమాలు.. దాదాపు 18 సినిమాల హిట్లు.. యావరేజ్ టాక్ వచ్చినా దానిని కమర్షియల్ గా హిట్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న స్టార్ డమ్ ఉన్న హీరో అతడు. అతడే ప్రిన్స్ మహేష్ బాబు. నేడు 49వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు మహేష్ బాబు.


క్వాంటిటీ కాదు క్వాలిటీ..

సూపర్ స్టార్ హీరో కృష్ణ కుమారుడిగా సినిమాలకు ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత మహేష్ తండ్రే హీరో కృష్ణ అనిపించుకునే స్థాయికి ఎదిగాడు. సంవత్సరానికి ఒకటో రెండో సినిమాలు చేస్తున్నాడు. తండ్రిలా సంవత్సరానికి పది నుంచి పన్నెండు సినిమాలు చేయకుండా.. అవకాశాలు వస్తున్నా ఆచితూచి అడుగేస్తున్నాడు మహేష్ బాబు. కెరీర్ మొదట్లో ప్రయోగాలు చేసి దెబ్బతిన్నాడు. మోసగాళ్లకు మోసగాడు స్ఫూర్తిగా తీసుకుని టక్కరి దొంగ మూవీ చేశాడు. జనానికి అది నచ్చలేదు. మూతి మీద మీసం రాకుండానే తేజ మూవీ నిజంలో అవినీతిని ఎదిరించే పాత్రను చేశాడు. అయిదే ఆ ప్రయోగమూ వికటించింది. ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలే వన్ నేనొక్కడినే, స్పైడర్ లాంటి సినిమాలు చేసి ఇకపై తన అభిమానులు తననుంచి ఏం ఆశిస్తున్నారో అదే తరహా పాత్రలు చేసుకుంటూ వస్తున్నాడు. 2018లో కొరటాల దర్శకత్వంలో వచ్చిన భరత్ అను నేను మూవీ తర్వాత వరుసగా విజయాలను సొంతం చేసుకుంటూ వస్తున్నాడు. ఈ సంవత్సరం సంక్రాంతి రేసులో విడుదలైన గుంటూరు కారం మూవీ డివైడ్ టాక్ తెచ్చుకుంది. దీనితో పోటీగా వచ్చిన హనుమాన్ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. అయితే గుంటూరు కారం మూవీకి ఫ్లాప్ టాక్ వచ్చినా మహేష్ బాబు స్టామినాతో ఆ మూవీ దాదాపు రూ.250 కోట్లను వసూలు చేసింది.


కమర్షియల్ యాడ్స్ లోనూ..

సినిమాలలోనే కాదు అటు కమర్షియల్ యాడ్స్ లోనూ నెంబర్ వన్ బ్రాండ్ అంబాసిడర్ గా పేరు తెచ్చుకున్నాడు. అలాగని మహేష్ కమర్షియల్ హీరో కాదు. తోటివారు కష్టాలలో ఉంటే ఆదుకునే మెంటాలిటీ. అది తండ్రి హీరో కృష్ణ నుంచే వారసత్వంగా వచ్చింది. ఎందరో చిన్నారులకు హద్రోగ చికిత్సను ఉచితంగా అందిస్తున్న మానవతా వాది. ఇప్పటివరకూ వెయ్యికి పైగా చిన్నారులకు ఈ తరహా ఆపరేషన్లు చేయించాడు. వరుసగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 నంది అవార్డులు అందుకున్నాడు. ఇక ఫిలింఫేర్, సైమా అవార్డులు కూడా అందుకున్నాడు. సోషల్ మీడియాలోనూ ఎక్కువ మంది ఫాలోవర్స్ కలిగిన హీరో మహేష్ బాబే. దాదాపు కోటికి పైగా ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నాడు ఈ హీరో.

రీ రిలీజ్ కింగ్

మహేష్ పాత సినిమాలనూ ఎంతో క్రేజ్ గా చూస్తారు అభిమానులు. పోకిరి, దూకుడు, ఒక్కడు సినిమాలు రీ రిలీజ్ లోనూ కోట్లు వసూలు చేశాయి. ఈ సంవత్సరం మురారి మూవీని రీ రిలీజ్ చేశారు. టీవీలలోనూ మహేష్ బాబు సినిమాలను ఎంతో క్రేజ్ గా చూస్తారు ఆడియన్స్. ఇక త్వరలోనే రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కనున్న మహేష్ మూవీకి సంబంధించిన డిటైల్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ తర్వాత మహేష్ కు కూడా గ్లోబల్ ఇమేజ్ వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

 

Related News

Comedian Sapthagiri: ఇండస్ట్రీకి దూరమయ్యారా లేక దూరం పెట్టారా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Pushpa 2: వార్నర్ మామ ఇండస్ట్రీ ఎంట్రీ,రీల్స్ నుంచి రియల్ సినిమాలోకి

Devara: ఒకవైపు రాజమౌళి హీరో, మరో వైపు త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్ ఇక శివ ను ఆ శివయ్యే కాపాడాలి

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

SSMB29 : మహేష్- రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..!

Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు గా స్టార్ డైరెక్టర్స్?

Big Stories

×