EPAPER

Simbaa Movie Review: జగపతి బాబు, అనసూయ ‘సింబా’ ఫుల్ రివ్యూ.. ఎలా ఉందంటే..?

Simbaa Movie Review: జగపతి బాబు, అనసూయ ‘సింబా’ ఫుల్ రివ్యూ.. ఎలా ఉందంటే..?

Simbaa Review: సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘సింబా’ మూవీ ఇవాళ థియేటర్లలో రిలీజ్ అయింది. కొత్త దర్శకుడు మురళీ మనోహర్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో జగపతి బాబు, అనసూయ, కస్తూరి, దివి, శ్రీనాథ్, కబీర్ సింగ్ వంటి నటీ నటులు ముఖ్య పాత్రలు పోషించారు. సంపత్ నంది, రాజేందర్ కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు సినీ ప్రియుల్ని, అభిమానుల్ని ఆకట్టుకున్నాయి. ఎన్నో అంచనాల నడుమ ‘సింబా’ ఇవాళ అంటే ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది ఫుల్ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.


కథ

అక్ష (అనసూయ) ఒక టీచర్. ఆమె తరచూ స్కూల్‌లో పిల్లలకు పాఠాలు చెప్తూ జీవనం సాగిస్తూ ఉంటుంది. అయితే ఆమెకు అప్పటికే పెళ్లి కాగా.. ఆమె భర్తకు ఒక యాక్సిడెంట్‌లో కాళ్లు విరిగిపోయి మంచాన పడతాడు. దీంతో ఒకవైపు ఉద్యోగం చేస్తూ.. మరోవైపు ఇంటి బాధ్యతలు మోస్తుంది అక్ష. అలా లైఫ్‌ను లీడ్ చేస్తున్న సమయంలో ఓ రోజు ఆమె రోడ్డుపై వెళ్తుండగా ఒక వ్యక్తిని చూస్తుంది. దీంతో ఆమె మైండ్‌లో ఏదో జరిగి అతడిని ఫాలో అవుతుంది. ఆపై అక్ష ఆ వ్యక్తిని చంపేస్తుంది. ఈ హత్య కేసును ఛేదించేందుకు పోలీస్ ఆఫీసర్ అనురాగ్ (వశిష్ట సింహ), జర్నలిస్ట్ ఫాజిల్ (శ్రీనాథ్) కలిసి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అయితే ఓ రోజు అక్ష తన ఫ్యామిలీతో కలిసి షాపింగ్‌ చేస్తుంది. అదే సమయంలో జర్నలిస్ట్ ఫాజిల్, పోలీస్ ఆఫీసర్ అనురాగ్ కేసు విచారణ కోసం అదే ఏరియా వస్తాడు.


అయితే అక్కడ కూడా అక్ష మరో వ్యక్తిని చూసి చంపడానికి వెళ్తుంది. అదే సమయంలో జర్నలిస్ట్ ఫాజిల్‌కి కూడా మైండ్‌లో ఏదో జరిగి ఆ వ్యక్తినే చంపడానికి వెళ్తాడు. అలా అక్ష అండ్ ఫాజిల్ ఆ వ్యక్తి చంపేస్తారు. దీంతో పోలీస్ ఆఫీసర్ అనురాగ్ వారిద్దరి అరెస్ట్ చేస్తారు. ఆపై వారిని కోర్టులో హాజరుపరచడానికి తీసుకెళ్తున్న సమయంలో చనిపోయిన ఇద్దరూ పార్థ (కబీర్ సింగ్) మనుషులు కావడంతో.. తమ మనుషులను చంపిన వారిని హతమార్చాలని ప్లాన్ వేస్తారు. అక్ష అండ్ ఫాజిల్‌ని కోర్టుకు తీసుకెళ్తుండగా.. వారిపై అటాక్ చేస్తున్న క్రమంలో వారిద్దరితోపాటు మరో వ్యక్తి డాక్టర్ ఇరానీ (అనీష్ కురువిళ్ళ) కలిసి పార్థ తమ్ముడ్ని చంపేస్తారు. అయితే ఇదంతా ఎందుకు చేస్తున్నారు. వీళ్ల ముగ్గురి మైండ్‌లో ఏం జరుగుతుంది. చూడగానే వెళ్లి ఎందుకు చంపేస్తున్నారు. అదీ టార్గెట్ చేసి మరీ బిజినెస్ మ్యాన్ అయిన పార్థ మనుషులనే ఎందుకు చంపుతున్నారు. పర్యావరణ ప్రేమికుడు అయిన పురుషోత్తం రెడ్డి (జగపతిబాబు) కి ఈ ముగ్గురికి ఉన్న సంబంధం ఏంటి అనేది తెలియాలంటే వెళ్లి సినిమా చూడాల్సిందే.

Also Read: మొక్కలు నాటితే టికెట్స్ ఫ్రీ.. ‘సింబా’ మూవీ బంఫర్ ఆఫర్!

విశ్లేషణ

ఈ సినిమా ఒక రివేంజ్ స్టోరీ అయినా కొత్తగా అనిపించింది. దర్శకుడు చూపించే విధానం ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. కొత్త కాన్సెప్ట్‌తో పాటు మొక్కలు నాటాలి అని పర్యావరణానికి సంబంధించిన మెసెజ్‌ను అందించారు. ఇంటర్వెల్‌కి అసలు ఏం జరుగుతుందో అని ఆసక్తికరంగా ఉంటుంది. అయితే రెండవ పార్ట్ ఫ్లాష్‌బ్యాక్‌తో బాగా సాగదీసినట్లయింది.

పెర్ఫార్మెన్స్

ఇందులో అనసూయ నటన అదిరిపోయింది. ఓ పక్క టీచర్‌గా మరోపక్క మాస్ యాక్షన్ సీన్లలో దుమ్ముదులిపేసింది. అలాగే వశిష్ట పోలీస్ ఆఫీసర్ పాత్రలో పర్ఫెక్ట్‌గా అనిపించాడు. శ్రీనాథ్ పర్వాలేదు. జగపతి బాబు పర్యావరణాన్ని రక్షించే ఒక ప్రేమికుడిగా కొత్త పాత్రలో నటించి మెప్పించారు. మిగిలిన నటీ నటులు కూడా బాగా పెర్ఫార్మ్ చేశారు.

టెక్నికల్ అంశాలు

టెక్నికల్ టీంను బాగానే వాడుకున్నాడు దర్శకుడు మురళీ. మంచి విజువల్స్, ఆర్ఆర్‌లతో తన సినిమాను బాగానే ప్రజెంట్ చేశాడు. కొత్త దర్శకుడైనా కూడా ఆ అనుభవరాహిత్యం మాత్రం ఎక్కడా కనిపించలేదు. తొలి ప్రయత్నంలోనే మురళీ తన మేకింగ్ నాలెడ్జ్‌ను చూపించాడు. ఆయన మేకింగ్, టేకింగ్‌కు అందరినీ మెప్పిస్తుంది.

Also Read: దమ్ము మందు కంటే దుమ్ము వల్ల చనిపోయేదే ఎక్కువ..

దర్శకుడిగా మురళీ సింబా సినిమాతో అందరినీ ఆకట్టుకుంటాడు. కథ, కథనం కాస్త గాడి తప్పినట్టు అనిపించినా.. ఆ ఫీలింగ్‌ను ఆడియెన్స్‌కు కలిగించకుండా తీసుకెళ్తాడు. ఆ విషయంలో మురళీ సక్సెస్ అయినట్టే. మురళీ మేకింగ్ నాలెడ్జ్, అన్ని క్రాఫ్ట్‌ల మీదున్న పట్టు కనిపిస్తుంది. సినిమాకు ఏం కావాలో అది టెక్నికల్ టీం నుంచి రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు.

డైరెక్టర్ మురళీ తన మొదటి ప్రయత్నంలోనే చాలా వరకు సక్సెస్ అయినట్టుగా కనిపిస్తుంది. సింబాతో మురళీ తన దర్శకత్వ ప్రతిభను చాటుకున్నాడు. కథనంలో కాస్త లోపం ఉన్నా కూడా తన టేకింగ్ అది కవర్ చేసినట్టుగా అనిపిస్తుంది. టెక్నికల్ టీంను సైతం బాగానే వాడుకున్నాడనిపిస్తుంది. ఓవరాల్‌గా సింబాను గట్టెక్కించడంలో దర్శకుడిగా తన వంతు బాధ్యతను నిర్వర్తించాడనిపిస్తుంది.

రేటింగ్: 2.75

Related News

Comedian Sapthagiri: ఇండస్ట్రీకి దూరమయ్యారా లేక దూరం పెట్టారా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Pushpa 2: వార్నర్ మామ ఇండస్ట్రీ ఎంట్రీ,రీల్స్ నుంచి రియల్ సినిమాలోకి

Devara: ఒకవైపు రాజమౌళి హీరో, మరో వైపు త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్ ఇక శివ ను ఆ శివయ్యే కాపాడాలి

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

SSMB29 : మహేష్- రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..!

Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు గా స్టార్ డైరెక్టర్స్?

Big Stories

×