EPAPER

Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది!

Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది!

Astrology Today: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. మొత్తం పన్నెండు రాశులు. ఈ రాశుల్లో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఏ రాశి వారికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందనే విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి సౌభాగ్య సిద్ధి ఉంది. చేపట్టిన పనులు సకాలంలో విజయవంతమవుతాయి. ఆర్థికంగా లాభాలు ఉంటాయి.సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. హనుమాన్ చాలీసా చదివితే మంచిది.

వృషభం:
ఈ రాశి వారికి శుభకరంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఉన్నతాధికారులతోపాటు తోటివారి నుంచి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.ఉద్యోగులకు ప్రయోషన్స్, స్థాన చలనం ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.


మిథునం:
మిథున రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. ముఖ్యమైన పనుల్లో తోటివారి సలహాలతో విజయం పొందుతారు. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. నవగ్రహ ఆరాధన శుభప్రదం.

కర్కాటకం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారంలో ఆటంకాలు, సవాళ్లను ఎదురుకుంటారు. కీలక వ్యవహారాల్లో బంధుమిత్రుల సహకారం తీసుకుంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటివారి నుంచి సాయం అందుతుంది. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. శివారాధన శ్రేయస్కరం.

సింహం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన పనుల్లో ఆలస్యం కావొచ్చు. ఒత్తిడితో కూడిన విజయాలు ఉంటాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఉద్యోగంలో అనుకున్న పనులు పూర్తి కాకపోవచ్చు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.

కన్య:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఆశించిన లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్, స్థాన చలనం ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. శ్రీ మహాలక్ష్మి ఆలయ సందర్శన శుభప్రదం.

తుల:
ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు కలగకుండా చూసుకోవాలి. అధికారుల సలహాలతో పనులు ప్రారంభించాలి. దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి. కుటుంబ సభ్యులతో తగాదాలకు అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఆరోగ్యం క్షీణిస్తుంది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మంచిది.

వృశ్చికం:
ఈ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి  అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయి. చేపట్టే కీలక ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల సలహాలు అవసరం. ఆదాయం వృద్ధి చెందుతుంది. ప్రయాణాలు ఉంటాయి. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. పెండింగ్ సమస్యలు తీరుతాయి. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.

ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. పిత్రార్జితం నుంచి లాభాలు పొందుతారు. అన్ని రంగాల వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశీ ప్రయాణం ఉంటుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మేలు చేస్తుంది.

మకరం:
మకరం రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారం, ఉద్యోగంలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి విజయం సాధిస్తారు. ఉద్యోగులు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. వ్యాపారులకు పెండింగ్ బకాయిలు చేతికి అందుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

కుంభం:
కుంభ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ముఖ్యమైన పనుల్లో ఆచితూచి వ్యవహరించాలి. కొన్ని పనుల్లో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కోపం, చిరాకు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో నమ్రతగా ప్రవర్తించాలి. కుటుంబ సభ్యులతో కలహాలు ఏర్పడవచ్చు. ఆదాయం కంటే ఖర్చులు పెరగవచ్చు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. నవగ్రహ శ్లోకాలు చదవాలి.

మీనం:
మీన రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో ఇతరుల సహకారం అవసరం. కుటుంబ వ్యవహరాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఊహించని ధన లాభం ఉంటుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి. పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ద అవసరం. గణపతి ప్రార్థన శుభకరం.

Related News

Horoscope 20 September 2024: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే! శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం!

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Vriddhi Yog Horoscope: ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు

Guru Vakri 2024 : మరో 20 రోజుల్లో బృహస్పతి తిరోగమనం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారు

Budh Shani Yuti Horoscope: బుధ-శని సంయోగంతో ఈ 3 రాశుల వారు సంపదను పొందబోతున్నారు

Big Stories

×