EPAPER

Airport Without Passport: పాస్ పోర్ట్, ఐడి కార్డ్ లేకుండానే విమాన ప్రయాణం.. త్వరలో కొత్త టెక్నాలజీ!

Airport Without Passport: పాస్ పోర్ట్, ఐడి కార్డ్ లేకుండానే విమాన ప్రయాణం.. త్వరలో కొత్త టెక్నాలజీ!

Airport Without Passport| విమాన ప్రయాణం చేసే వారందరికీ ఎయిర్ పోర్ట్ అనుభవం ఎలా ఉంటుందో తెలిసే ఉంటుంది. ఎయిర్ పోర్ట్ లోపలి వెళ్లినప్పటి నుంచి విమానం సీటులో కూర్చొనే దాక.. గంటల తరబడి ఒక చోట నుంచి మరో చోటికి కదులుతూనే ఉండాలి.


ముందుగా ఎయిర్ లైన్ కౌంటర్ వద్ద పాస్ పోర్ట్, టికెట్ చూపించి బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. ఆ తరువాత లగేజ్ చెక్ ఇన్ చేయాలి. ఆ తరువాత సెక్యూరిటీ చెక్ కోసం అరగంట పాటు ఎదురుచూడాలి. అది పూర్తయ్యాక ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద జాగ్రత్తగా వెళ్లాలి. అక్కడ పాస్ పోర్ట్ లో ఇమ్మిగ్రేషన్ స్టాంప్ వేసిన తరువాత విమానం నిలబడి ఉన్న గేట్ వద్దకు వెళ్లి వాళ్లు పిలిచే వరకు ఎదురు చూడాలి. దాని కోసం మరో అర్దగంట కనీసం పడుతుంది. ఆ తరువాత మళ్లీ లైన్ లో నిలబడి.. బోర్డింగ్ పాస్, పాస్ పోర్ట్ చూపించి విమానంలోకి వెళ్లాలి. ఇదంతా పూర్తయ్యేవరకు ప్రయాణికుడి ఓపిక నశిస్తుంది. ఆ తరువాత విమానం గమ్యస్థానం చేసుకోగానే మళ్లీ ఎయిర్ పోర్ట్ లో దిగి అదే ప్రక్రియ రివర్స్ లో ఫాలో కావాలి.

అయితే ప్రయాణికుడికి ఈ ప్రక్రియ చాలా ఇబ్బందికరంగా ఉందనే ఆలోచనతో ఒక దేశంలోని ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికుల సౌకర్యం కోసం అంతా ఈజీ విధానం తీసుకురానున్నారు. కొత్త టెక్నాలజీతో పాస్ పోర్ట్, ఐడి కార్డ్ లేకుండా కేవలం 15 నిమిషాల్లోనే ఎయిర్ పోర్ట్ ప్రక్రియ అంతా పూర్తి చేసి బయటికి రావచ్చు. విమాన ప్రయాణం చేసేవారు ఇది వింటే ఎగిరి గంతేస్తారు.


అయితే ఈ టెక్నాలజీ కొంత వరకు మాత్రమే అమలులోకి వచ్చింది. యుఎఈ దేశంలోని అబుదాబి రాజ్యం ఎయిర్ పోర్టులో ప్రయాణికుల సౌకర్యం కోసం ఈ కొత్త టెక్నాలజీని కొంత వరకు ఉపయోగిస్తున్నారు. మరో సంవత్సర కాలంలో కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో ఎయిర్ పోర్టు మొత్తం స్మార్ట్ ట్రావెల్ ప్రాజెక్ట్ పూర్తిగా అమలులోకి తీసుకురానున్నారు. పాస్ పోర్ట్, ఐడీ లేకుండా అరైవల్స్, డిపార్చర్ వరకు ప్రతీ చెక్ పాయింట్ సెన్సార్ టెక్నాలజీ ఉంటుంది. ఈ టెక్నాలజీ సహాయంలో ప్రయాణికులు ఎయిర్ పోర్టు లోపలికి రాగానే వారి వ్యక్తి గత వివరాలు.. పేరు, వయసు, ఏ దేశానికి చెందిన వారు.. ఇలాంటి వివరాలన్నీ రికార్డ్ అయిపోతాయి. పైగా సెక్యూరిటీ చెకింగ్ కూడా పూర్తిగా అటోమేటిక్ స్కానింగ్ ద్వారా జరుగుతుంది.

Also Read: డేటింగ్ యాప్ లవ్.. బ్రేకప్ చెప్పిందని ప్రియుడు ఏం చేశాడంటే..

గల్ఫ్ దేశాలకు తరుచూ ప్రయాణించే వారి కోసం అబుదాబి ఎయిర్ పోర్ట్, దాని అనుబంధ ఎయిర్ లైన్స్ ఎతిహాద్ ఎయిర్ వేస్ లో ఈ టెక్నాలజీని రూపొందించారని ఎయిర్ పోర్ట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారి ఆండ్రూ ముర్ఫీ తెలిపారు. ”యుఎఈ దేశానికి తొలిసారి విచ్చేసిన ప్రయాణికులు, టూరిస్టుల సమాచారం సేకరించి వారి బయోమెట్రిక్ డేటా(వేలి ముద్రలు, ముఖం ఆకారం, కళ్ల స్కానింగ్) వివరాలు ఐసిపి (ఐడెంటిటీ, సిటిజెన్ షిప్, కస్టమ్స్ పోర్ట్ సెక్యూరిటీ) టెక్నాలజీ ద్వారా ఇమ్మిగ్రేషన్ విభాగానికి చేరిపోతుంది. ఈ డేటాని ఒక డేటా బేస్ లో స్టోర్ చేస్తారు. ఆ తరువాత ప్రయాణికుడు ఎన్నిసార్లు ఎయిర్ పోర్టుకు వచ్చినా.. ఆ వ్యక్తి ఎవరికీ తన పాస్ పోర్ట్ పత్రాలు చూపించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆ వ్యక్తి రెండోసారి నుంచి ఎప్పుడు వచ్చినా ఎయిర్ పోర్ట్ లోని కెమెరాలు, సెన్సార్లు ప్రయాణికుడిని స్కాన్ చేసి ఆ వివరాలను ఇమ్మిగ్రేషన్ కు పంపుతుంది. ఇమ్మిగ్రేషన్ విభాగం తన డేటా బేస్ లోని వివరాలను సెకండ్స్ వ్యవధిలోనే చెక్ చేస్తుంది. దీంతో ప్రయాణికుడి సమయం చాలా వరకు ఆదా అవుతుంది.” అని ముర్ఫీ వివరించారు.

అక్టోబర్ 2023లో ప్రయాణికులకు ఎయిర్ పోర్ట్ లో ఎదురయ్యే ఇబ్బందుల గురించి అంతర్జాతీయ విమాన ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ (ఐఎటిఏ) ఒక సర్వే చేసింది. ఈ సర్వేలో పాల్గొన్న 75 శాతం ప్రయాణికులు.. తమకు పాస్ పోర్ట్ లు, బోర్డింగ్ పాస్ లు ఇవ్వడం కంటే.. బయోమెట్రిక్ ద్వారా తమ వివరాలు చెక్ చేసుకోవడం సులభం అని అభిప్రాయపడ్డారు.

Also Read: డిగ్రీ చదవకుండానే సంవత్సరానికి రూ.5 కోట్లు సంపాదిస్తున్న యువతి.. ఎలాగంటే?..

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×