EPAPER

Noodles Side Effects: ఇష్టంగా నూడిల్స్ తింటున్నారా ? డేంజర్‌లో పడతారు జాగ్రత్త

Noodles Side Effects: ఇష్టంగా నూడిల్స్ తింటున్నారా ? డేంజర్‌లో పడతారు జాగ్రత్త

Noodles Side Effects: మారుతున్న జీవనశైలి కారణంగా బయటి ఫుడ్ తినడానికి చాలా మంది మొగ్గు చూపుతున్నారు. పిజ్జాలు, బర్గర్లు, కేఎఫ్‌సీలతో పాటు నూడుల్స్ వంటివి ఎక్కువగా తింటున్నారు. ఇదిలా ఉంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మెజారిటీగా ఆర్డర్ చేసే ఫుడ్ ఐటమ్స్‌లో నూడిల్స్ కూడా ఒకటి. అంతే కాకుండా మార్కెట్ నుంచి ప్యాకెట్లు కొని తెచ్చుకుని మరీ ఇంట్లో కూడా నూడిల్స్ తయారు చేసుకుని తింటున్నారు. అంతే కాకుండా పిల్లల కోసం కూడా తయారు చేసి పెడుతున్నారు. నూడిల్స్ లొట్టలేసుకుని తినే మందు అది ఎంత ప్రమాదమో ముందుగా తెలుసుకోవాలి.


ఇన్స్టంట్ నూడుల్స్ తయారు చేయడానికి మోనో సోడియం, గ్లూటామేట్ అనే పదార్థాన్ని వాడతారు. దీనివల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. నూడిల్స్ తినడం వల్ల మలబద్ధకం, కడుపు నొప్పి, తలనొప్పి సమస్యలు కూడా వస్తాయి. దీర్ఘకాల ప్రమాదకరమైన రోగాలు చుట్టుముడతాయి.

గుండె జబ్బులు:
నూడిల్స్ ఎక్కువగా తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నూడిల్స్ లో అధిక మొత్తంలో రసాయనాలు ఉంటాయి. ఇవి హృదయనాళ వ్యాధుల ప్రమాదాన్నిపెంచుతాయి. ఇన్స్టంట్ నూడుల్స్ తినేవారిలో గుండె జబ్బుల ప్రమాదం 1.1 రెట్లు ఎక్కువగా ఉంటుందని ఓ పరిశోధన ద్వారా రుజువైంది. ఈ పరిశోధన చైనాలోని పబ్లిక్ స్కూల్ ఆఫ్ పెకింగ్ యూనివర్సిటీ‌లో నిర్వహించారు. ఈ పరిశోధన ద్వారా నూడిల్స్ గుండె ఆరోగ్యానికి మంచిది కావని వెల్లడించారు.


జీర్ణ సమస్యలు:
ఇన్స్టంట్ నూడుల్స్ జీర్ణ సమస్యలకు కారణమవుతాయి. ఉబ్బరం, మలబద్ధకం, అతిసారంతో పాటు అనేక వ్యాధులను కలిగిస్తాయి, ఎందుకంటే ఇందులో తక్కువ మోతాదులో పీచు పదార్థాలు ఉంటుంది. సోడియం ఎక్కువగా ఉంటుంది దీని ద్వారా ఈ సమస్యలు తలెత్తుతాయి.

హైబీపీ:
నూడిల్స్ లో సోడియం కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటు పెరగడానికి కారణం అవుతుంది. దీంతో మూత్ర పిండాలు కూడా దెబ్బతింటాయని నిపుణులు చెబుతున్నారు.

క్యాన్సర్:
ఇన్స్టంట్ నూడుల్స్ లో హానికరమైన రసాయనాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్‌కు కారణమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పోషకాహార లోపం:
రిఫైండ్ ఫ్లోర్‌తో తయారుచేసిన నూడుల్స్ లో పోషకాలు ఎక్కువగా ఉండవు. వీటిలో ఫైబర్, ప్రోటీన్ ఉండదు. అందువల్ల పోషకాహార లోపం ఏర్పడుతుంది. దీంతో అనారోగ్యాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Also Read: తరచూ రాత్రి ఇలా భోజనం చేస్తే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలుసా.. !

మధుమేహం:
నూడిల్స్ తినడం వల్ల టైప్ -2 మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. వీటిలో సాధారణంగా శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను ఇది త్వరగా పెంచుతుంది. నూడిల్స్ వల్ల  మధుమేహం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందిని నిపుణులు చెబుతున్నారు.

అధిక బరువు:
నేటి కాలంలో అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు ఎక్కువగానే ఉంటున్నారు. దీనికి కారణం ఫాట్స్ ఫుడ్స్ తినడమే. ఎందుకంటే వీటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని తక్కువ మోతాదులో తీనడం ఉత్తమం.

Related News

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండారంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Big Stories

×