సంతోషకరమైన దాంపత్యానికి  ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్ పర్సన్సుధా మూర్తి చెప్పిన సలహాలు ఏంటో తెలుసా!

జీవితంలో వివాహ బంధం ఎంతో ముఖ్యమైంది. అయితే సంతోషకరమైన దాంపత్యాన్ని కొనసాగేందుకు ప్రేమ, అనుబంధంతోపాటు కొన్ని విషయాలు పాటించాలని సుధా మూర్తి వివరించారు.

ఒత్తిడికి దూరంగా..చిన్న చిన్న విషయాలకు సంతృప్తి చెందాలి.

ఆర్థికంగా భావోద్వేగపరంగా, మానసికంగా ఒకరిపై ఒకరు ఆధారపడాలి.

కష్టాలు అనేవి జీవితంలో ఒక భాగం అని ఇద్దరూ అర్థం చేసుకోవాలి.

భాగస్వామిని, లోపాలను ఉన్నవి ఉన్నట్లు స్వీకరించాలి.

బలాలు, బలహీనతలు తెలుసుకొని అండగా నిలవాలి.

జీవితం అంటేనే ఇవ్వడం, తీసుకోవడం.

ఒకరికి కోపం వచ్చినప్పుడు మరొకరు సమాధానం మౌనంగా ఉండాలి.

భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా జీవించాలి.

దంపతులు ఒకరి ఇష్టాలతోపాటు అయిష్టాలను గౌరవించాలి.