EPAPER

Food poisoning: నాగర్ కర్నూల్‌ జిల్లాలో ఫుడ్ పాయిజన్..40 మందికి అస్వస్థత

Food poisoning: నాగర్ కర్నూల్‌ జిల్లాలో ఫుడ్ పాయిజన్..40 మందికి అస్వస్థత

Food poisoning in NagarKurnool(Telangana news today): నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అచ్చంపేట మున్సిపల్ కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో గురువారం ఫుడ్ పాయిజన్ తో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన జిల్లాలో కలకలం రేపుతుంది. వెంటనే అప్రమత్తమైన హాస్టల్ సిబ్బంది ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


వివరాల ప్రకారం.. అచ్చంపేటలోని ఉప్పునుంతల రోడ్డు మార్గంలో లింగోటం సమీపంలో ఉన్న ఆక్స్పర్డ్ ప్రైవేట్ పాఠశాలలో హాస్టల్ లో కొంతమంది విద్యార్థులు ఉంటున్నారు. గురువారం ఉదయం 40 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. వెంటనే హుటాహుటిన అంబులన్స్ ద్వారా అచ్చంపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

విద్యార్థులు గురువారం ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత ఫుడ్ పాయిజన్ అయిందిం. చపాతీతోపాటు దోసకాయ పప్పుతో ూడిన కూర ఇచ్చారు. ఈ కూరగాయాల్లో రసాయన ఎరువుల ప్రభావం ఎక్కువగా ఉండడంతోపాటు సరిగ్గా శుభ్రం చేయడంతో సిబ్బంది నిర్లక్ష్యం వహించారు. దీంతోనే ఫుడ్ పాయిజన్ అయినట్లు సమాచారం. టిఫిన్ చేసిన తర్వాత విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. దీంతోనే అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.


Also Read: క్షమాపణలు చెప్పిన ‘బిత్తిరి సత్తి’.. అసలేం జరిగిందంటే?

అయితే, ఇటీవల ప్రభుత్వ హాస్టల్ తోపాటు ప్రైవేట్ హాస్టల్లోనూ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ మేరకు అన్ని హాస్టల్స్‌పై ప్రభుత్వం ఉన్నతాధికారులతో పర్యవేక్షించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రతీ రోజూ ఎక్కడో చోట ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పర్యవేక్షణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Related News

BRS Mlc Kavitha: రంగంలోకి కవిత.. రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Big Stories

×