EPAPER

CM Revanth met World Bank President: సీఎం రేవంత్‌రెడ్డి ప్లాన్ సక్సెస్.. ప్రపంచబ్యాంక్ గ్రీన్‌సిగ్నల్

CM Revanth met World Bank President: సీఎం రేవంత్‌రెడ్డి ప్లాన్ సక్సెస్.. ప్రపంచబ్యాంక్ గ్రీన్‌సిగ్నల్

CM Revanth met World Bank President: సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా టూర్ దాదాపు సక్సెస్ అయ్యిం ది. తెలంగాణ అభివృద్ధి‌లో భాగస్వామ్యానికి ప్రపంచబ్యాంక్ సంసిద్ధత వ్యక్తంచేసింది. అంతేకాదు ప్రపంచ బ్యాంకుతో కలిసి తెలంగాణ పని చేయాలని నిర్ణయించుకోవడం ఇదే తొలిసారి.


అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్‌‌రెడ్డి బుధవారం ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతో ప్రత్యే కంగా సమావేశమయ్యారు. వివిధ అంశాలపై గంటసేపు చర్చించారు. రాష్ట్రంలో చేపట్టనున్న వివిధ  ప్రాజెక్టులకు సంబంధించిన రోడ్ మ్యాప్ వివరించారు. తెలంగాణతోపాటు హైదరాబాద్ అభివృద్ధికి రేవంత్ సర్కార్ అనుసరిస్తున్న తీరు మంచి ఫలితాలు వస్తాయని ప్రపంచబ్యాంక్ ఆశాభావం వ్యక్తంచేసింది.

నెట్ జీరో సిటీ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి చూపిన చొరవపై ప్రపంచబ్యాంక్ ఆసక్తి కనబరిచింది. సమగ్ర సమతుల్య అభివృద్ధికి తెలంగాణ సర్కార్ అనుసరిస్తున్న తీరును ప్రపంచబ్యాంక్ ప్రశంసించింది. మూసీ నది పునరుజ్జీవనం, నైపుణ్య యూనివర్సిటీ, హైదరాబాద్‌లో మరో సిటీ ఏర్పాటును ప్రోత్సహించింది.


ALSO READ: ఇందిరమ్మ ఇళ్లపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

ప్రాంతాల వారీగా చేపట్టనున్న ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలు వాటి అమలును వేగంవంతం చేసేందుకు వివిధ విభాగాలకు చెందిన నిఫుణులతో బృందాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనను ప్రపంచబ్యాంకుతో సీఎం రేవంత్ పంచుకున్నారు.

CM Revanthreddy met World Bank President
CM Revanthreddy met World Bank President

మరోవైపు సీఎం రేవంత్ టీమ్ వివిధ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. మెటీరియల్‌ సైన్స్‌ సెక్టార్‌లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన కార్నింగ్ ఇన్‌కార్పొరేటేడ్ కంపెనీ తెలంగాణలో కొత్త ఆవిష్కరణలకు ముందుకొచ్చింది. ఫార్మా, కెమికల్ రంగాలలో అత్యాధునిక పరిశోధన, అభివృద్ది కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దడంతో కార్నింగ్‌ భాగస్వామిగా పని చేయనుంది.

CM Revanthreddy talks on Corning Incorporated company persons
CM Revanthreddy talks on Corning Incorporated company persons

తెలంగాణలో ఫార్మా గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం నెలకొల్పటంపై చర్చలు జరిపారు. వచ్చే ఏడాది నుంచి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమిస్తామని ప్రకటించింది. అత్యాధునిక గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం ఫార్మా రంగం అభివృద్ధికి దోహదపడుతుంది. ఔషధాల ప్యాకేజింగ్ పరిశ్రమలో ఈ గ్లాస్ ట్యూబ్‌లను ఉపయోగిస్తా రు. వీటి తయారీకి వినూత్నమైన వెలాసిటీ గ్లాస్-కోటింగ్ టెక్నాలజీని ఈ కంపెనీ వినియోగిస్తోంది.

Related News

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Big Stories

×