EPAPER

Manu Bhaker mets Sonia: ఢిల్లీలో డబుల్ షూటర్.. సోనియాగాంధీతో మనుబాకర్ సమావేశం.. కాకపోతే ?

Manu Bhaker mets Sonia: ఢిల్లీలో డబుల్ షూటర్.. సోనియాగాంధీతో మనుబాకర్ సమావేశం.. కాకపోతే ?

Manu Bhaker mets Sonia: పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన డబుల్ షూటర్ మనుబాకర్‌ కు స్వదేశంలో గ్రాండ్ వెల్ కమ్ లభించింది. ఈ క్రమంలో పలువురు ప్రముఖులను కలుస్తున్నారు. తన ఆనందాన్ని ప్రముఖులతో పంచుకుంటున్నారు. తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో మనుబాకర్ సమావేశమయ్యారు.


బుధవారం ఢిల్లీకి చేరుకున్న భారత్ యువ షూటర్ మనుబాకర్.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశం అయ్యారు. 10 జనపథ్ నివాసానికి వచ్చిన యువ షూటర్ దాదాపు పావు గంటపాటు మాట్లాడారు. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మనుబాకర్‌ను సోనియాగాంధీ అభినందించారు.

పారిస్‌లో ఆటతీరును సోనియాకు వివరించింది మనుబాకర్. ఈ సందర్భంగా తన దృష్టంతా 2028లో జరగనున్న లాస్‌ఏంజిల్స్ ఒలింపిక్స్‌పై ఫోకస్ చేస్తున్నట్లు చెప్పింది. ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే లోపా లను సరిదిద్దుకోవడానికి వీలవుతుందని చెప్పిందట యువ షూటర్. ఆమె ఆలోచన తీరు చూసి సోనియా గాంధీ మెచ్చుకున్నారు.


ALSO READ: సంచలన నిర్ణయం.. రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వినేష్ ఫొగట్

22 ఏళ్ల మనుబాకర్, పారిస్ ఒలింపిక్స్‌లో చారిత్రాత్మక విజయం సాధించింది. 1900 ఒలింపిక్స్‌లో 200 మీటర్ల స్ప్రింట్, 200 మీటర్ల హర్డిల్స్‌లో రెండు రజత పతకాలు సాధించాడు బ్రిటీష్-ఇండియన్ అథ్లెట్ నార్మన్ ప్రిట్‌చర్డ్. నార్మన్ తర్వాత అలాంటి ఘనత సాధించిన ఫస్ట్ భారతీయురాలు మనుబాకర్.

మహిళల సింగిల్స్ విభాగంలో 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ ఈవెంట్‌లో కాంస్యం సాధించింది. అలాగే మిక్స్‌డ్ 25 మీటర్ల విభాగంలో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి మరొక కాంస్యం మనుబాకర్ దక్కించుకున్న విషయం తెల్సిందే.

Related News

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

Big Stories

×