EPAPER

Tata Curvv EV Launched: టాటా కర్వ్‌ ఈవీ విడుదల.. సింగిల్ ఛార్జింగ్‌పై 585 కి.మీ మైలేజ్.. ధర, స్పెసిఫికేషన్స్ ఇవే..!

Tata Curvv EV Launched: టాటా కర్వ్‌ ఈవీ విడుదల.. సింగిల్ ఛార్జింగ్‌పై 585 కి.మీ మైలేజ్.. ధర, స్పెసిఫికేషన్స్ ఇవే..!

Tata Curvv EV Launched: వాహన ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్న టాటా కర్వ్ ఎట్టకేలకు దేశీయ మార్కెట్‌లో ఇవాళ (ఆగస్టు 7) విడులైంది. ఈ టాటా కర్వ్ అందరూ భావించినట్లుగానే ఎలక్ట్రిక్ వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇది మూడు వేరియంట్లలో రిలీజైంది. ఇందులో రెండు బ్యాటరీ ప్యాక్‌లను అందించారు. అందులో మిడ్ రేంజ్ 45 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీ, మరొకటి లాంగ్ రేంజ్ 55 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వచ్చాయి. ఇవి వరుసగా 502 నుంచి 585 కి.మీ మైలేజీని అందిస్తాయని కంపెనీ తెలిపింది.


ఈ ఎలక్ట్రిక్ కారులోని 123 కెడబ్లూహెచ్ మోటారు కేవలం 8.6 సెకన్లలో 0 నుంచి 100 స్పీడ్‌ను అందుకుంటుంది. అలాగే ఇది గంటకు 160 కి.మీ టాప్ స్పీడ్‌తో పరుగులు పెడుతుంది. ఇక దీని స్పెసిఫికేషన్లు, ఫీచర్ల విషయానికొస్తే.. ఈ టాటా కర్వ్ ఎలక్ట్రిక్ కారులో 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్, టచ్ క్లైమేట్ కంట్రోల్‌తో ఒక డాష్‌బోర్డ్ ఉంటుంది. అలాగే ఇందులో 10.25 అంగుళాల డిజిటల్ క్లస్టర్ ఉంది. ఇది కాకుండా దీని టాప్ వేరియంట్‌లో వెంటిలేడెట్ ఫ్రంట్ సీట్లు, లెథెరెట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, 320వాట్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

Also Read: ఏంటి భయ్యా ఈ అరాచకం.. హ్యుందాయ్ కార్లపై రూ.90 వేల వరకు డిస్కౌంట్స్..!


ఇది మూడు డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంది. అందులో ఎకో, సిటీ, స్పోర్ట్ వంటివి ఉన్నాయి. అలాగే ఇది వి2వి, వి2ఎల్ ఛార్జింగ్‌ ఆప్షన్‌తో వస్తుంది. ఇక దీని వీల్స్ విషయానికొస్తే.. ఇందులో 18 ఇంచుల వీల్, 190ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, 450 ఎంఎం వాటర్ వేడింగ్ డిప్త్ వంటివి కలిగి ఉన్నాయి. అలాగే ఇందులో సేఫ్టీ విషయానికొస్తే.. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఈఎస్‌పీ, ఆల్‌వీల్ డిస్క్ బ్రేక్స్‌తో సహా మరెన్నో ఫీచర్లు ఇందులో అందించారు.

ఇందులో చెప్పుకోదగ్గ మరో సేఫ్టీ ఫీచర్ ఏదన్నా ఉంది అంటే అది అలర్ట్ సౌండ్ సిస్టమ్. ఈ సిస్టమ్ ప్రకారం.. ఎవరైనా కారుకు దగ్గరగా వస్తే శబ్దాలు చేస్తుంది. అంతేకాకుండా ఇందులో లెవెల్ అడాస్ టెక్నాలజీ ఉంది. ఈ టాటా కర్వ్ ఐసీఈ ఇంజిన్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంటుంది. కాగా ఈ వెహికల్‌లో రెండు పెట్రోల్ ఇంజిన్‌లు, ఒక డీజిల్ ఇంజిన్ ఉన్నాయి. అలాగే ఇందులో కొత్త హైపెరియన్ జిడిఐ ఇంజిన్ కూడా ఉంది. ఇక వీటి ధరల విషయానికొస్తే.. కంపెనీ టాటా కర్వ్ ఈవీని రూ.17.49 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. అలాగే దీని టాప్ వేరియంట్ రూ.21.99 లక్షల ధరతో తీసుకొచ్చింది. అయితే కంపెనీ దీని ఐసీఈ వెర్షన్ ధరలను సెప్టెంబర్ 2వ తేదీన వెల్లడించనున్నట్లు తెలిపింది.

Related News

New Railway Super App: టికెట్ బుకింగ్ నుంచి PNR స్టేటస్‌ చెక్ వరకు.. అన్ని సేవలూ ఓకే చోట, త్వరలో సూపర్ యాప్ లాంచ్ చేయబోతున్న రైల్వే

NPS Vatsalya: మీ పిల్లల భవిష్యత్తు కోసం ఏడాదికి రూ.10 వేలు ఈ పథకంలో పెట్టండి.. 18 ఏళ్ల తర్వాత అదిరిపోయే బెనిఫిట్

Petrol, diesel prices : తగ్గిన చమురు ధరలు.. పెట్రలో, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. ప్రభుత్వం ఏం చెబుతోందంటే?..

డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా ఈ వాహనాలు నడపొచ్చు, పోలీసులు పట్టుకోరు, ఫైన్లు ఉండవు తెలుసా!

BMW XM: అరె బాబు.. ఇదేం కారు, దీని ధరతో హైదరాబాద్‌లో ఒక విల్లా కొనేయొచ్చు.. ఒక్కటే పీస్ అంట!

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజనలో కీలక మార్పులు.. కేంద్ర ప్రభుత్వం ప్రకటన

NAMX HUV: ఒక్క హైడ్రోజన్ క్యాఫ్సుల్‌లో 800 కి.మీ ప్రయాణం.. ప్రపంచంలోనే ఈ కారు వెరీ వెరీ స్పెషల్ గురూ!

Big Stories

×