EPAPER
Kirrak Couples Episode 1

Vijay: బీఆర్ఎస్ లోకి హీరో విజయ్!?.. ఆ బాధ్యతలు అప్పగిస్తారా?

Vijay: బీఆర్ఎస్ లోకి హీరో విజయ్!?.. ఆ బాధ్యతలు అప్పగిస్తారా?

Vijay: భారత్ రాష్ట్ర సమితి-బీఆర్ఎస్. ఢిల్లీ ఎర్రకోటపై గులాబీ జెండా ఎగురుతుందంటూ ఆరంభ శూరత్వం ప్రదర్శించారు కేసీఆర్. బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమానికి మాజీ సీఎం కుమారస్వామి, నటులు ప్రకాశ్ రాజ్ వచ్చారు. వారిద్దరూ కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారే కావడం ఆసక్తికరం. అంతేనా..? బీఆర్ఎస్ అంటే ఇంతేనా..? ఇలాగైతే ఎర్రకోట మీద గులాబీ జెండా ఎలా ఎగురుతుంది? అనే అనుమానాలు ముసురుతున్నాయి. కొండంత రాగం తీసి.. ఇలా సింపుల్ గా తుస్సు మనిపించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, కేసీఆర్ చాణక్యం అంతఈజీగా అంతుచిక్కదనే వారూ ఉన్నారు.


బీఆర్ఎస్ ఏర్పాటుకు ముందు పలు రాష్ట్రాలు చుట్టొచ్చారు కేసీఆర్. పలు పార్టీల నేతలతో ముచ్చటించారు. బెంగాల్ దీదీ మమతాబెనర్జీ నుంచి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, తమిళనాడు సీఎం స్టాలిన్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, మహారాష్ట్ర సీఎంగా ఉన్న ఉద్దవ్ ఠాక్రే, కేరళ సీఎం పినరయి విజయన్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఝార్ఖండ్ సీఎం సోరెన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్.. ఇలా అనేక మంది ప్రముఖులను కలిసి చర్చలు జరిపారు. ఇక, కమ్యూనిస్టు పెద్దలతోనూ ప్రగతిభవన్ లో భేటీ అయ్యారు. అంతా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకున్నాకే బీఆర్ఎస్ పేరుతో రంగంలోకి దిగారని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. అయితే, దేశమంతా తిరిగినా, కేసీఆర్ను ఎవరూ ఆదరించలేదని.. అందుకే పార్టీ ఏర్పాటులో కుమారస్వామి మినహా ఎవరూ అటెండెన్స్ వేసుకోలేదని ఎద్దేవా చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ప్రకాశ్ రాజ్ ముందునుంచీ కేసీఆర్ వెంటే ఉండటం.. ఆయనకు పెద్దగా రాజకీయ ఉనికి లేకపోవడంతో.. ఆ విలక్షణ నటుడిని లైట్ తీసుకుంటున్నారంతా.

అయితే, బీఆర్ఎస్ ఏర్పాటుకు కాస్త ముందు.. తమిళ హీరో, తలపతి విజయ్.. ప్రగతిభవన్ వెళ్లి మరీ సీఎం కేసీఆర్ ను కలవడం వెనుక సంథింగ్ సంథింగ్ అంటున్నారు. ఎన్నో సినిమాలు హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంటాయి. ఎంతమందో హీరోలు నగరానికి వచ్చి పోతుంటారు. అలాంటిది, హీరో విజయ్ మాత్రం ప్రత్యేకంగా కేసీఆర్ ను కలుసుకోవడంలో అంతర్యం ఉందంటున్నారు. విజయ్.. బీజేపీ వ్యతిరేక భావాజాలం ప్రదర్శిస్తుంటారు. పలు సందర్భాల్లో పరోక్షంగా విమర్శలు చేసిన ఘటనలు ఉన్నాయి. ఆయన రాజకీయ ప్రవేశంపైనా తరుచూ ఊహగానాలు వస్తుంటాయి. అలాంటిది, బీజేపీపై దేశవ్యాప్త పోరాటానికి సిద్దమవుతున్న కేసీఆర్ను.. హీరో విజయ్ కలవడం కాకతాలీయం కాకపోవచ్చని అంటున్నారు. బీఆర్ఎస్ లో విజయ్ చేరుతారా? ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తారా?


స్టాలిన్ కు ఎలాగూ సొంత పార్టీ ఉంది, టీఆర్ఎస్ కంటే బలమైన పార్టీ డీఎంకే. సో, తమిళనాడులో బీఆర్ఎస్ ఎంట్రీ ఇవ్వాలంటే అందుకు హీరో విజయ్ నే ఆప్షన్ గా చూజ్ చేసుకున్నారా? విజయ్ సైతం బీజేపీ వ్యతిరేక పార్టీ కాబట్టి.. బీఆర్ఎస్ పార్టీకి జై అనేందుకు సై అనే ఛాన్స్ ఉందా? ఇలా పలురకాలుగా ప్రచారం జరుగుతోంది.

రాజకీయాలకు సినిమా వాళ్లకు సంబంధాలు ఈనాటివి కావు. చరిత్రలో అనేక పేర్లు. సినిమా వాళ్లతో టచ్ లో ఉండటం బీజేపీ పొలిటికల్ గేమ్ లో భాగం. అప్పట్లో ప్రధాని మోదీ తమిళనాడు పర్యటనకు వెళ్లినప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఇంటికెళ్లి మరీ కలిశారు. ఇటీవల విశాఖలో పవన్ తో భేటీ అయ్యారు. అటు, అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కలవడం.. నడ్డాను హీరో నితిన్ మీట్ అవడం.. ఇవన్నీ రాజకీయ ఎత్తుగడలే అంటున్నారు. అంతేగానీ, వాళ్లు పార్టీలో చేరేది ఉండదు.. వాళ్ల ఫ్యాన్స్ కు గాలం వేయడమే స్ట్రాటజీ. సేమ్ టు సేమ్.. కేసీఆర్, విజయ్ ల భేటీని సైతం ఆ కోణంలోనే చూడాలని.. తమిళనాడులో బీఆర్ఎస్ తరఫున హీరో విజయ్ ను ముందుంచే అవకాశం తక్కువే..అంటున్నారు.

Related News

Roja Comments On Pawan: పవన్ కి ఏం తెలీదు.. బాబుకు బుద్ది లేదు.. ఓ రేంజ్ లో రెచ్చిపోయిన మాజీ మంత్రి రోజా

AP Govt: సలహా ఇవ్వండి.. సర్టిఫికెట్ తీసుకోండి.. ఏపీ సీఎం ఐడియా అదిరింది కదూ..

Jagan: జగన్ అనుకున్నదొక్కటి, అయ్యిందొక్కటి.. 12వ సారి..

Perni Nani: మసీదుకు వెళ్లి ప్రార్ధన చేసే చంద్రబాబు నిఖార్సైన హిందువా.. పేర్ని నాని కీలక వ్యాఖ్యలు

Road roller: విషాదం.. ఒకరి నిర్లక్ష్యం.. ఇద్దరు యువకులు బలి!

Roja new plan: పవన్ పై వ్యతిరేకత.. తమిళనాడులో రోజా బిజి బిజీ, ప్లాన్ ‘అదిరింది’

Tirupati Laddu Supreme Court : తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టులో పిటీషన్లు.. సెప్టెంబర్ 30న విచారణ

Big Stories

×