EPAPER

Bangladesh Crisis: బంగ్లా సంక్షోభం.. భారతపై ప్రభావమెంత?

Bangladesh Crisis: బంగ్లా సంక్షోభం.. భారతపై ప్రభావమెంత?

అక్కడి పరిస్థితిపై మోదీకి, విపక్షాలకు జయశంకర్ అర్ధమయ్యేలా చెప్పారు. మొత్తంగా అంతర్గత గందరగోళాలతో సంబంధం లేకుండా ఏ ప్రభుత్వం వచ్చినా.. స్నేహ హస్తం అందించేందుకు భారత్ రెడీ గా ఉందనేది క్లియర్.. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే.. బంగ్లాదేశ్ లో భారతీయులు చాలామందే ఉన్నారు. వారందరిని ఇక్కడికి తీసుకొస్తారు అనే టాక్ నడిచింది. కానీ అక్కడ అంత ప్రమాదకరమైన పరిస్థితులు లేవంటోంది కేంద్రం. అంతేకాదు.. వారితో టచ్ లో ఉన్నట్లు చెప్పారు కేంద్రమంత్రి జయశంకర్.. ఇంకా అక్కడి పరిస్థితులు హసీనాకు షెల్టర్ ఇవ్వడం. భారతీయుల క్షేమ సమాచారాలు. భారత్ వైఖరి  అన్నింటిపై రాజ్యసభలో క్లారిటీ ఇచ్చారు కేంద్రమంత్రి.

బంగ్లాదేశ్ తో భారత్ కు ఎప్పుడు వైరం లేదు. నిజానికి బంగ్లాదేశ్ దేశంగా ఏర్పడిందంటేనే అది భారత్ వల్ల. అందుకే షేక్ హసీనా గత 15 సంవత్సరాలుగా భారత్ తో సన్నిహితంగా కొనసాగారు. చాలా సందర్భాలలో భారత్ వ్యతిరేకులను బంగ్లాదేశ్ లో రెచ్చగొట్టే వ్యాఖ్యలను ఆమె తిప్పికొట్టారు. భారత్ కు బాహాటంగానే మద్దతు ఇస్తూ వచ్చారు. అంతేందుకు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పటి నుంచే..షేక్ హసీనా భారత్ తో సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తున్నారు. అటు చైనా బంగ్లాదేశ్ ను ఎంతగా భారత్ పై ఉసిగొల్పినా ఆమె భారత్ కే మద్దతిచ్చారు.


ఇప్పుడు హసీనా పగ్గాలు ఊడిపోయాయి. ఈ టైమ్ లో రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై ఏ మేరకు ప్రభావం పడుతుందనేది పాయింట్.. ఎందుకంటే భారతదేశానికి బంగ్లాదేశ్‌ అతిపెద్ద బిజినెస్ పార్టనర్ ఆసియా ఖండంలో బంగ్లాదేశ్‌కు చైనా తర్వాత భారత్‌ రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. పైగా భారతదేశం నుంచి అత్యధికంగా కాటన్‌ను దిగుమతి చేసుకుంటున్నది కూడా బంగ్లాదేశే.. భారత కాటన్‌ ఎగుమతుల్లో ఏకంగా 34.9 శాతాన్ని బంగ్లాదేశ్‌ దిగుమతి చేసుకుంటోంది. అంతేగాక పెట్రోలియం ఉత్పత్తులు, తృణధాన్యాలు కూడా భారత్‌ నుంచే. ఈ టైమ్ లో.. షేక్‌ హసీనా రాజీనామా చేయడంతో భారత్‌కు నష్టమనే చాలామంది ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. ఇంతకు ముందులా.. భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య రిలేషన్ ఉండకపోవచ్చని అంచనా.

Also Read: ఫ్యాన్స్‌కు రిషభ్ పంత్ బంపర్ ఆఫర్.. నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ గెలిస్తే..!

నిజానికి పాకిస్తాన్ ను శత్రుదేశంగా చూసేదే కానీ బంగ్లాదేశ్ ను మాత్రం భారత్ ఎప్పుడూ మిత్ర దేశంగానే భావిస్తూ వస్తోంది. అయితే షేక్ హసీనా ఎప్పుడైతే దేశం విడిచారో.. బంగ్లా దేశ్ సైన్యం అధీనంలోకి వెళ్లిపోయింది. అంతేకాదు షేక్ హసీనా ప్రత్యర్థి ఖలీదా జియా జైలు నుంచి విడుదలయ్యారు. ఇక్కడే అసలు మ్యాటర్ హాట్ హాట్ గా మారింది. అమెను తక్కువ అంచనా వేయకండి. ఖలీదా జియా భారత్ కు భద్ద శత్రువు. ఆమె ప్రధానిగా ఉన్న హయాంలో భారత్ సరిహద్దుల్లో బంగ్లా టెర్రరిస్టు చర్యలను ఆమె సమర్థించారు. కానీ ఇప్పుడు ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగితే భారత్ తో సంబంధాలే ప్రశ్నార్థకం. కానీ భారత్ బంగ్లాదేశ్ తో స్నేహంగానే ఉండేందుకు ప్రయత్నిస్తోంది. అక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా తమ మద్దతు ఇచ్చేందుకు సిద్ధమంటోంది. ఇక శాంతి భద్రతల విషయానికికొస్తే అది ఆ దేశానికి సంబంధించిన అంతర్గత సమస్య. అందులో జోక్యం చేసుకోకపోవడమే ఉత్తమం భారత్ ఆలోచన.

ఇక హసీనా మ్యాటర్ కు వస్తే.. ఆమె భారత్ లోనే ప్రస్తుతానికి ఆశ్రయం పొందుతున్నారు. ఇక్కడి నుంచి బ్రిటన్‌కు వెళ్తారనే టాక్ నడుస్తోంది. అయితే లండన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే వరకు ఆమె భారత్ లోనే ఉండనుంది. అయితే ఆమె భారత్ కు వచ్చిన ఇన్ని గంటలైనా మోదీ ఇప్పటి వరకు ఆమెను కలవలేదు. హసీనాతో మోదీ భేటీ అవుతారా.. లేదా అన్నది ఇప్పుడు వెయ్యి డాలర్ల ప్రశ్న. కాబట్టి మొత్తంగా చూస్తే.. బంగ్లాదేశ్ తో భారత్ సన్నిహితంగానే ఉండేందుకు నిర్ణయించుకుంది. కానీ అక్కడ వచ్చే ప్రభుత్వం ఎలా ఉండబోతుంది అనేది ఇక పెరుమాళ్లకే ఎరుక.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×