EPAPER

Swachh Bio invest: తెలంగాణాకు మరో భారీ పెట్టుబడి.. స్వచ్ఛ్ బయో.. రూ.1000 కోట్లతో

Swachh Bio invest: తెలంగాణాకు మరో భారీ పెట్టుబడి.. స్వచ్ఛ్ బయో.. రూ.1000 కోట్లతో

Swachh Bio invest: హైదరాబాద్‌లో నాలుగో సిటీని నిర్మిస్తున్నామన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌తోపాటు మెడికల్, టూరిజం, స్పోర్ట్స్, సాప్ట్‌వేర్, ఫార్మా విలేజ్‌లను అభివృద్ధి చేస్తామన్నారు.


న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వివిధ రంగాలకు చెందిన బిజినెస్‌మేన్లతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఫార్మా, ఐటీ, టెక్నాలజీ, ఈవీ బయోటెక్, షిప్పింగ్ రంగాలకు చెందిన ఛైర్మన్లు, సీఈవోలు పాల్గొన్నారు.

తెలంగాణలో వ్యాపారాలు, పెట్టుబడుల విస్తరణను మరింత సులభతరం చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అమెరికాలో ఉన్న వ్యాపార అవకాశాలు తెలంగాణలో ఉన్నాయని గుర్తు చేశారు. దీనికి సంబంధించి ప్రజంటేషన్ ఇచ్చారు.


Also Read: కేటీఆర్‌పై కేసు నమోదు.. ఎందుకంటే?

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు బయో ఫ్యూయల్స్ తయారీ సంస్థ స్వచ్ఛ్ బయో సంస్థ ముందుకొచ్చింది. మొదటి దశలో రూ.1000 కోట్లతో ఇథనాల్ ప్లాంటు నిర్మించనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 500 మంది ఉపాధి కలగనుంది. స్వచ్ఛ్ బయో ఛైర్మన్ ప్రవీణ్ పరిపాటితో సమావేశమై రేవంత్ టీమ్, తెలంగాణలో ప్లాంట్ ఏర్పాటుకు అనుకూల పరిస్థితులను వివరించింది.

CM Revanthreddy team MOU between Arcesium company
CM Revanthreddy team MOU between Arcesium company

మరోవైపు టెక్నాలజీ సర్వీస్ సొల్యూషన్స్‌లో పేరు పొందిన ఆర్సీసియం కంపెనీ తెలంగాణపై ఫోకస్ పెట్టింది. అక్కడ తమ కార్యకలాపాలు విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వంలో ఒప్పందం కుదుర్చు కుంది.

CM revanthreddy mets top CEOs business leaders at New York
CM revanthreddy mets top CEOs business leaders at New York

రాబోయే రెండేళ్లలో హైదరాబాద్‌లో 500 మంది అత్యాధునిక సాంకేతిక నిపుణులను ఆ కంపెనీ నియ మించుకోనుంది. ఈ సంస్థ బ్యాంకులు, హెడ్జ్ ఫండ్‌లు, ప్రైవేటీ ఈక్విటీ సంస్థలకు సంబంధించిన డేటాతపాటు కార్యకలాపాలపై విశ్లేషణలు అందిస్తుంది ఈ కంపెనీ.

CM revanthreddy mets top CEOs business leaders
CM revanthreddy mets top CEOs business leaders

ట్రైజిన్ టెక్నాలజీ కంపెనీ హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రాన్ని నెలకొల్పేందుకు సిద్ధమైంది. ఆ కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్ టీమ్‌తో సమావేశమయ్యారు. ఈ కంపెనీ డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్‌లకు అవసరమయ్యే ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్‌ను అందిస్తుంది. అంతేకాదు హైదరాబాద్‌లో ఇన్నోవేషన్ అండ్ డెలివరీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ట్రైజిన్ వెల్లడించింది. మరో ఆరునెలల్లో కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు తెలిపింది.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×