EPAPER

Vinesh Phogat enters final: ఫైనల్‌లో వినేశ్ ఫొగాట్.. ఆమె ఉడుంపట్టుకు క్యూబా రెజ్లర్ విలవిల..

Vinesh Phogat enters final: ఫైనల్‌లో వినేశ్ ఫొగాట్.. ఆమె ఉడుంపట్టుకు క్యూబా రెజ్లర్ విలవిల..

Vinesh Phogat enters final: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ మరో పతకం ఖాయమైంది. రెజ్లింగ్‌‌లో భారత్ క్రీడాకారిణి వినేశ్ ఫోగాట్ అదరగొట్టింది. సెమీస్‌లో క్యూబాకు చెందిన గుజ్మన్ లోపేజ్‌పై విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. దీంతో భారత్ ఖాతాలో మరో పతకం ఖాయమైంది.


మంగళవారం రాత్రి జరిగిన 50 కేజీల విభాగంలో భారత్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్- క్యూబాకు చెందిన గుజ్మన్ లోపేజ్‌ మధ్య పోరు సాగింది. ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన ఫోగాట్, ఆది నుంచి దూకుడుగా ఆడింది. పట్టులో ప్రత్యర్థికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. వినేశ్ కాలును మూడుసార్లు పట్టుకుని పడేయాలని ప్రత్యర్థి ఎత్తులు చిత్తయ్యాయి. కానీ వినేశ్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు.

రిఫరీ 30 సెకన్లపాటు లోపేజ్‌కు ఛాన్స్ ఇచ్చారు. దాన్ని అనుకూలంగా మలచుకుంది వినేశ్. ఆ తర్వాత నుంచి ప్రత్యర్థిపై ఎటాక్ మొదలుపెట్టింది. ప్రత్యర్థి రెండు కాళ్లును పట్టి ఎత్తేసి పడేసింది. దీంతో వినేశ్‌కు నాలుగు పాయింట్లు సాధించింది. చివరి నిమిషమున్నర ప్రత్యర్థికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదామె. చివరకు 5-0 తేడాతో క్యూబాపై విజయం సాధించి భారత అమ్మాయి వినేశ్ ఫోగాట్.


ALSO READ: వాళ్లిద్దరూ అవసరమా?.. గంభీర్ పై నెహ్రా సీరియస్

ఒలింపిక్స్‌లో తొలిసారి ఫైనల్‌కు చేరిన భారత రెజ్లర్‌గా వినేశ్ ఫోగాట్ రికార్డు క్రియేట్ చేసింది. అనేక కారణాలతో దాదాపు ఏడాదిన్నరపాటు ఆటకు దూరమైంది వినేశ్. ఒలింపిక్స్‌లో ఈమెపై పెద్దగా ఎవరికీ అంచనాలు లేవు.

ఆది నుంచి బలమైన ప్రత్యర్థులను ఎత్తి కుదేసింది వినేశ్ ఫోగాట్. తొలి మ్యాచ్ జపాన్‌కు చెందిన సుసాకిని ముప్పుతిప్పలు పెట్టింది. క్వార్టర్స్‌లో మాజీ యూరోపియన్ ఛాంపియన్ లివాచ్‌ను ఓడించింది. ఫైనల్లో అమెరికాకు చెందిన సారా హిల్డర్ బ్రాంట్‌తో వినేశ్ ఫోగాట్ తలపడనుంది.

 

 

Related News

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

IND vs BAN: ఇది గంభీర్ కు పరీక్ష.. రేపటి నుంచి బంగ్లాతో తొలిటెస్టు

IPL 2025: ముంబైలో ప్రకంపనలు…కొత్త కెప్టెన్​ అతడే..రోహిత్‌, పాండ్యా ఔట్‌?

Women’s T20 World Cup 2024: మహిళల టీ 20 ప్రపంచకప్.. వారితో సమానంగా.. ప్రైజ్ మనీ

Big Stories

×