EPAPER

OnePlus Open Apex Edition: బ్లాక్ బస్టర్.. 16GB ర్యామ్, 1TB స్టోరేజ్‌తో వన్‌ప్లస్ కొత్త ఫోన్.. కెమెరా కింగ్!

OnePlus Open Apex Edition: బ్లాక్ బస్టర్.. 16GB ర్యామ్, 1TB స్టోరేజ్‌తో వన్‌ప్లస్ కొత్త ఫోన్.. కెమెరా కింగ్!

OnePlus Open Apex Edition: టెక్ బ్రాండ్ OnePlus తన లైనప్‌లో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగానే ఆగస్టు 10న భారతదేశంలో OnePlus Open Apex Editionను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇ-కామర్స్ సైట్ అమెజాన్, వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉండనుంది. OnePlus ఓపెన్‌లో 6.31 అంగుళాల సూపర్ ఫ్లూయిడ్ AMOLED డిస్‌ప్లే, 7.82 అంగుళాల ఫ్లెక్సీ ఫ్లోయింగ్ AMOLED డిస్‌ప్లే ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


OnePlus Open Apex Edition లాంచ్‌కు ముందు కొన్ని ఆసక్తికరమైన స్పెసిఫికేషన్లు బయటకు వచ్చాయి. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ ప్రకారం.. OnePlus Open Apex Edition 16GB RAM + 1TB స్టోరేజ్‌ని పొందుతుంది. స్టోరేజ్ కాకుండా, ఇతర ఫీచర్లు అపెక్స్ ఎడిషన్‌లో ఉన్నాయి.

OnePlus Open Apex Edition Specifications


ఈ మడతపెట్టే OnePlus Open ఫోన్ 2K రిజల్యూషన్‌తో 6.31-అంగుళాల సూపర్ ఫ్లూయిడ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 10-120Hz రిఫ్రెష్ రేట్, 2800 nits గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంది. ఇది 7.82 అంగుళాల ఫ్లెక్సీ ఫ్లోయింగ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే ఇందులో 2K రిజల్యూషన్, 1-120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్నాయి. రెండు డిస్‌ప్లేలు 10-బిట్ LTPO 3.0 ప్యానెల్‌లు, UTG గ్లాస్‌కు మద్దతు ఇస్తాయి.

Also Read: అమెజాన్ ఆఫర్ల జాతర.. వన్‌ప్లస్, రెడ్‌మీ, ఐక్యూ 5జీ స్మార్ట్‌ఫోన్లు వెరీ చీప్ గురూ..!

ఇది Qualcomm Snapdragon 8 Gen 2 ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ఇందులో Adreno 740 GPU ఉంది. ఇది 16GB LPDDR5X RAMని కలిగి ఉంది. దీనిని 12GB వరకు విస్తరించవచ్చు. 512GB UFS 4.0 ఇంబిల్ట్ స్టోరేజ్ అందించబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ ఆధారిత ఆక్సిజన్‌ఓఎస్ 13.2పై పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే.. OnePlus Open వెనుక భాగంలో 48 మెగాపిక్సెల్ Sony LYT-T808 కెమెరా, 48 మెగాపిక్సెల్ Sony IMX581 అల్ట్రా-వైడ్ కెమెరా, 64 మెగాపిక్సెల్ OmniVision OV32C టెలిఫోటో కెమెరా ఉన్నాయి.

ముందు భాగంలో 32 మెగాపిక్సెల్‌ల మొదటి కెమెరా, 20 మెగాపిక్సెల్‌ల రెండవ కెమెరా అందించబడింది. ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4805mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఇది డాల్బీ అట్మాస్ ఆడియోతో కూడిన స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IPX4 రేటింగ్‌ను కలిగి ఉంది.

Related News

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Vivo V40e: ఊహించలేదు భయ్యా.. వివో నుంచి కొత్త ఫోన్, కీలక ఫీచర్లు వెల్లడి!

Inactive Gmail Accounts shutdown: సెప్టెంబర్ 20 నుంచి జిమెయిల్ అకౌంట్లు బంద్.. మీ అకౌంట్‌ని కాపాడుకోండిలా..

Samsung Galaxy M55s 5G: మరో చీపెస్ట్ ఫోన్.. ఈ టెక్నాలజీ అదిరిపోయింది, 50MP ఫ్రంట్ కెమెరా కూడా!

Flipkart Big Billion Days Sale 2024: కొత్త సేల్.. రూ.80,000 ధరగల ఫోన్ కేవలం రూ.30,000 లోపే, డోంట్ మిస్!

Big Stories

×