EPAPER

Weight Loss Drinks: ప్రతీ రోజూ డ్రింక్ తాగితే మీ ఒంట్లో ఉన్న కొవ్వును ఇట్టే కరిగించేస్తుంది..

Weight Loss Drinks: ప్రతీ రోజూ డ్రింక్ తాగితే మీ ఒంట్లో ఉన్న కొవ్వును ఇట్టే కరిగించేస్తుంది..

Weight Loss Drinks: శరీరంలో తరచూ తినే ఆహారం కారణంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో అధిక బరువు సమస్యతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బయట తీసుకునే ప్యాకేజీ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, బిర్యాణీలు, నూనె వస్తువులు వంటివి ఎక్కువగా తీసుకోవడానికి అందరు అలవాటు పడిపోతున్నారు. ఈ తరుణంలో బరువు పెరిగుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బరువు పెరగడానికి ఒక రోజు సరిపోయినా అది తగ్గడానికి మాత్రం నెలల తరబడి శారీరక శ్రమ చేయాల్సి వస్తుంది. అయితే శరీరంలో పేరుకుపోయిన చెబు కొవ్వును కరిగించడానికి అద్భుతమైన చిట్కాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా కొన్ని డ్రింక్స్ తీసుకుంటే కొవ్వును త్వరగా కరిగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.


శరీరంలో కొవ్వును కరిగించుకోవడానికి కేవలం న్యాచురల్ గా లభించే కొన్ని డ్రింక్స్ తీసుకోవడం వల్ల సులభంగా కొవ్వు కరిగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. సహజసిద్ధంగా తయారుచేసుకునే కొన్ని పానీయాలతో కొవ్వును కరిగించి బరువు తగ్గొచ్చని చెబుతున్నారు. ఈ క్రమంలో ఉసిరి, నిమ్మకాయలు, కొబ్బరి బొండం, యాపిల్ సైడర్ వెనిగర్ వంటి చాలా రకాల పానీయాలను తీసుకోవచ్చని చెబుతున్నారు.

ఉసిరి రసం


ఉసిరిలో ఉండే విటమిన్ సి జీవక్రియను మెరుగుపరుస్తుంది. అందువల్ల తరచూ గ్లాసు నీటిలో 2 నుంచి 3 స్పూన్ల ఉసిరి రసాన్ని కలిపి తీసుకుంటే కడుపులో ఉన్న కొవ్వు కరిగిపోతుంది.

నిమ్మకాయ నీరు

నిమ్మకాయ నీటిని తీసుకుంటే కూడా కొవ్వును సులభంగా కరిగించుకోవచ్చు. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని జీవక్రియను మెరుగుపరచేందుకు సహాయపడతాయి. అందువల్ల గ్లాసు నీటిలో నిమ్మకాయ రసాన్ని కలుపుని తరచూ ఖాళీ కడుపున తీసుకుంటే మంచిది.

కొబ్బరి బోండం నీరు

కొబ్బరి నీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల బరువు తగ్గడంతో పాటు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కొబ్బరి నీరు ఔషధంగా కూడా పనిచేస్తుంది. అందువల్ల శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.

అల్లం టీ

అల్లం టీ తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు కరిగిపోతుంది. అయితే దీనిని తరచూ తీసుకుంటేనే లాభం ఉంటుంది. అల్లం ముక్కలను మరిగించి అందులో తేనె లేదా నిమ్మకాయను కలుపుకుని తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

యాపిల్ సైడర్ వెనిగర్‌

యాపిల్ సైడర్ వెనిగర్ లో యాసిడ్ ఉంటుంది. అందువల్ల దీనిని తీసుకుంటే నడుపు, పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవచ్చు.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండారంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Big Stories

×