EPAPER

Komati reddy Venkat reddy: నాలుగు చక్రాల బైక్ నడిపిన నల్గొండ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

Komati reddy Venkat reddy: నాలుగు చక్రాల బైక్ నడిపిన నల్గొండ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

Telangana minister Komati reddy Venkat reddy drive the four wheeler bike:
నీ బుల్లెట్టు బండెక్కి వస్తానయ్యో వస్తానయో అంటూ ఆ మంత్రి పబ్లిక్ మధ్య సరదాగా ఫోర్ వీల్ బైక్ ను నడిపారు. తమ ప్రియతమ నాయకుడు పుర వీధుల్లో ఎలాంటి సెక్యూరిటీ లేకుండా అలా సాగిపోతుంటే చూసి మురిసిపోయారు నల్గొండ ప్రజానీకం. అభిమానుల కేరింతలు, కేకలు, హర్షధ్వానాలతో సందడి వాతావరణం నెలకొంది ఆ ప్రాంతమంతా. ఈ పని చేసింది ఎవరో కాదు తెలంగాణ సినిమాటోగ్రఫీ, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. వర్క్ విషయంలో సీరియస్ గా ఉండే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వాహనాలను నడిపే విషయంలో మాత్రం సరదాగా ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒక వాహనం తో రోడ్డు మీద కనిపించే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గతంలో బస్సు, ట్రాక్టర్, ఆటోలను నడిపి వార్తలలోకి ఎక్కేవారు. ఇప్పుడు సరికొత్తగా ఫోర్ వీలర్ బైక్ పై రాజసంగా అలా ప్రజల మధ్య డ్రైవ్ చేసుకుంటూ వెళుతుంటే చుట్టుపక్కల జనం చూసి మురిసిపోయారు.


ఫొటోలు తీసేందుకు అత్యుత్సాహం

తమ ప్రియతమ నేత అలా బండెక్కి ఉత్సాహంగా డ్రైవ్ చేస్తుంటే చూసేందుకు తరలి వచ్చారు. అంతకు ముందు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన ఇంట్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. తర్వాత బయటకొచ్చేసరికి కార్యకర్తలు ఉపయోగించే ఫోర్ వీలర్ బైక్ కనిపించింది. దానితో తాను డ్రైవ్ చేస్తానని కోరడంతో కార్యకర్తలు అక్కడికక్కడే ఎరేంజ్ చేశారు. స్థానిక ప్రజలంతా ఆయన బండి వెనక పరిగెత్తుకుంటూ వెళుతూ ఆయనతో ఫొటోలు దిగేందుకు అత్యుత్సాహం చూపారు. అయితే చాలా మంది ఆయన బైక్ ను నడిపించడాన్ని వీడియోగా తీయగా కొందరు ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. క్షణాలలో ఆ ఫొటోలు వైరల్ గా మారాయి. మంత్రి అలా నిరాడంబరంగా బైక్ నడపడాన్ని చూసిన కొందరు ఆయన సింప్లిసిటీకి అభినందనలు తెలుపుతున్నారు. పోలీసులు మాత్రం ఆ ప్రాంతంలో ట్రాఫిక్ క్లియర్ చేయలేక నానా యాతనలు పడటం కనిపించింది. నల్గొండలో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మాట్లాడుకుంటున్నారు పబ్లిక్.


Related News

BRS Mlc Kavitha: రంగంలోకి కవిత.. రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Big Stories

×