EPAPER

Wall Collapses In Madhya ‍Pradesh: పెను విషాదం..గోడ కూలి తొమ్మిది చిన్నారులు మృతి

Wall Collapses In Madhya ‍Pradesh: పెను విషాదం..గోడ కూలి తొమ్మిది చిన్నారులు మృతి

Wall Collapses In Madhya ‍Pradesh 9 Children Dead: మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సాగర్ జిల్లా షాజాపూర్‌లో ఆదివారం గోడ కూలడంతో తొమ్మిది మంది చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటనలో మరికొంతమందికి గాయలయ్యాయి. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.


పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. శిథిలాలను పూర్తిగా తొలగించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పాత గోడ కావడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని వెల్లడించారు.

సాగర్ జిల్లాలోని షాపూర్ ప్రాంతంలో ఆదివారం ఉదయం 8:30 గంటల సమయంలో గోడ కూలింది. గత కొన్నిరోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఓ దేవాలయం గోడ మెత్తబడింది. దీంతో ఒక్కసారిగా గోడ కూలి చిన్నారులపై పడింది. ఈ ఘటనలో 9మంది మృతి చెందగా..ఇద్దరు గాయపడ్డారు. ప్రస్తుతం ఈ ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారని సాగర్ జిల్లా కలెక్టర్ దీపక్ ఆర్య తెలిపారు.


కూలిన గోడ శిథిలాల కింద చిన్నారులు చిక్కుకొని దుర్మరణం చెందారు. ప్రస్తుతం స్థలంలో ఉన్న శిథిలాలను సైతం తొలగిస్తున్నట్లు సాగర్ జిల్లా కలెక్టర్ తెలిపారు.

Also Read: బస్సు – కారు ఢీ.. ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ వే పై ఘోరప్రమాదం

ఇదిలా ఉండగా, రేవా జిల్లాలో ఓ శిథిత భవనం గోడ కూలి నలుగురు విద్యార్థులు మృతి చెందగా.. ఓ మహిళతోపాటు ఓ చిన్నారి గాయపడ్డారు. స్కూల్ వెళ్లిన విద్యార్థులు ఇంటి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు రేవా పోలీస్ అధికారి మహేంద్ర సింగ్ సికర్వార్ తెలిపారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే ప్రమాదం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×