EPAPER

Child Kidnapping Case: అబిడ్స్‌ చిన్నారి కిడ్నాప్‌ కథ సుఖాంతం.. పోలీసుల అదుపులో కిడ్నాపర్

Child Kidnapping Case: అబిడ్స్‌ చిన్నారి కిడ్నాప్‌ కథ సుఖాంతం.. పోలీసుల అదుపులో కిడ్నాపర్

Abids Police Rescued 6-Year-Old Girls from kidnap: అబిడ్స్‌ కిడ్నాప్‌ కేసు సుఖాంతమైంది. కానీ చిన్నారి సేఫ్‌ అన్న వార్త చెవిన పడే వరకు తల్లిదండ్రులకు ఒక్కటే టెన్షన్‌. కిడ్నాప్ అయిన చిన్నారిని నిందితుడు ఏం చేస్తాడో అని భయం. ఆ ఆందోళనకు చెక్‌ పెట్టిన పోలీసులు నిందితుడికి కటకటాల పాలు అయ్యేలా చేశారు. నిందితుడు బీహార్ కు చెందిన బిలాల్ గా గుర్తించారు. తమ కుమార్తెను చూసిన వెంటనే ఆ తల్లి కంటతడి పెట్టింది. సేఫ్ గా తీసుకువచ్చిన పోలీసును హత్తుకుని కృతజ్ఞతలు తెలిపింది. ఆ తర్వాత తన బిడ్డను ఎత్తుకొని ముద్దుల వర్షం కురిపించింది. ఈ సీన్ తో అక్కడ ఉన్న వారి హృదయాలు చలించిపోయాయి.


ప్రియాంక అనే మహిళ తన తమ్ముడితో కలిసి హైదరాబాద్ లోని ఓ ప్రాంతంలో నివసిస్తోంది. అయితో సోదరుడు కుమార్తె ప్రగతితో కలిసి ప్రగతితో కలిసి కట్టెలమండిలోని తన తల్లి వద్దకు వెళ్లింది. అదే సమయంలో ప్రియాంక సోదరుడి హృతిక్ తో కలిసి ఆడుకోవడానికి బయటకు వెళ్లింది. కొంచెం సేపటి తర్వాత హృతిక్ ఒక్కడే ఇంటికి చేరుకున్నాడు. తన వెంట చిన్నారి లేకపోవడంతో ప్రగతి రాకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాలను బాలిక మేనత్త ప్రియాంక వెతికారు. ఎంత ఎదురుచూసిన బాలిక ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు కలిసి అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అలా కంప్లైంట్ రావడమే లేటు పోలీసులు అలర్ట్ అయ్యారు. సిటీ శివారు పోలీసులను అప్రమత్తం చేశారు. నిమిషాల వ్యవధిలోనే ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రాత్రి అంతా కూడా సీసీ టీవీ ఫుటేజీని విశ్లేషిస్తూ.. పాప ఆచూకీ కనుగొన్నారు. కట్టెల మండి నుంచి MGBS వరకు ఆటోలో వెళ్లారు. అక్కడ ఆర్టీసీ బస్సు ఎక్కి కొత్తూరులో తాను ఉంటున్న దగ్గరికి బాలికను తీసుకెళ్లాడు. చివరకు కొత్తూరు పీఎస్‌ పరిధిలో చిన్నారిని గుర్తించారు.


అబిడ్స్ ఏసిపి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో 8 పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. దాదాపు 300 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించారు. జస్ట్‌ 12 గంటల వ్యవధిలోనే కిడ్నాప్‌ కేసును ఛేదించి తెలంగాణ పోలీసులు మరోసారి శెభాష్‌ అనిపించుకున్నారు. తల్లి చెంతకు తన బిడ్డను చేర్చి వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపారు. తమ బిడ్డను మళ్లీ చూస్తామో లేదో అనుకున్న వారి భయాన్ని ఆదిలోనే పాతరేశారు అబిడ్స్‌ పోలీసులు. అందుకే వారు నిండు మనుసుతో తెలంగాణ పోలీసులను అభినందిస్తున్నారు. పాప ఇంకా షాకింగ్ లోనే ఉందని తల్లి చెబుతోంది.

Also Read: బీఆర్ఎస్ నుంచి మరో ఆరుగురు? వెళ్లక తప్పదా?

అబిడ్స్ పీఎస్ కు పాపతో సహా నిందితుడిని పోలీసులు తీసుకొచ్చిన సందర్భంలో కాస్త ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిందితుడిని చిన్నారి బంధువులు చితకబాదారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ వారి కోపం కట్టలుతెచ్చుకుంది. చట్ట ప్రకారం శిక్ష పడుద్ది అని పోలీసులు వారికి హామీ ఇవ్వడంతో కాస్త శాంతించారు. మొత్తంగా పోలీసులు ఇంత స్పీడ్ గా రియాక్ట్ కాకపోయి ఉంటే చిన్నారిని గుర్తించడం మరింత కష్టంగా మారి ఉండేది. కేసు ఛేదనలో సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి.

Related News

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Big Stories

×