EPAPER

Big Boss fame Adi Reddy: బిగ్ బాస్ మోసాలు ఇన్నిన్ని కావయా? బీ కేర్ ఫుల్ అంటున్న ఆదిరెడ్డి

Big Boss fame Adi Reddy: బిగ్ బాస్ మోసాలు ఇన్నిన్ని కావయా? బీ కేర్ ఫుల్ అంటున్న ఆదిరెడ్డి

Big Boss season 6 contestant Adi Reddy told about frauds with name of reality show: ఏడు సీజన్లుగా బిగ్ బాస్ షో అలరిస్తోంది బుల్లితెర ప్రేక్షకులను. ఇప్పుడు సీజన్ 8 గా సెప్టెంబర్ మొదటి వారంలో ఆరంభం కానుంది. ఇప్పటికే నాగార్జున యాక్ట్ చేసిన బిగ్ బాస్ 8 కు సంబంధించిన ఓ ప్రోమో విడుదల అయింది. ఇందులో నాగార్జున వరాలిచ్చే జినిగా కనిపించి బిగ్ బాస్ 8 పై అంచనాలు పెంచేశారు. ప్రతి సీజన్ లాగా ఈ సారి మాత్రం కంటెస్టెంట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడంతో ముందుగా ఏమీ లీక్ కావడం లేదు. మీడియలో ఫలానా వాళ్లను బిగ్ బాస్ 8లో తీసుకున్నారంటూ కథనాలు వస్తున్నాయి. కానీ కన్ఫామ్ గా ఎవరనేది తెలియడం లేదు. అయితే బిగ్ బాస్ పేరుతో జరిగే మోసాల గురించి ఆదిరెడ్డి ఓ వీడియో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.


ఆరో సీజన్ కంటెస్టెంట్ గా

ఆదిరెడ్డి బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా చేశాడు. బిగ్ బాస్ హౌస్ కు రాకముందు ఆదిరెడ్డి బిగ్ బాస్ కార్యక్రమాలపై ఏ రోజుకారోజు రివ్యూ ఇచ్చేవారు. హౌస్ లో ఎవరెవరు ఏం చేశారు. ఇది తర్వాత వారం వాళ్లపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది. ఎవరెవరికి మంచి పేరు వచ్చింది? ఎవరు హుందాగా ప్రవర్తించారు వంటి విషయాలను కూలంకషంగా చర్చించి తన రివ్యూ ఇచ్చేవాడు. ప్రత్యేకంగా ఆదిరెడ్డి రివ్యూల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసేవారు. దీనిని బట్టి ఆదిరెడ్డి కి ఉన్న డిమాండ్ ఏమిటో తెలుస్తుంది. ఈ ఎనిమిదో సీజన్ రివ్యూలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నవాడు ఆదిరెడ్డి. అయితే ఆదిరెడ్డి బిగ్ బాస్ 8 ప్రసారానికి ముందుగానే బిగ్ బాస్ గురించి ఆసక్తికరమైన అంశాలను బయటపెట్టాడు.


బిగ్ బాస్ పేరిట కొత్తగా మోసాలు

ఈ మధ్య కొన్ని కొత్త తరహా మోసాలు బయటకొస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 8కి సెలక్ట్ కావాలంటే తమని సంప్రదించాలని పోస్టులు పెడుతున్నారు అది చూసి నిజమేననుకుని కొందరు అమాయకులు తమ వ్యక్తిగత డిటైల్స్ ను పంపుతున్నారు. కంటెస్ట్ చేసిన వారికి ఓ ఇరవై లక్షలు ఇస్తారని..అందులో ఇరవై శాతం అంటే నాలుగు లక్షల రూపాయలు తమ అకౌంట్ లో వస్తే వాళ్లకు బిగ్ బాస్ షోలో అవకాశం దొరుకుతుందని మభ్యపెడుతున్నారు. అలా నమ్మినవారి నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు. కొందరిని ఓటీపీ నెంబర్ పెట్టమని వాళ్ల ఎకౌంట్ లో డబ్బులన్నీ స్వాహా చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని..అటువంటి వాటిపై ఓ కన్నేయాలని ఆదిరెడ్డి సూచిస్తున్నారు.

అధికారిక వెబ్ సైట్ లోనే సంప్రదించండి

బిగ్ బాస్ హౌస్ లో ఎంపిక అనేది ఓ ప్రాసెస్ ప్రకారం జరుగుతాయని అన్నారు.కేవలం అందుకు సంబంధించిన వివరాలు అఫీషియల్ సైట్ లో మాత్రమే ఉంటాయని..కాబట్టి బిగ్ బాస్ పేరుతో ఫేక్ ప్రచారాలు నమ్మకండి అంటున్నాడు ఆదిరెడ్డి. తాను కూడా అదే ఫాలో అయ్యానని అంటున్నాడు ఆదిరెడ్డి. తనకు ఈ షో ద్వారా 25 నుంచి 30 లక్షల దాకా వచ్చాయని అంటున్నాడు ఆదిరెడ్డి. దయచేసి ఎవరైనా బిగ్ బాస్ కు మిమ్మల్ని రికమెండ్ చేస్తామని అన్నా నమ్మకండి అంటూ జనాలను అప్రమత్తం చేస్తున్నాడు. ఆది సామాజిక బాధ్యతతో ఇలా జనాలను అప్రమత్తం చేయడం చూసి అంతా మెచ్చుకుంటున్నారు.

Related News

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Pushpa 2: వార్నర్ మామ ఇండస్ట్రీ ఎంట్రీ,రీల్స్ నుంచి రియల్ సినిమాలోకి

Devara: ఒకవైపు రాజమౌళి హీరో, మరో వైపు త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్ ఇక శివ ను ఆ శివయ్యే కాపాడాలి

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

SSMB29 : మహేష్- రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..!

Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు గా స్టార్ డైరెక్టర్స్?

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Big Stories

×