EPAPER

India vs Sri Lanka 2nd ODI Match: భారత్ వర్సెస్ శ్రీలంక..రెండో వన్డేలో కీలకమార్పు!

India vs Sri Lanka 2nd ODI Match: భారత్ వర్సెస్ శ్రీలంక..రెండో వన్డేలో కీలకమార్పు!

India vs Sri Lanka 2nd ODI: శ్రీలంక, భారత్ మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. శ్రీలంక విధించిన 231 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ ఆ స్కోరును సమం చేసింది. దీంతో తొలి మ్యాచ్ టైగా ముగిసింది. స్పిన్ కు అనుకూలించిన పిచ్‌పై అతిథ్య బౌలర్లు ఓడే మ్యాచ్‌ను సమం చేసుకున్నారు. బంతులు మిగిలున్నా..స్పిన్ ఉచ్చులో పడి ఆశించిన ఫలితాన్ని భారత్ రాబట్టలేకపోయింది. ఆదివారం జరిగే రెండో వన్డేలో గెలుపే లక్ష్యంగా రోహిత్ సేన బరిలోకి దిగుతుంది.


తొలి వన్డే మ్యాచ్ భారత్‌కు టై ఫలితం ఊహించనిది. స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై ఆతిథ్య బౌలర్లు ఓడిపోయే మ్యాచ్‌ను సమం చేసుకున్నారు. ఈ మ్యాచ్ తర్వాత భారత జట్టుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో రెండో మ్యాచ్‌లో కొంతమంది ఆటగాళ్లు తప్పుకోవడం ఖాయమని తెలుస్తోంది. ఇందులో భాగంగా రెండో మ్యాచ్‌కు భారత్ జట్టులోకి ప్రత్యేక ఆటగాడు రియాన్ పరాగ్‌ రావొచ్చని సమాచారం. వాషింగ్టన్ సుందర్‌ను తప్పించి రియాన్ పరాగ్‌కు చోటు కల్పించే అవకాశం ఉంది.

శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో వాషింగ్టన్ సుందర్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. బౌలింగ్‌లో ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు. 9 ఓవర్‌లో ఒక్క ఓవర్ మెయిడిన్ ఓవర్ వేసి 46 పరుగులు ఇచ్చిఒక్క వికెట్ తీశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌లో కూడా 5 పరుగులు మాత్రమే చేశాడు. అతను అవసరమైన
సమయంలో జట్టుకు సహకరించలేకపోయాడు. ఈ కారణంగా అతను బెంచ్‌కే పరిమితం కావొచ్చు.


ఇదిలా ఉండగా, కొలొంబో వేదికగా ప్రేమదాస స్టేడియంలో మధ్యాహ్నం 2:30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ వేదికపై భారత్.. 6 మ్యాచ్‌లు గెలిచింది. 2021లో చివరిసారిగా శ్రీలంక చేతిలో భారత్ ఓడింది. ఆ తర్వాత గత మినహా ఆడిన ప్రతి మ్యాచ్ గెలిచింది.

Also Read: మీరు రారు, మేం రావాలా?.. పాక్ ఆగ్రహం.. ఛాంపియన్స్ ట్రోఫీపై రచ్చ

జట్టు(అంచనా)..
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, అయ్యర్, కేఎల్ రాహుల్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్/ రియాన్ పరాగ్, కుల్దీప్, మహ్మద్ సిరాజ్.

శ్రీలంక: అసలంక (కెప్టెన్), నిసాంక, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండీస్, సమరవిక్రమ, లియనగే, వెలలగే, హసరంగ, ధనంజయ, షిరాజ్, అసిత ఫెర్నాండో.

Related News

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్: బంగ్లాదేశ్ 26/3

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Big Stories

×