EPAPER

Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభం!

Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభం!

Astrology Today: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం..మొత్తం పన్నెండు రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఏ రాశి వారికి కష్టతరంగా ఉంటుంది? వంటి విషయాలపై జ్యోతిషులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారంలో ఇబ్బందులు ఎదురైనా చివరికి విజయం సాధిస్తారు. కీలక సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. అనవసర ఖర్చులపై జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆంజనేయస్వామి ఆరాధన మంచిది.

వృషభం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో సవాళ్లను అధిగమిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు ప్రయోషన్స్, స్థాన చలనం ఉండవచ్చు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. అనారోగ్యానికి గురయ్యే అవకావశం ఉంది. ఇష్టదైవ ధ్యానంతో శుభ ఫలితాలు కలుగుతాయి.


మిథునం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అన్ని రంగాల వారికి శ్రమతో కూడిన విజయాలు పొందుతారు. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారంలో ఊహించని లాభాలు ఉంటాయి. ఉద్యోగాల్లో తోటి వారి సహకారం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. దక్షిణామూర్తి స్తోత్రం శుభప్రదం.

కర్కాటకం:
కర్కాటకరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విజయాలు పొందుతారు. వ్యాపారులకు ఆకస్మిక ధన లాభం ఉంటుంది. విహార యాత్రలకు వెళ్తారు. కుటుంబ సభ్యుల్లో సుఖ సంతోషాలు ఉంటాయి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇష్ట దేవతారాధన మంచిది.

సింహం:
సింహ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ముఖ్యమైన పనుల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రారంభించిన పనులను సహనంతో చేస్తే విజయం వరిస్తుంది. ఉన్నతాధికారుల నుంచి సహకారం ఉంటుంది. మీ రంగాల్లో కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. మంచి చెడులను ఆలోచించి ముందుకు వెళ్లాలి. ఆరోగ్యం క్షీణిస్తుంది. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

కన్య:
కన్య రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. కీలక పనుల్లో శ్రమ, ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఉద్యోగులకు ప్రమోషన్స్, స్తాన చలనం ఉండవచ్చు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి. ఆర్థికంగా లాభం పొందుతారు. ఊహించని లాభాలు అందుకుంటారు. పెండింగ్ బకాయిలు చేతికి అందుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

తుల:
తుల రాశి వారికి మిశ్రమ ఫలితాలు. అన్ని రంగాల వారికి ఆశించిన లాభాలు ఉంటాయి. అనసవర ఖర్చులపై జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉన్నతాధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన మంచిది.

వృశ్చికం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటంకాలు, సవాళ్లు ఉంటాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కీలక పనులను వాయిదా వేస్తే మంచిది. వ్యాపారాల్లో నష్టాలు కలగవచ్చు. అనవసర ఖర్చులు ఉండవచ్చు. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు.

ధనుస్సు:
ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు. ప్రారంభించిన పనులు విజయంగా పూర్తవుతాయి. వ్యాపారాల్లో ఆటంకాలు, ఒత్తిళ్లను జయించి పనులు పూర్తిచేస్తారు. కీలక వ్యవహారాల్లో మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఇతరుల నుంచి ప్రశంసలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ఉత్తమం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. గురు శ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

మకరం:
మకర రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆశించిన పురోగతి ఉంటుంది. ఆదాయం వృద్ది చెందుతుంది. ప్రారంభించిన పనులు విజయవంతమవుతాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలతోపాటు సమాజంలో కీర్తి ప్రతిష్టలు అందుకుంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. గణపతి స్తోత్రం చదివితే బాగుంటుంది.

కుంభం:
కుంభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కీలక పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. వ్యాపారంలో పట్టిందల్లా బంగారం అవుతోంది. మీ ప్రతిభకు గుర్తింపు ఉంటుంది. ఊహించని విధంగా ధన ప్రవాహం ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి గురవుతారు. వృథా ఖర్చులు ఉండవచ్చు. ఆదిత్య హృదయం పారాయణం మంచిది.

మీనం:
మీన రాశి వారికి అనుకూలంగా ఉంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. పెద్దల సహకారంతో విజయం పొందుతారు. వృత్తి, వ్యాపారంలో ఆశించిన లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. హనుమాన్ చాలీసా పారాయణ శుభకరం.

Related News

Bhadra Mahapurush Rajyog Horoscope: ఈ రాశి వారిపై ప్రత్యేక రాజయోగంతో జీవితంలో భారీ అభివృద్ధి

Dussehra 2024 Date: ఈ ఏడాది దసరా పండుగ ఏ రోజున జరుపుకుంటారు? శుభ సమయం, ప్రాముఖ్యత వివరాలు ఇవే

Sun Transit Horoscope: సూర్యుని దయతో ఈ రాశుల వారికి గోల్డెన్ టైం రాబోతుంది

Tirumal Laddu: పవిత్ర తిరుమల లడ్డూ తయారీలో 8 మంది కీలక పాత్ర, ఇంతకీ వాళ్లు ఎవరో తెలుసా?

Tulasi Plant: తులసి పూజ ఎప్పుడు చేయాలి, వాయు పురాణం ఏం చెబుతోందంటే..

Horoscope 20 September 2024: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే! శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం!

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Big Stories

×