EPAPER

Friendship Movies: స్నేహ బంధాన్ని చాటి చెప్పిన సినిమాలు.. ఇప్పుడు చూసినా కన్నీళ్లు ఆగవు..!

Friendship Movies: స్నేహ బంధాన్ని చాటి చెప్పిన సినిమాలు.. ఇప్పుడు చూసినా కన్నీళ్లు ఆగవు..!

Friendship Telugu Movies:అమ్మా, న్నాన్న, అన్నా తమ్ముడు, అక్కా, చెల్లి ఇలా ఎన్నో బంధాలతో కలిపిన దేవుడు స్నేహితుడిని మాత్రం రక్త బంధానికి దూరం పెట్టాడు. అయితే ఒక్కో సమయంలో ఆలోచిస్తే అది బంధం కన్నా ఎక్కువ అనిపిస్తుంది. ఆ సమయంలో బంధం కాదు.. ఒక భావోద్వేగం అని అర్థం అవుతుంది. స్నేహితుడు కష్టాల్లో తోడుంటాడు. సంతోషాన్ని పంచుకుంటాడు. స్వార్థం లేని ఏకైక బంధువు స్నేహితుడు. పరీక్షల్లో ఫెయిల్ అయితే లైట్ మచ్చా అని ధైర్యం చెప్పి ఆనందాన్ని పంచుతాడు. క్లాస్ బంకులు కొట్టించడంలో ముందువరుసలో ఉంటాడు. కొన్ని సమయాల్లో కాస్త కోపంగా కూడా ఉంటాడు. అయితే ఇవన్నీ ఇప్పుడెందుకు చెప్తున్నా అని అనుకుంటున్నారా? ఎందుకంటే రేపు స్నేహితుల దినోత్సవం. అందువల్ల ఫ్రెండ్‌షిప్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన కొన్ని సినిమాల గురించి తెలుసుకుందాం.


ప్రేమ దేశం

ప్రేమ, ఫ్రెండ్షిప్.. ఈ రెండు కాన్సెప్టులతో తెరకెక్కింది. ఈ సినిమాలో ప్రేమకు ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారో.. ఫ్రెండ్ షిప్‌కి అంతే వాల్యూ ఇచ్చారు. ఇద్దరు స్నేహితులు కలిసి ఒకే అమ్మాయిని లవ్ చేసినపుడు వారి మధ్య తలెత్తే సంఘర్షనలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు వివరంగా చూపించారు.


నీ స్నేహం

ఈ చిత్రానికి పరుచూరి మురళీ దర్శకత్వం వహించాడు. ఓ ఆటను ప్రాణంకన్నా ఎక్కువగా ఇష్టపడే స్నేహితుల కథే ఈ సినిమా ఇది. ఇందులో కూడా ఇద్దరు మిత్రులు ఒక అమ్మాయిని ఇష్టడతారు.

హ్యాపీడేస్

Also Read: ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీపై హరీష్ శంకర్‌ ట్వీట్.. హీరో రామ్ సాలిడ్ రిప్లై!

పాదమెటు పోతున్నా.. పయనమెందాకైనా అంటూ సాగే ఈ సాంగ్ వింటే చాలు ఫ్రెండ్ షిప్ విలువేంటో తెలుస్తోంది. కాలేజీ లైఫ్‌లో ఫ్రెండ్స్ ఎలా ఉంటారో ఈ సినిమాలో దర్శకుడు శేఖర్ కమ్ముల చాలా అందంగా చూపించాడు. తిట్టుకోవడం, అమ్మాయిలకు సైట్ వేయడం, కొట్టుకోవడం, సీనియర్స్‌తో గొడవ పడటం ఇలా ప్రతిఒక్క అంశాన్ని తెరకెక్కించి ఆకట్టుకున్నాడు.

స్నేహం కోసం

స్నేహం కోసం సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. పేద ధనిక అనే బేధాబ్రియాలు లేకుండా మిత్రుడిని మిత్రుడిలా చూడాలి అనే కథాంశంతో ఈ సినిమా తెరెక్కింది. ఒక ధనిక స్నేహితుడు, పేద స్నేహితుడు కలిసి ఉన్నచోట పదిమంది ఎన్ని మాటలో అంటారు. వాటిని పట్టించుకోకుండా ఎలాంటి బేధం లేకుండా కలిసి ఉండటాన్ని సినిమాలో చూపించారు.

ఉన్నది ఒకటే జిందగీ

ట్రెండు మారినా ఫ్రెండు మారడే అంటూ స్నేహానికి సరికొత్త అర్థం చెప్పిన సినిమా ఉన్నది ఒకటే జిందగీ. లైఫ్‌లో ఒక స్నేహితుడు ఎందుకు ముఖ్యమో ఈ సినిమాలో చాలా అందంగా చూపించారు.

మహర్షి

మహేశ్ బాబు నటించిన ఈ సినిమాలో అల్లరి నరేష్ అతడి స్నేహితుడిగా నటించాడు. ఈ సినిమాలో ఓ స్నేహితుడి కోసం ప్రపంచ స్థాయి సంస్థకు సీఈఓగా ఉన్న ఓ వ్యక్తి ఏం చేశాడు అనే కథాంశంతో తెరకెక్కింది.

శంబో శివ శంబో

Also Read: విక్రమ్ ‘తంగలాన్’ నుంచి వార్ సాంగ్.. అదిరిపోయిందంతే..

సాధారణంగా ఫ్రెండ్ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా అని చెప్పగానే.. అతడి కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతాడు ఇంకో ఫ్రెండ్. వారిద్దరి కలిపడం కోసం తాను ఎలాంటి పనికైనా సిద్ధపడతాడు. ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొంటాడు. ఆఖరికి ప్రాణాలను పణంగా పెడతాడు స్నేహితుడు. అలాంటి కథాంశంతో తెరకెక్కిందే ఈ సినిమా.

ఓ మై ఫ్రెండ్

ఈ సినిమా అమ్మాయి అబ్బాయిల మధ్య ఉండే ఫ్రెండ్‌షిప్‌కి సంబంధించింది. చిన్ననాటి నుంచి వారి మధ్య చిగురించిన స్నేహం పెళ్లాయ్యాక ఎలా ఉంటుంది. ఆ స్నేహం జీవితాంతం ఉంటుందా లేదా అనే కథాంశంతో తెరకెక్కింది.

కథానాయకుడు

రజినీకాంత్, జగపతి బాబు నటించిన చిత్రం కథానాయకుడు. స్నేహం పై ఉన్న బెస్ట్ మూవీల్లో ఇదీ ఒకటి. ఈ మూవీ స్నేహం గొప్పతన్నాన్ని చాటి చెప్పింది. అయితే ఈ సినిమాలతో పాటు సలార్, మంజుమ్మల్ బాయ్స్‌తో సహా మరెన్నో సినిమాలు స్నేహం విలువను చాటి చెప్పాయి.

Related News

Comedian Sapthagiri: ఇండస్ట్రీకి దూరమయ్యారా లేక దూరం పెట్టారా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Pushpa 2: వార్నర్ మామ ఇండస్ట్రీ ఎంట్రీ,రీల్స్ నుంచి రియల్ సినిమాలోకి

Devara: ఒకవైపు రాజమౌళి హీరో, మరో వైపు త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్ ఇక శివ ను ఆ శివయ్యే కాపాడాలి

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

SSMB29 : మహేష్- రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..!

Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు గా స్టార్ డైరెక్టర్స్?

Big Stories

×