EPAPER

Lord Ram: రాముడి ఉనికిని చెప్పే ఆధారాలేవీ లేవు: డీఎంకే మంత్రి

Lord Ram: రాముడి ఉనికిని చెప్పే ఆధారాలేవీ లేవు: డీఎంకే మంత్రి

Tamil Nadu: తమిళనాడులో ద్రవిడ సిద్ధాంతానికి ఎక్కువ ప్రచారం, గౌరవం ఉన్నది. పెరియార్‌ను గౌరవిస్తారు. ఆయన ఆలోచనలను, తాత్వికతను అభిమానిస్తారు. అందుకే తమిళనాడులో హిందుత్వకు చోటు దక్కడం లేదు. పెరియార్ హిందూ మతాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికీ డీఎంకేలో ఎక్కువ మంది పెరియార్ ఆలోచనా స్రవంతిని అనుసరిస్తారు. ఈ నేపథ్యంలోనే డీఎంకే మంత్రి ఎస్ఎస్ శివశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాముడు నిజంగా చరిత్రలో ఉన్నట్టు, ఆయన ఉనికిని చెప్పే ఆధారాలేవీ లేవని చెప్పారు. రాముడిని కేవలం అవతారం అంటారని, అలాంటప్పుడు అవతారం నిజంగా ఉండేదని ఎలా చెప్పగలమని ప్రశ్నించారు.


చోళ వంశ పాలకుడు రాజేంద్ర చోళ జయంతిని పురస్కరించుకుని అరియలూర్‌లో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా మంత్రి ఎస్ఎస్ శివశంకర్ హాజరై మాట్లాడారు. ‘మనం తప్పకుండా రాజేంద్ర చోళ జయంతిని వేడుక చేసుకోవాలి. మన జన్మభూమికి గౌరవం, వన్నె తెచ్చిన రాజేంద్ర చోళ జయంతిని తప్పకుండా స్మరించుకోవాల్సిందే. లేదంటే.. అసలు ఆధారాలే లేని విషయాలను వేడుక చేసుకునేలా ప్రజలను నెట్టేసే ముప్పు ఉన్నది’ ని శివశంకర్ పేర్కొన్నారు.

‘రాజేంద్ర చోళా నిజంగా ఇక్కడ బతికాడని చూపించడానికి ఆయన నిర్మించిన చెరువులు ఉన్నాయి. ఆయన నిర్మించిన దేవాలయాలు ఉన్నాయి. శిలాశాసనాలు, శిల్పాలు, ఇతర పురాతన వస్తువులపై ఆయన పేరు ఉన్నది. రాజేంద్ర చోళుడి గురించి చరిత్ర, ఆధారాలు ఉన్నాయి. కానీ, రాముడు నిజంగానే బతికాడని చెప్పడానికి ఆధారాలు ఏవీ లేవు. కేవలం మనల్ని తప్పుదోవ పట్టించడానికి, మన చరిత్రను మరుగున పడేయడానికి, వేరే చరిత్రనే గొప్పదని చిత్రీకరించు కుట్రలో భాగంగా ఈ పనులు జరుగుతున్నాయి’ అని శివశంకర్ తెలిపారు.


Also Read: అడవుల్లో అడ్డగోలు దందా! డెక్కన్ సిమెంట్స్‌కు రూల్స్ పట్టవా?

కాగా, తమిళనాడు బీజేపీ చీఫ కే అన్నామళై మంత్రి శివశంకర్‌కు కౌంటర్ ఇచ్చారు. గత వారమే న్యాయ మంత్రి తిరు రఘుపతి.. రాముడిపై ప్రేమ ఒలకబోశారని, సామాజిక న్యాయం, లౌకికత్వాన్ని తెచ్చిన పయనీర్ అని, సమానత్వం కోసం పాటుపడిన వారని రాముడిపై ప్రశంసలు కురిపించారని అన్నామళై గుర్తు చేశారు. ఇప్పుడేమో మరో డీఎంకే మంత్రి అసలు రాముడు అనేవారే లేరని అంటున్నారని, వీరిద్దరూ డిబేట్ పెట్టుకుని ఓ అభిప్రాయానికి రావాలని సెటైర్ వేశారు. తప్పకుండా రఘుపతి నుంచి శివశంకర్ తప్పకుండా రెండు మూడు విషయాలైనా తెలుసుకుంటారని వివరించారు. అన్నట్టు.. ప్రధాని నరేంద్ర మోదీ చోళ వంశానికి చెందిన సెంగోల్‌ను కొత్త పార్లమెంటు కాంప్లెక్స్‌లో పెట్టినప్పుడు వ్యతిరేకించింది వీరే కదా అంటూ చురకలంటించారు.

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×