EPAPER

Flight Passenger Chaos: ‘ఎయిర్ హోస్టెస్ నాతో శృంగారం చేయాలి లేకపోతే దూకేస్తా’.. విమానంలో ప్రయాణికుడి హల్ చల్!

Flight Passenger Chaos: ‘ఎయిర్ హోస్టెస్ నాతో శృంగారం చేయాలి లేకపోతే దూకేస్తా’.. విమానంలో ప్రయాణికుడి హల్ చల్!

Flight Passenger Chaos| ఓ విమానం ఆకాశంలో ప్రయాణిస్తున్న సమయంలో ఓ ప్రయాణీకుడు తోటి ప్రయాణీకులకు, విమాన సిబ్బందికి చుక్కలు చూపించాడు. అందరితో గొడవపడడం, ఒక విమాన సిబ్బందిని గాయపరచడమే కాకుండా.. తనతో ఒక ఎయిర్ హోస్టెస్ శృంగారం చేయాలని లేకపోతే దూకేస్తానని ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. అతడి బెడదనుంచి తప్పించుకోవడానికి విమాన సిబ్బంది నానా కష్టాలు పడ్డారు. ఈ ఘటన అమెరికాలో జరిగింది.


అమెరికా మీడియా కథనాల ప్రకారం.. న్యూ జెర్సీ డెలాన్క్ లో నివసిస్తున్న 26 ఏళ్ల నికోలాస్ గాప్కో.. సియాటిల్ నుంచి డల్లాస్ వెళ్లేందుకు జూలై 18న అమెరికన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ 2101 బోర్డింగ్ చేశాడు. అయితే విమానం గాల్లో ఉండగా.. నికోలాస్ కు ఏమైందో తెలియదు కానీ.. అతను అక్కడ ఉన్న ఒక మహిళా ఎయిర్ హోస్టెస్ తో అసభ్యంగా ప్రవర్తించాడు. తనతో శృంగారం చేయాలని ఆమెతో అన్నాడు. అతని ప్రవర్తన గురించి ఆ ఎయిర్ హోస్టెస్ సీనియర్ సిబ్బందికి ఫిర్యాదు చేసింది.

Also Read:  ‘ఉద్యోగం కావాలంటే బాస్ తో సమయం గడపాలి’.. మహిళకు కండిషన్ పెట్టిన మేనేజర్


ఆ తరువాత విమాన సిబ్బంది అతడిని ప్రశ్నించగా.. వారితో గొడవపడ్డాడు. ఒక కేప్ పెన్ తో వారిపై దాడి చేయబోయాడు. తన బట్టలు విప్పి తనతో శృంగారం చేసేందుకు ఆ మహిళా ఎయిర్ హోస్టెస్ ని పంపించాలని బిగ్గరగా అరిచాడు. దీంతో తోటి ప్రయాణికులు అతడిని నియంత్రించేందుకు ప్రయత్నించగా.. నికోలాస్ ఎమర్జెన్సీ డోర్ వద్దకు వెళ్లి తాను విమానంలో నుంచి దూకేస్తానని బెదిరించాడు. పరిస్థితిని చూసిన విమాన పైలట్ అతడిని శాంత పరిచి.. ముందు ఎమర్జెన్సీ డోర్ వద్ద నుంచి నికోలాస్ ని దూరంగా తీసుకుపోయాడు. అతడు కోరుకున్నట్లు జరుగుతుందని హామీ ఇచ్చి.. టాయ్ లెట్ వద్దకు తీసుకెళ్లి.. అక్కడ మిగతా సిబ్బంది, ప్రయాణీకులంతా కలిసి అతడి కాళ్లు, చేతులు కట్టేశారు. ఆ తరువాత అతడిని టాయ్ లెట్ లో బంధించారు.

అనూహ్య ఘటన జరగడంతో విమాన సిబ్బంది సమీపంలోని సాల్ట్ లేక్ సిటీ ఎయిర్ పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి.. పోలీసులను సంప్రదించారు. ఆ తరువాత నికోలాస్ గాప్కో పై ఫిర్యాదు నమోదు చేసి.. అతడిని ఎయిర్ పోర్ట్ పోలీసులకు అప్పగించారు. నికోలాస్ గురించి విచారణ చేసిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. నికోలాస్ విమాన ప్రయాణానికి ముందు డ్రగ్స్ తీసుకున్నాడని.. అయితే ఆ డ్రగ్స్ భారీ మోతాదులో ఒక్కసారిగా తీసుకోవడంతో అతను కంట్రోల్ తప్పి ప్రవర్తించాడని తెలిపారు. ప్రస్తుతం నికోలాస్ పై కోర్టులో విచారణ సాగుతోంది.

Also Read: ‘కలియుగం.. ఆడవాళ్లు ఇలా కూడా చేస్తున్నారు’.. పాకిస్తాన్ లో డివోర్స్ పార్టీపై ట్రోలింగ్

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×