EPAPER

India vs Sri Lanka: ఉత్కంఠగా సాగిన తొలి వన్డే.. భారత్‌- శ్రీలంక మ్యాచ్‌ టై

India vs Sri Lanka: ఉత్కంఠగా సాగిన తొలి వన్డే.. భారత్‌- శ్రీలంక మ్యాచ్‌ టై

India vs Sri Lanka 1st ODI Tie: కొలొంబో వేదికగా శ్రీలంక, భారత్ జరిగిన తొలి వన్డే మ్యాచ్ టై అయింది. తొలుత టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో శ్రీలంక 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ఇందులో నిశాంక(56), దునీత్(67) హాఫ్ సెంచరీలు చేశారు. భారత్ బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీయగా..సిరాజ్, దుబే, కుల్దీప్, సుందర్ లు తలో వికెట్ పడగొట్టారు.


శ్రీలంక విధించిన 231 లక్ష్యఛేదనలో భారత్ 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ రోహిత్ శర్మ(58) పరుగులతో రాణించాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్(33), కేఎల్ రాహుల్(31), శివమ్ దూబె(25), కోహ్లి (24), అయ్యర్(23) పరుగులు చేశారు. దీంతో 230 పరుగులు చేసి స్కోరు సమం చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. అయితే వన్డే క్రికెట్ చరిత్రలో ఇది 44వ టై మ్యాచ్ కావడం విశేషం. శ్రీలంక బౌలర్లలో చరిత్ అసలంక, హసరంగ 3 వికెట్లు తీయగా..వెల్లలాగే 2 వికెట్లు, ధనుంజయ, అశిత ఫెర్నాండో తలో వికెట్ తీశారు.

Also Read: హాకీలో భారత్ విజయం.. 52 ఏళ్లలో ఆస్ట్రేలియాపై గెలవడం ఇదే తొలిసారి


ఇదిలా ఉండగా, టీ20 సిరీస్ కు విశ్రాంతి తీసుకున్న భారత సీనియర్లు రోహిత్ శర్మతోపాటు విరాట్ కోహ్లి, కుల్ దీప్ సింగ్ బరిలో నిల్చున్నారు. అలాగే శ్రేయస్, కేఎల్ రాహుల్ వన్డే సిరీస్ లో చోటు దక్కించుకున్నారు. మరోవైపు శ్రీలంక జట్టులో పతిరన గాయం కారణంగా వైదొలగగా..అతని స్థానంలో షిరాజ్ కుఅవకాశం దక్కింది.

Related News

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

Big Stories

×