EPAPER

Manda krishna New plan: మందకృష్ణ ప్లాన్ ఏ సక్సెస్.. ప్లాన్ బీ కి బీజేపీ సహకరిస్తుందా?

Manda krishna New plan: మందకృష్ణ ప్లాన్ ఏ సక్సెస్.. ప్లాన్ బీ కి బీజేపీ సహకరిస్తుందా?

Manda krishna madiga today news(Telangana news): ఎస్సీల వర్గీకరణకు దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. వెనుకబాటు తనం ఆధారంగా నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలకు ఉందని తేల్చి చెప్పేసింది. ఈ విషయంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఫుల్‌ఖుషీ. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. మందకృష్ణ వేసిన ప్లాన్ ఒకటి సక్సెస్ అయ్యింది. మరో ప్లాన్ సక్సెస్ అవుతుందా? దీనికి బీజేపీ సహకరిస్తుందా? అన్నచర్చ దేశవ్యాప్తంగా మొదలైంది.


ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్ల పాటు ఎన్నో పోరాటాలు చేశామన్నది ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాట. అయితే మా పోరాటం ఇక్కడ ఆగిపోలేదంటూ కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. ప్రైవేటు సెక్టార్‌లో ఉద్యోగాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ విభాగంలో రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

గత రాత్రి జరిగిన టీవీ డిబేట్లలో చాలామంది నేతలు ఈ విషయాన్ని ప్రస్తావించారు. సుప్రీంకోర్టు ఇప్పుడిచ్చిన తీర్పు 20 ఏళ్ల కిందట ఇస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య క్రమంగా తగ్గుతోందని, ప్రైవేటు సెక్టార్‌లో గణనీయంగా పెరుగుతోంద్నారు. ఇందులో రిజర్వేషన్లు కల్పిస్తే ఎస్సీల వర్గీకరణకు అసలైన న్యాయం జరుగుతుందని తమతమ ఒపీనియన్‌ని బయటపెట్టారు.


ALSO READ: కేసీఆర్ కొత్త ప్లాన్, సబిత‌కు కీలక పోస్టుపై..

ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించే బాధ్యతను బీజేపీ తీసుకుంటుందా? అన్నదే అసలు ప్రశ్న. ఈ విషయంలో బీజేపీ ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రైవేటు సెక్టార్ అనేది కేవలం టాలెంట్‌ తో కూడుకున్నదని, అలాంటి రంగంలో రిజర్వేషన్లు అమలుచేయడం కష్టమని అంటున్నారు. ప్రస్తుతం ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ ఆ దిశగా పావులు కదపాలని ఆలోచన చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన ఓపెన్‌గా చెప్పేశారు. మందకృష్ణ కొత్త డిమాండ్‌కు మోదీ సర్కార్ సానుకూలమా? వ్యతిరేకమా? అనేది తెలియాల్సివుంద.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×