EPAPER

Pension Distribution in AP: మనల్ని ఎవడ్రా ఆపేది.. వాలంటీర్లు లేకుండానే పెన్షన్ పంపిణీ

Pension Distribution in AP: మనల్ని ఎవడ్రా ఆపేది.. వాలంటీర్లు లేకుండానే పెన్షన్ పంపిణీ

Pension distribution in Andhra pradesh(AP latest news): ఏపీలో చంద్రబాబు సర్కార్‌ సరికొత్త రికార్డ్‌ నమోదు చేసింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఈ రికార్డును అందుకుంది. అర్హులైన ప్రతి ఒక్కరి ఇంటికి సక్సెస్‌ఫుల్‌గా వచ్చేసింది పెన్షన్.. వరుసగా రెండోసారి కూడా ఈ ఫీట్‌ను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. అయితే ఈ సక్సెస్ జర్నీ కంటిన్యూ చేసేముందు కొన్ని ప్రశ్నలను మరోసారి తట్టిలేపింది. ఇంతకీ ఆ ప్రశ్నలేంటి? ఈ ప్రశ్నలు కొందరి జీవితాలను మార్చబోతున్నాయా? ఏపీలో పెన్షన్‌ పంపిణీ అంటే మొదట గుర్తొచ్చేది ఎవరు? వాలంటీర్లు.. వాలంటీర్లు లేనిదే అసలు పెన్షన్‌ పంపిణీనే లేదన్నది గత ప్రభుత్వం అంటే వైసీసీ వాదన.. కానీ గడచిన రెండు నెలలుగా ఒక్క వాలంటీర్‌ హెల్ప్‌ లేకుండానే సక్సెస్‌ఫుల్‌గా పెన్షన్‌ను పంపిణీ చేసింది ప్రస్తుత కూటమి ప్రభుత్వం. సచివాలయ సిబ్బందే ఇంటింటికి వెళ్లి పెన్షన్‌ పంచేశారు అధికారులు. ఎలాంటి కన్ఫ్యూజన్‌.. వివాదం లేకుండా సింపుల్‌గా సచివాలయ ఉద్యోగులతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది ఏపీ ప్రభుత్వం..


ప్రభుత్వ పెద్దలు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పెన్షన్‌ అందించడం ఇంపాజిబుల్ అన్నారు. అలా చేయడం సాధ్యం కాదన్నారు. కానీ చంద్రబాబు ఇప్పుడా అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. గత నెలలో ఏమో మే, జూన్, జులై ఎరియర్స్ కలిపి ఏకంగా 7 వేల రూపాయలు అందించారు. ఇప్పుడేమో పెంచిన పెన్షన్‌ ప్రకారం.. ప్రతి ఒక్క అర్హుడికి నాలుగు వేల రూపాయలను అందించారు. మొత్తం 2 వేల 700 కోట్ల నిధులను అర్హులకు అందించారు సచివాలయ అధికారులు. గత నెలలో.. ఇప్పుడు.. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 25 వేల మంది గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది మాత్రమే పెన్షన్‌ పంపిణీలో పాల్గొన్నారు.

అంతా బాగానే ఉంది. మరి ఇలా సంక్షేమ పథకాలనే ప్రజలకు అందించడానికి వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను తీసుకొచ్చింది. వారికి అరకొర జీతాలిచ్చి వారి సేవలను వాడుకుంది. వాలంటీర్లు గ్రౌండ్ లెవల్‌లో పనులు చేస్తుంటే..ఐదేళ్ల పాటు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది కార్యాలయాలకే పరిమితమయ్యారు. కానీ ఇప్పుడు టైమ్ మారింది. వాలంటీర్లను ప్రభుత్వం పక్కన పెట్టేసింది. ఒక్క వాలంటీర్‌ సేవలను ఉపయోగించకుండానే పనులు చక్క పెట్టేసింది. వాలంటీర్లు లేకపోతే పెన్షన్ల పంపిణీ జరగదని విమర్శించిన వైసీపీ నేతలకు మూతోడ్ జవాబిచ్చింది. మరిప్పుడు వాలంటీర్ల భవిష్యత్తేంటి? వారి సేవలను ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగించుకోబోతుంది?


చంద్రబాబు ఏమో ఎలక్షన్స్ ముందు వాలంటీర్ల ఉద్యోగాలకు తానే గ్యారెంటీ అని చెప్పారు. వారికిచ్చే సాలరీలను 10 వేలకు పెంచుతామన్నారు. మరిప్పుడేమో వారి సేవలనే వినియోగించుకోవడం లేదు. కానీ ప్రభుత్వం ఇప్పుడు కూడా అదే మాట చెబుతోంది. వాలంటీర్ల సేవలను తప్పనిసరిగా ఉపయోగించుకంటాం.. కానీ ఇంకో విధంగా. మరీ ఎలా అనేది ఇంకా తేల్చలేదు. ఏపీలో మొత్తం 2లక్షల 54 వేల 832 మంది వాలంటీర్లు ఉన్నారు. వీరిలో లక్షా 28వేల 179 మంది రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.రాజీనామా చేసినవారంతా ఇటీవల తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. కొందరు టీడీపీ నేతలేమో అసలు వాలంటీర్‌ వ్యవస్థ అవసరమే లేదంటున్నారు.

Also Read: మళ్లీ బెంగుళూరు జగన్, యలహంక ప్యాలెస్‌లో ఏం జరుగుతోంది?

ఇటీవల సర్పంచ్‌ల సంఘం అసలు వాలంటీర్ వ్యవస్థను మొత్తం రద్దు చేయాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసింది. అయితే ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు, వారి జీతాల పెంపుపై కూటమి ప్రభుత్వం ఓ చిన్న అధ్యయనం చేస్తున్నట్టు తెలుస్తోంది. అసలు వాలంటీర్ల వ్యవస్థ విధివిధానాలు ఏంటి ? వీరి పదవీకాలం ఎంత ? ఓసారి వాలంటీర్ల లెక్కలను చూస్తే.. రాజీనామా చేసిన వారి సంఖ్య లక్షా 9 వేలు..విధుల్లో ఉన్న వాలంటీర్ల సంఖ్య లక్షా 53 వేలు.. పీజీ చేసిన వారు 5 శాతం.. డిగ్రీ చేసిన వారు 32శాతం.. డిప్లమో చేసిన వారు 2శాతం. ఇంటర్‌ పూర్తి చేసిన వారు 48శాతం. పదో తరగతి పాసైన వారు 13శాతం. ఇవీ ఇప్పటి వరకు వీరి గురించి తెలిసిన డేటా. వీరందరికి స్కిల్ డెవలప్‌మెంట్‌ కింద శిక్షణ ఇవ్వాలన్న ఆలోచైనేతే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం వద్ద ఉంది.

అయితే ఎన్నికల హామీ ప్రకారం ప్రస్తుతం ఉన్న వాలంటీర్లకు జీతాల్ని 5 వేల నుంచి 10 వేలకు పెంచాలి. అలా పెంచితే ఏటా 1848 కోట్లు ఖర్చవుతుందనేది అధికారుల అంచనా. ప్రస్తుతం ఏపీ ఉన్న ఆర్థిక పరిస్థితిలో అలా చేస్తే ఓ సాహసమనే చెప్పాలి. అసలు వారి సేవలను ఎలా వినియోగించుకోవాలన్నదే ఇంకా తేలలేదు. సేవలు చేయించుకోకుండా జీతాలు పెంచి మరీ ఎలా ఇస్తారనేది? మరో డౌట్.. వారికి జీతాలు ఇవ్వాలన్నా.. పెరగాలన్నా.. ముందుకు వాలంటీర్ వ్యవస్థను ఉంచాలా? వద్దా? అనేది తేలాలి.. ఒకవేళ ఉంచితే వారి సేవలను ఎలా వినియోగించుకోవాలో నిర్ణయం జరగాలి. అప్పుడు మాత్రమే వారికి జీతాల పెంపు గురించి ప్రభుత్వం ఆలోచించేలా కనిపిస్తోంది. కానీ అప్పటి వరకు మాత్రం వాలంటీర్ల పరిస్థితి మాత్రం అడకత్తెర పొక చెక్కలాంటి పరిస్థితే..

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×