EPAPER

Bangladesh: అల్లర్లకు కారణమైన ఆ గ్రూప్ పై నిషేధం..బంగ్లాదేశ్ కీలకనిర్ణయం

Bangladesh: అల్లర్లకు కారణమైన ఆ గ్రూప్ పై నిషేధం..బంగ్లాదేశ్ కీలకనిర్ణయం

Bangladesh Govt bans Jamaat-e-Islami(Latest world news): బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల అంశం ఆ దేశాన్ని కుదిపేస్తోంది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఇప్పటికే పలు దేశాలకు చెందిన విద్యార్థులు తమ దేశాలకు తిరుగు ప్రయాణమయ్యారు. భారత ఎంబసీ కూడా చొరవచూపి ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థులను భారత్ కు రప్పించింది. భారత్ తో పాటు పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంక, సింగపూర్ విద్యార్థులను కూడా భారత్ సహకారంతో తమ దేశాలకు సురక్షితంా చేరుకున్నారు. అయితే ఇప్పటిదాకా జరిగిన హింసాత్మక సంఘటనలలో రెండు వందలకు పైగా మృతి చెందారు.


భయాందోళనలో విద్యార్థి లోకం

రిజర్వేషన్ల గొడవలతో బంగ్లాదేశ్ కు వెళ్లేందుకు ఇతర దేశాల విద్యార్థులు భయపడుతుండగా..ఇప్పటికే అక్కడ ఉన్నవారు సైతం తమ దేశాలకు పంపించాల్సిందిగా బంగ్లాదేశ్ ను కోరుతున్నారు. అయితే బంగ్లాదేశ్ మాత్రం భరోసా ఇస్తోంది. విద్యార్థులకు వచ్చిన ప్రమాదం ఏదీ లేదని అవసరమైతే భద్రత పెంచుతామని చెబుతోంది. అయితే ఇంతలా ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్న హింసాత్మక సంఘటనల వెనుక ఇస్లామిక్ గ్రూప్ కు చెందిన రాడికల్ విద్యార్థి సంఘమేనని బంగ్లాదేశ్ గుర్తించింది. ఇప్పుడు ఆ రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూప్ ను ఆ దేశంలో నిషేధిస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రెండు సంస్థలుగా ఉన్న ఈ గ్రూప్ లో విద్యార్థి సంఘాల గ్రూప్ అందులో ఒకటి.


రెండు గ్రూపులపై నిషేధం

ఇప్పుడు ఇస్లామిస్ట్, రాడికల్ ఇస్లామిస్ట్ రెండు గ్రూపులపై నిషేధాజ్ణలు జారీ అయ్యాయి. ఇప్పటిదాకా రాజకీయ పార్టీ గుర్తింపు ఉన్న ఇస్లామిస్ట్ గ్రూప్ ఇకపై రాజకీయ కార్యకలాపాలకు దూరం కావలసి వస్తుంది. బంగ్లాదేశ్ లోనే అతి పెద్ద ఇస్లామిస్ట్ సంస్థగా పరిగణించబడే జమాత్ ఏ ఇస్లామీ సంస్థ 1941 లో ప్రారంభించబడింది. బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఉండాలని అప్పట్లో 1971 సంవత్సరం దాకా పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాటాలు చేసిన సంస్థ. ఇప్పుడు ఇదే సంస్థనుంచి పుట్టుకొచ్చినవే బంగ్లాలో నిషేధించబడిన ఇస్లామిస్ట్ సంఘాలు. బంగ్లాదేశ్ లో 18(1) సెక్షన్ ప్రకారం ఇకపై ఈ రెండు సంస్థలు టెర్రరిస్ట్ సంస్థలుగా పరిగణించబడతాయి.

Related News

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Longest working hours: ఈ దేశాలకి వెళ్లే అవకాశం వచ్చినా వెళ్ళకండి.. అత్యధిక పని గంటలు ఉన్న దేశాలు ఇవే..

Big Stories

×