EPAPER

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి ఊహించని ఆదాయం!

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి ఊహించని ఆదాయం!

Astrology Today: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం..మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది ? ఏ రాశి వారికి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి సామాన్యంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ప్రయోషన్స్ ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో  కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.

వృషభం:
ఈ రాశి వారికి అనుకూలంగా లేదు. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. పెద్దల సలహాలను పాటిస్తే ఆటంకాల నుంచి దూరమవుతారు. ఉద్యోగం, వ్యాపారాల్లో విపరీతమైన పోటీ ఉంటుంది. అనారోగ్యంపై నిర్లక్ష్యం చేయకూడదు. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆదాయాన్ని మించి ఖర్చులు ఉంటాయి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణ చేస్తే మంచిది.


మిథునం:
మిథున రాశి వారికి అనుకూలంగా ఉంది. ముఖ్యమైన పనుల్లో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. అన్ని రంగాల వారికి లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కీలక సమయాల్లో డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కనకధారాస్తవం చదవాలి.

కర్కాటకం:
ఈ రాశి వారికి మిశ్రమ కాలం. వృత్తి, వ్యాపారాల్లో చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురై నష్టం జరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన పనుల్లో పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. అనవసర విషయాలకు సమయం వృథా కాకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఉదాసీనంగాలేకపోతే మానసిక అశాంతి తప్పదు. ఇతరులతో వాదనలు మంచివి కావు. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. శివారాధన శుభప్రదం.

సింహం:
సింహ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైన విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారంలో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు స్థాన చలనం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. తోటివారి సహకారం ఉంటుది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శ్రీఆంజనేయుడిని ఆరాధించాలి.

కన్య:
ఈ రాశి వారికి శుభకరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆటంకాలు ఎదురైన దృఢసంకల్పంతో విజయం పొందుతారు. ఉద్యోగులకు అభివృద్ధి, పదోన్నతి ఉంటుంది. కుటుంబ వాతావరణం శాంతియుతంగా ఉంటుంది. ఉద్యోగులకు ఊహించని ఆదాయం ఉంటుంది. ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆంజనేయస్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

తుల:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అభివృద్ది ఉంటుంది. అన్ని రంగాల వారికి ఊహించని లాభాలు ఉంటాయి. పెద్దల సహకారంతో మంచి ఫలితాలు పొందుతారు. కీలక సమయాల్లో ఆర్థిక సహకారం అందుతుంది. ప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యం క్షీణిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

వృశ్చికం:
వృశ్చిక రాశి వారికి అనుకూలంగా లేదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో ఒత్తిడి పెరగవచ్చు. శ్రీరామ నామాన్ని స్మరించాలి.

ధనుస్సు:
ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. కీలక సమయాల్లో సహకారం ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. దుర్గాస్తుతి చదివితే మంచిగా ఉంటుంది.

మకరం:
మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. సహోద్యోగుల సహకారంతో కీలక పనులను పూర్తి చేస్తారు. విదేశీ ప్రయాణాలు ఉండే అవకాశం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వాదనలకు దూరంగా ఉండడం మంచిది. శ్రీలక్ష్మి గణపతి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

కుంభం:
కుంభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. వృథా ప్రయాణాలు ఉండవచ్చు. వ్యాపారంలో భాగస్వాముల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలహాలు ఏర్పడతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

మీనం:
మీన రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశించిన లాభాలు ఉంటాయి. కీలకమైన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. శ్రీ దుర్గాదేవి ధ్యానం మంచిది.

Related News

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Vriddhi Yog Horoscope: ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు

Guru Vakri 2024 : మరో 20 రోజుల్లో బృహస్పతి తిరోగమనం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారు

Budh Shani Yuti Horoscope: బుధ-శని సంయోగంతో ఈ 3 రాశుల వారు సంపదను పొందబోతున్నారు

Horoscope 19 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ధనలాభం!

Budh Gochar 2024: కన్య రాశిలో బుధుడి సంచారం.. వీరికి అన్నీ శుభవార్తలే

Big Stories

×