EPAPER

MS Dhoni : అవే అత్యంత బాధాకర క్షణాలు: ఎంఎస్ ధోనీ

MS Dhoni : అవే అత్యంత బాధాకర క్షణాలు: ఎంఎస్ ధోనీ

MS Dhoni latest news(Cricket news today telugu): భారత క్రికెట్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోనీ ఒకరు. తనకి కూడా ఒక అసంత్రప్తి ఉందని, కెరీర్ లో మరిచిపోలేని క్షణాలు ఉన్నాయని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం.. ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అటు వన్డే ప్రపంచకప్, ఇటు టీ 20 ప్రపంచకప్ తీసుకొచ్చిన కెప్టెన్ గా ధోనీకి ఎనలేని పేరుంది.


ప్రతీ ఫార్మాట్ లోనూ తన సారథ్యంలో టీమ్ ఇండియాకి మంచి రికార్డే ఉంది. మరి అలాంటి ధోనీ చెప్పిన మాటేమిటంటే.. తన రిటైర్మెంట్ ను ఘనంగా ముగిద్దామని అనుకున్నా.. అది సాధ్యపడలేదని అన్నాడు. 2019 ప్రపంచకప్ సెమీఫైనల్ లో టీమ్ ఇండియా ఓటమి పాలైంది. అదే నా చివరి ప్రపంచకప్ అని తెలుసు. అది గెలిచి, కెరీర్ ని ఘనంగా ముగిద్దామని అనుకున్నానని అన్నాడు.

ఆ రోజు న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో గెలుపు ముంగిట ధోనీ రన్ అవుట్ అయ్యాడు. దీంతో టీమ్ఇండియా ఓటమి పాలైంది. ఆ ఓటమి నుంచి బయటపడేందుకు చాలా సమయం పట్టిందని అన్నాడు. క్రికెట్ పరంగా నా కెరీర్ లో నన్ను అత్యంత బాధపెట్టిన క్షణాలవేనని అన్నాడు. నిజానికి నా రిటైర్మెంట్ చాలా పేలవంగా ముగిసిందని అన్నాడు.


Also Read : బుల్లెట్ దిగింది.. స్విప్నిల్‌కు కాంస్యం, ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడో పతకం

అయితే ఫలితం ఎలా ఉన్నా.. మనం తీసుకోవాలి. ముందుకు సాగిపోవాలి అని అన్నాడు. ఆ తర్వాత నేనింక అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడలేదని అన్నాడు. విజయం కోసం చివరి వరకు తీవ్రంగా శ్రమించామని అన్నాడు. కానీ గెలవలేకపోయామని తెలిపాడు. ఆ బాధ ఇంకా ఉండటం వల్లే, ఇప్పటికి చెబుతున్నానని అన్నాడు.

క్రికెట్ లో నాకు నచ్చిన క్రికెటర్లు ఎవరంటే ఏమని చెప్పను. అందరూ నాకిష్టమైన వాళ్లేనని అన్నాడు. రోహిత్, కొహ్లీ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అని అడుగుతుంటారు. నాకు ఇద్దరి గురించి తెలుసునని నవ్వుతూ అన్నాడు. బౌలర్ల గురించి చెప్పాలంటే మాత్రం బుమ్రా.. నా ఫేవరెట్ బౌలర్ అని అన్నాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కి ఐదుసార్లు టైటిల్స్ అందించాడు. 2024 సీజన్ లో అక్కడ కూడా కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేశాడు. 2025 సీజన్ కి ఆటగాడిగా ఉంటాడో లేక రిటైర్మెంట్ ఇచ్చేస్తాడో వేచి చూడాల్సిందే.

Related News

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

Big Stories

×