EPAPER

Shahrukh and Kavya Maran: ఎందుకీ గొడవ : షారూఖ్, కావ్య మారన్ బాధేంటి?

Shahrukh and Kavya Maran: ఎందుకీ గొడవ : షారూఖ్, కావ్య మారన్ బాధేంటి?

Shahrukh and Kavya Maran news(Latest sports news telugu): ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలం నిర్వహణపై ఫ్రాంచైజీలతో ఏర్పాటు చేసిన బీసీసీఐ సమావేశంలో షారూఖ్, కావ్య మాటలు నెట్టింట పెద్ద చర్చకు తెరతీసింది. అయితే షారూఖ్ మెగా వేలం నిర్వహణపై గట్టిగా వాదించాడు. ఆగ్రహంతో ఊగిపోయాడు. అయితే కావ్య మారన్ మాత్రం తన వంతు వచ్చినప్పుడు చాలా వివరంగా చెప్పింది. ఇంతకీ తనేం చెప్పిందంటే..


ఒక జట్టును తయారుచేసుకోవడానికి ఎంతో సమయం పడుతుంది. అందులో ఎంతో శ్రమ, కష్టం దాగుంటుంది. అన్నింటికి మించి అదెంతో ఖర్చుతో కూడుకున్నది. వారికి ట్రైనింగు, శిక్షణ ఇదంతా పెద్ద ప్రోసెస్ అని చెప్పింది. ఇంత చేసిన తర్వాత.. వారు బాగా పెర్ ఫార్మెన్స్ చేస్తున్న సమయంలో.. మెగా వేలం అని పెట్టి, మేం తయారుచేసుకున్న మంచి ఆటగాళ్లను ఎవరో ఎత్తుకెళ్లిపోతే ఎలా? అని మండిపడింది.

ఇప్పుడు మళ్లీ మేం కొత్తవాళ్లని తీసుకోవాలి, వారితో ప్రయోగాలు చేయాలి, ఆ వైఫల్యాలు అనుభవించాలి. అప్పుడు ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరు స్థిరంగా ఉన్నారని ఆలోచించి.. ఒక బలమైన జట్టును రూపొందించడానికి చాలా సమయం పడుతోందని కావ్యా మారన్ వ్యాఖ్యానించారు. యువ క్రికెటర్ అభిషేక్ శర్మ స్థిరమైన ప్రదర్శన చేయడానికి మూడేళ్లు పట్టిందని, ఈ విషయాన్ని అందరూ అంగీకరిస్తారనే అనుకుంటారని ఆమె ప్రస్తావించారు.


ఇతర జట్లలో కూడా ఇటువంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయని అన్నారు. మొత్తంగా మెగా వేలం పట్ల ఆమె వ్యతిరేకత వ్యక్తం చేశారు. కాగా ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఛాంపియన్‌గా నిలవగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఇప్పుడు మెగా వేలం పెడితే ఈ రెండు జట్లలో ఎంతమంది ఉంటారో తెలీదు. ఎందుకంటే ఇప్పుడే వీళ్లకి విన్నింగ్ టీమ్ ఒకటి సెట్ అయ్యింది. అటు బౌలింగు, ఇటు బ్యాటింగుల్లో సమతూకంగా ఉంది. ఇప్పుడదే వీరి బాధగా ఉంది.

Also Read : రవిశాస్త్రి వ్యాఖ్యలు.. ధోని సరసన రోహిత్ శర్మ అంటూ..

అయితే మెగా వేలం పేరు చెప్పి జట్టు మొత్తాన్ని మార్చరు. కాకపోతే నలుగురు ఆటగాళ్లను తమ వద్దే ఉంచుకునే అవకాశాన్ని ఐపీఎల్ నిర్వాహకులు ఫ్రాంచైజీలు ఇస్తున్నారు. ఒక ఉదాహరణ చూస్తే.. హైదరాబాద్ నుంచి ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ లను ఉంచుకుంటే, మరొకరిని ఎంపిక చేసుకోవడం కత్తిమీద సాములా మారింది.

ఆ ఒక్కడిలో ఎవరిని ఎంపిక చేసుకోవాలో మీరు కూడా ఆలోచించి చెప్పండి. హైదరాబాద్ జట్టులో స్టార్ ప్లేయర్లు.. మార్కో జాన్సన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, మార్క్రమ్, రాహుల్ త్రిపాఠి, క్లాసెన్, మయాంక్ అగర్వాల్, హసరంగ, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ ఇలా చాలా లిస్టే ఉంది.

ఇప్పుడు వీరిలో ఒకరిని ఉంచుకుని మిగిలినవారిని వదిలేయాలి. అదే పరిస్థితి కోల్ కతాలో కూడా ఉంది. ఎందుకంటే 2024 టైటిల్ విన్నర్ టీమ్ అది. ఇప్పుడు దాన్ని కెలుక్కోవడం వారికి బాధగా ఉంది. ఇదే షారూఖ్, కావ్య మారన్ వ్యక్తం చేశారు. ఇప్పుడదే నెట్టింట వైరల్ గా మారింది.

Related News

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

IND vs BAN: ఇది గంభీర్ కు పరీక్ష.. రేపటి నుంచి బంగ్లాతో తొలిటెస్టు

IPL 2025: ముంబైలో ప్రకంపనలు…కొత్త కెప్టెన్​ అతడే..రోహిత్‌, పాండ్యా ఔట్‌?

Women’s T20 World Cup 2024: మహిళల టీ 20 ప్రపంచకప్.. వారితో సమానంగా.. ప్రైజ్ మనీ

Big Stories

×