EPAPER

Chandrababu Naidu| ఆంధ్రలో పారిశ్రామిక అభివృద్ధిపై చంద్రబాబు ఫోకస్.. వంద రోజుల్లో కీలక పాలసీలు!

Chandrababu Naidu| ఆంధ్రలో పారిశ్రామిక అభివృద్ధిపై చంద్రబాబు ఫోకస్.. వంద రోజుల్లో కీలక పాలసీలు!

Chandrababu Naidu latest news(Andhra politics news): ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ర్టంలో పారిశ్రామిక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. చిన్న పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటి, ఎలెక్ట్రానిక్స్, టెక్స్ టైల్స్ పరిశ్రమలు ఏపీలో అభివృద్ధి చేయడానికి అయిదు ప్రత్యేక పాలసీలు రూపొందించాలని పరిశ్రమల శాఖ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ పాలసీలు వంద రోజుల్లో రూపొందించాలని.. రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఉండాలని ఆయన సూచనలు చేశారు. చంద్రబాబు పరిశ్రమల శాఖ అధికారులతో ఓ రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు.


Also Read: అదే స్వామిభక్తి ! ప్రభుత్వం మారినా.. మారని పోలీసుల తీరు

సిఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నాలుగు పారిశ్రామిక కేంద్రాలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో నిరంతరం కృషి చేస్తున్నారు. కుప్పం, ములాపేట్, చిలమట్టూరు, దోణకొండ ప్రాంతాలలో ఈ పారిశ్రామిక కేంద్రాలు చంద్రబాబు ప్లాన్. ఫార్మా, ఎలెక్ట్రానిక్, ఫుడ్ ప్రాసెసింగ్, హార్డ్ వేర్ పరిశ్రమలకు ఈ నాలుగు ప్రాంతాల వనరులు ఉపయోగకరంగా ఉంటాయని సిఎం చంద్రబాబు సమావేశంలో అధికారులకు సూచించారు. వీటితో పాటు కృష్టపట్నం, ఓర్వకల్, నక్కపల్లి, కొప్పర్తి ప్రాంతాలన కూడా పరిశీలించాలని చెప్పారు. మాలవల్లి ప్రాంతంలో పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు భూములు కేటాయించేందుకు స్థలాల ధరలను తగ్గించాలని అన్నారు.


ALSO READ: వైసీపీలో ఏం జరుగుతోంది? జగన్ కంటే కేతిరెడ్డి బెటర్..

ఈ సమావేశం ముగిసిన తరువాత పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పరిశ్రమ అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ఈ కారణంగా పెట్టుబడులు కరువయ్యయని ఆయన చెప్పారు. ”ఆంధ్ర ప్రదేశ్ లో దాదాపు 1382 ఎకరాల భూమిని పరిశ్రమల అభివృద్ధి కోసం సమీకరించి దాన్ని హౌసింగ్ ప్లాట్ల కోసం జగన్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో చిన్న పరిశ్రమల ఏర్పాటు కోసం టిడిపి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని హామీ ఇచ్చారు.

Also Read: ఆగస్టు 2న ఏపీ కేబినెట్ భేటీ.. ఏం చర్చించబోతున్నారంటే..?

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×